47 డేస్ చిత్రం కోసం రఘుకుంచె స్వరపరచిన ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. లక్ష్మీ భూపాల్ గారి సాహిత్యం, నీహా కడివేటి గాత్రం చాలా చక్కగా కుదిరాయి ఈ పాటకి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : 47Days (2018)
సంగీతం : రఘు కుంచె
సాహిత్యం : లక్ష్మీభూపాల
గానం : నీహ కడివెటి
క్యాకరూఁ.. మై క్యాకరూఁ
ఆ నవ్వు చూస్తే మాటరాదే క్యాకరూఁ..
పావురాయల్లే నేను పోతుంటే
నీలి మబ్బై దారి కాచాడే
తేనె చుక్కల్లే జారిపోతుంటే
తుమ్మెదల్లే తాను మారాడే
ఓ మాహివే.. మాహివే..
ఓ మాహివే.. మాహివే..
క్యాకరూఁ.. ఎంత గడుసోడే
క్యాకరూఁ.. సొంతమయ్యాడే
మనసు నాకైనా చెప్పకుండానే
ఎప్పుడో తనతో వెళ్ళిందా
వయసు రాగానే ఎదురుగా తానే
ఎన్నడో ముడిపడిపోయిందా
ఓయ్ నేస్తమా నా ప్రాణమా
నా తోడుగా ఉంటావనే
వున్నానులే నీ కోసం
చిరుగాలి పరదాల్లో
అలసిన కలువగ
చెలియను ఐతే
క్యాకరూఁ.. ఓ మాహివే
మై క్యాకరూఁ.. ఎంత గడుసోడే
పచ్చబొట్టల్లే మారిపోయాడే
వెచ్చగా నాలో కలిశాడే
కాలి మెట్టల్లే చుట్టుకున్నాడే
జంటగా నాతో నడిచాడే
ఓ అమ్మలా ఈ జన్మలా
కలిశావులే కల కాదుగా
విడిపోనులే చితినైనా
మనసంతా నువ్వైతే
నేనని నువ్వని వేరౌతానా
క్యాకరూఁ..మై క్యాకరూఁ..
ఆ నవ్వు చూస్తే మాటరాదే క్యాకరూఁ..
పావురాయల్లే నేను పోతుంటే
నీలి మబ్బై దారి కాచాడే
తేనె చుక్కల్లే జారిపోతుంటే
తుమ్మెదల్లే తాను మారాడే
2 comments:
ఈ కొత్తగా వచ్చే మూవీస్ అన్నింటిలో ఒకటో రెండో మెలొడీస్ కంపల్సరీగా ఉంటున్నాయి..లాంగ్ స్టాండింగ్ కాకపోయినా..వినడానికి హాయిగా ఉంటున్నాయి..
అవును శాంతి గారు.. సినిమా పెద్ద హిట్ కాకపోయేసరికి ఇలాంటి పాటలు కూడా త్వరగా మరుగున పడిపోతున్నాయ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.