శుక్రవారం, డిసెంబర్ 14, 2018

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా...

గీత గోవిందం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గీత గోవిందం (2018)
సంగీతం : గోపి సుందర్
సాహిత్యం : శ్రీమణి
గానం : చిన్మయి

అక్షరం చదవకుండా
పుస్తకం పేరు పెట్టేసానా
అద్బుతం ఎదుటనున్నా
చూపు తిప్పేసానా

అంగుళం నడవకుండా
పయనమే చేదు పొమ్మన్నానా
అమృతం పక్కనున్నా
విషములా చూసానా

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా...
నాకే తెలియని నన్నే నేడు కలిసా...
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా...
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా...

రా ఇలా రాజులా నన్నేలగా
రాణిలా మది పిలిచెనుగా
గీతనే దాటుతూ చొరవగా
ఒక ప్రణయపు కావ్యము లిఖించరా
మరి మన ఇరువురి జత గీత గోవిందంలా

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా...
నాకే తెలియని నన్నే నేడు కలిసా...
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా...
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా...

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా...
నాకే తెలియని నన్నే నేడు కలిసా...
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా...
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా...


2 comments:

చాలాకాలం తరవాత చాలా అందమైన మూవీ చూశాము..అమ్మంటే ప్రకృతి..యే భార్యా అమ్మ కాలేదు..అలా మార్చుకోవాలి అన్న మాటలు హైలైట్ యీ మూవీకి..పాటలన్నీ చాలా బావున్నాయి..

అవును శాంతి గారు సినిమా నాక్కూడా చాలా నచ్చింది.. థాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.