హౌరా బ్రిడ్జ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : హౌరా బ్రిడ్జ్ (2018)
సంగీతం : శేఖర్ చంద్ర
సాహిత్యం : పూర్ణాచారి
గానం : హరిప్రియ
రాధా గోపాల గోకుల బాలా రావేలా
మనసువిని రావేరా
రావేరావే రాధా మాధవ
హౌరా వారధిలా తేలినది మనసే ఈ వేళ
మనవినిను రాధా కృష్ణ
రాధా కృష్ణ మురళీ ముకుంద
హృదయ లయ ఆలకించరా
ఎదురు పడి స్వాగతించరా
కన్నె కలలన్ని వేచాయి
నిన్ను కోరాయి
మూగపోయాను రాక తెలుపర
హృదయ లయ ఆలకించరా
ఎదురు పడి స్వాగతించరా
కన్నె కలలన్ని వేచాయి
నిన్ను కోరాయి
మూగపోయాను రాక తెలుపర
నిన్నే కొరారా కనుల కలలన్నీ నీవేర
తెలుసుకొని ప్రియమారా
దరిచేరావే నీవే నేనుగా
మనసున గీసా రా నీ ప్రతిమ
ప్రధముడు నీవే రా
ప్రతిక్షణము నువ్వే నేనయి
నేనే నువ్వయి పోయాం ఇంతగా
2 comments:
యెప్పుడీ వినలేదీ పాట..బావుంది..
కొన్ని సినిమాలతోపాటు పాటలూ మరుగున పడిపోతాయ్ శాంతిగారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.