మంగళవారం, డిసెంబర్ 11, 2018

ఉండిపోరాదే...

హుషారు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : హుషారు (2018)
సంగీతం : రాధన్  
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ  
గానం : సిద్ శ్రీరామ్

ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
మళ్ళీమళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే

నిశిలో శశిలా నిన్నే చూశాకా
మనసే మురిసే ఎగసే అలలాగా
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే
చీకట్లో కూడా నీడలా
నీవెంటే నేను ఉండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిముషం చాలులే

అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే

2 comments:

సిద్ శ్రీరాం..మోస్ట్ హాపెనింగ్..

నో డౌట్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.