ఘాజీ దర్శకుడు సంకల్ప్ దర్శకత్వంలో త్వరలో వెలువడనున్న అంతరిక్షం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అంతరిక్షం (2018)
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : యాౙిన్ నిజార్, హరిణి
సమయమా...
అదేమిటంత తొందరేంటి ఆగుమా
సమయమా...
మరింత హాయి పోగు చేయనీయుమా
చేతిలోన చేతులేసుకున్న చోటులోనా
చూపుతోటి చూపులల్లుకున్న దారిలోనా
శ్వాసలోకి శ్వాస చేరుతున్న మాయలోన
ఆనంద వర్ణాల సరిగమ..
సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా..
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా
ఆ నింగి జాబిల్లి పై ఏ నీటి జాడున్నదో
నే చూడలేనె అపుడే ఏఏఏ..
ఈ నేల జాబిల్లి పై సంతోష భాష్పాలని
చూస్తూ ఉన్నానే ఇపుడే..ఏఏఏ..
తనే నా సగంగా తనే నా జగంగా
స్వరాల ఊయలూగుతుండగా.. ఆఅ..
ఏడేడు లోకాలు ఆరారు కాలాలు
ఆ తారా తీరాలు ఆనంద ద్వారాలు
తీసి మురిసే వేళా తీపి కురిసే వేళా
ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు
సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా..
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా
6 comments:
ఇంకొన్నాళ్ళు మ్యూజిక్ పరంగానో లేక సాహిత్య పరంగానో గీతగోవిందం లో వచ్చిన "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే" పాటల లాంటివి వినడం మనకు తప్పదన్నమాట.
వైటింగ్ ఫర్ దిస్ మూవీ..
సంకల్ప్ కాబట్టి సినిమా బావుంటుందనే అనుకుంటున్నాను శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
హిట్ అయితే ఫాలో అవడం సాధారణం కదండీ భవానిప్రసాద్ గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
అంతరీక్షం అని పడింది. సవరించండి
థాంక్స్ ప్రభ గారు.. పోస్ట్ లో సరిచేశాను..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.