పడిపడి లేచే మనసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పడిపడి లేచె మనసు (2018)
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం : కృష్ణకాంత్ (కెకె)
గానం : అర్మాన్ మాలిక్, సింధూరి విశాల్
పద పద పద పదమని
పెదవులిలా పరిగెడితే
పరి పరి పరి విధముల
మది వలదని వారిస్తే
పెరుగుతోందే మదికాయాసం
పెదవడుగుతోందే చెలి సావాసం
పాపం బాధ చూసి
రెండు పెదవులొక్కటవ్వగా
ప్రాణం పోయినట్టే పోయి వస్తే
పడి పడి లేచె పడి పడి లేచె
పడి పడి లేచె మనసు
ప్రళయంలోను ప్రణయంతోనే
పరిచయమడిగే మనసు
అది నువ్వని నీకే తెలుసు
చిత్రంగా ఉందే చెలీ చలి చంపే నీ కౌగిలి
నా బంధీగా ఉంటే సరి చలి కాదా మరి వేసవి
తపస్సు చేసి చినుకే నీ తనువు తాకెనే
నీ అడుగు వెంటె నడిచీ వసంతమొచ్చెనే
విసిరావలా.. మాటే వలలా..కదిలానిలా
పడి పడి లేచె.. పడి పడి లేచె..
పడి పడి లేచె మనసు..
ప్రళయంలోను ప్రణయంతోనే
పరిచయమడిగే మనసు
అది నువ్వని నీకే తెలుసు
2 comments:
ఈ మూవీ "పడి పడి" వరకే కరెక్టనుకుంటా..నైస్ సాంగ్..
అవునండీ సెకండాఫ్ అంతా ఖంగాళీ చేసేశాడు.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.