శనివారం, డిసెంబర్ 01, 2018

ఎదనింగీ మేఘమే తానూ...

ప్రియా ప్రియతమా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రియా..ప్రియతమా (2011)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : భువనచంద్ర
గానం : టిప్పు

ఎదనింగీ మేఘమే తానూ
స్వరగంగా రాగమే తానూ
పగలొచ్చే తారకే తాను
తానేలే నా చెలియా


హరివిల్లు చిన్నెలే తాను
విరిజల్లు చినుకులే తాను
వెదజల్లే వెన్నెలే తాను
తానేలే నా చెలియా

చూసేటీ కన్నులున్నవి
కన్నులకు మాట రాదులే
మాటాడే పెదవులున్నవి
పెదవులకు కళ్ళులేవులే
తను నేనే తను నేనే
ప్రేమించా ప్రేమించా

తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ

ఎదనింగీ మేఘమే తానూ
స్వరగంగా రాగమే తానూ
పగలొచ్చే తారకే తాను
తానేలే నా చెలియా


కన్నులు రెండూ కలగను వేళా లేలెమ్మనే
లేచేసరికి దూరం జరిగి పోపొమ్మనే
దూరంగున్నా విరహంలోనా రారమ్మనే
తానే దోచీ మళ్ళీ నన్ను మనసిమ్మనే
తను చెంతకు చేరగనే నా నీడే రెండాయే
తన పేరె వినగానే గిలిగింతే మెండాయే
పెదవులు సుధలే కురిసినవీ
పులకింతల్లో మురిసినవీ
నను చంపేసిందీ చూపుతో
నను బతికించిందీ నవ్వుతో

తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ


గిల్లీ గిల్లీ ముల్లులాంటీ చూపేసిందీ
అల్లిబిల్లీ అల్లరితోటీ ఊపేసిందీ
వెల్లువంటీ ఆశలు నాలో రేపేసిందీ
అల్లుకుపోగా ఆగాలంటూ ఆపేసిందీ
తానుంటే వేసవులే వెన్నెలలై విచ్చునులే
తనులేకా వెన్నెలలే వేసవులై గుచ్చునులే
లోకంలోనా తానే ఒక అద్భుతమూ
హాయ్ తనకే జీవితం అంకితమూ
తన కాలికి మువ్వై మోగనా
తన పెదవుల నవ్వై సాగనా

తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ 


4 comments:

పాట బావుందండి..ఇదే వినడం..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

విద్యాసాగర్ గారి ట్యూన్స్ చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఈ సినిమా విజయవంతం కానందువల్ల చక్కని ఆర్కెస్ట్రాతో ఉన్న పాటయినా గానీ దీన్ని చాలా తక్కువమందే వినిఉంటారు. పాట పంచుకున్నందుకు ధన్యవాదాలు.

థాంక్స్ ఫర్ ద కామెంట్ భవానీ ప్రసాద్ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.