శుక్రవారం, డిసెంబర్ 21, 2018

గొపీ లోలా...

లేడీస్ టైలర్ లోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, శైలజ

గొపీలోలా నీ పాల బడ్డామురా
లీలాలోలా అల్లడుతున్నామురా
చన్నీళ్ళలో ఉన్నామురా చిన్నారులం మన్నించరా


భామా భామా తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరీ చేయెత్తి మొక్కాలమ్మా
అందాక మీ అందాలకు అ దిక్కులే దిక్కమ్మలు

గొపీలోలా నీ పాల బడ్డామురా

క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా
మచ్చా మచ్చా మచ్చా మచ్చా
క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా
మచ్చా మచ్చా మచ్చా మచ్చా

జాలిమాలిన ఈ గాలీ
తేరిపారా చూసే వేసే ఈల
మావీ మాటున దాగుంటే
కూత వేసి గువ్వలు నవ్వేగోల


తరుణిరో… కరుణతో మోక్షం చూపె
కిరణమై నిలిచానే
తనువుతో పుట్టె మాయను
తెలుపగా పిలిచానె

మోక్షం కన్నా మానం మిన్నా
మిన్ను మన్ను కన్నులు మూసేన 

  గొపీలోలా నీ పాల బడ్డామురా 
భామా భామా తీరాన్ని చేరాలమ్మా
 చన్నీళ్ళలో ఉన్నామురా చిన్నారులం మన్నించరా
గొపీలోలా నీ పాల బడ్డామురా

 
వాడిపోనీ సిరులెన్నో పూలు పూచేటి 
కొమ్మా రెమ్మా గుమ్మా
నేను కోరే ఆ తార ఏదీ మీలోన 
భామా భామా భామా
తగదురా... ఇదీ మరీ చోద్యం కాదా సొగసరీ గోవిందా
అందరూ నీవారేగా ఒకరితో ముడి ఉందా

చూసే కలలు ఎన్నో ఉన్నా
చూపే హృదయం ఒకటే ఉందమ్మా

గొపీలోలా నీ పాల బడ్డామురా
లీలాలోలా అల్లడుతున్నామురా
అందాక మీ అందాలకు అ దిక్కులే దిక్కమ్మలు

భామా భామా తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరీ చేయెత్తి మొక్కాలమ్మా 
 

4 comments:

నాతోపాటు చాలామంది వంశీగారి వీరాభిమానులే ఆ రోజుల్లో..

హహహ అవును శాంతి గారు నేను సైతం :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ..

ఇది తెరమీద చూపించినంత సింపుల్ పాట కాదు సోదరా! చాలా లోతైంది. ఏంచేతనో సిరివెన్నెల ఈపాట గురించి ఎక్కడ ప్రస్థావించలేదు.

మీ కామెంట్ తో వందశాతం ఏకీభవిస్తాను సోదరా.. సిరివెన్నెల గారి భావాన్ని వర్ణించవలసిన పాటలు చాలానే మిగిలిపోయాయేమో..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.