సోమవారం, డిసెంబర్ 24, 2018

వేణు గాన లోలుని గన...

రెండు కుటుంబాల కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రెండు కుటుంబాల కథ (1970)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల

వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే
సరసరాగ మాధురిలో సకల జగము సోలునులే
జగము సోలునులే
వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే

చిన్ననాడు గోపెమ్మల చిత్తములలరించి
మన్ను తిన్న ఆ నోటనే మిన్నులన్నీ చూపించి
కాళీయుణి పడగలపై లీలగా నటియించి
సురలు నరులు మురిసిపొవ ధరణినేలు గోపాలుని

వేణుగానలోలుని గన.. వేయి కనులు చాలవులే

అతని పెదవి సోకినంత అమృతము కురిసేను
అతని చేయి తాకినంత బ్రతుకే విరిసేను
సుందర యమునా...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...
సుందర యమునా తటిలో సుందర యమునా తటిలో
సుందర యమునా తటిలో బృందావన సీమలలో
కలసి మెలిసి అలసి సొలసి వలపు తెలుపు వేళలో

వేణుగానలోలుని గన..వేయి కనులు చాలవులే
సరసరాగ మాధురిలో సకల జగము సోలునులే
జగము సోలునులే
వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే 


2 comments:

కృష్ణుడి పాటలలో మరో అందమైన పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.