యన్.టి.ఆర్. గారి బయోపిక్ లోని మొదటి పాట విడుదలైంది. అన్నగారి యశస్సుకు ధీటుగా ఉన్నాయి ఈ పాట సంగీత సాహిత్యాలు, సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : N.T.R(కథానాయకుడు) (2018)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : కె.శివదత్తా, డా.కె.రామకృష్ణ
గానం : కైలాష్ ఖేర్
ఘన కీర్తి సాంద్ర
విజితాఖిలాంద్ర
జనతా సుధీంద్ర
మణిదీపకా
ఘన కీర్తి సాంద్ర
విజితాఖిలాంద్ర
జనతా సుధీంద్ర
మణిదీపకా
త్రిశతకాధిక
చిత్రమాలిక
జైత్రయాత్రికా
కథానాయకా
ఘన కీర్తి సాంద్ర
విజితాఖిలాంద్ర
జనతా సుధీంద్ర
మణిదీపకా
త్రిశతకాధిక
చిత్రమాలిక
జైత్రయాత్రికా
కథానాయకా
ఆహార్యంగిక
వాచిక పూర్వక
అద్భుత అతులిత
నటనా ఘటికా
భీమసేన వీరార్జున కృష్ణ
దానకర్ణ మానధన సుయోధనా
భీష్మ బృహన్నల విశ్వామిత్ర
లంకేశ్వర దశకంఠ రావణాసురాది
పురాణపురుష భూమికా పోషకా
సాక్షాత్ సాక్షాత్కారకా
త్వదీయ ఛాయా చిత్రాఛ్ఛాదిత
రాజిత రంజిత చిత్రయవనికా..
న ఇదం పూర్వక రసోత్పాదకా
కీర్తి కన్యకా మనోనాయకా
కథానాయకా కథానాయకా
ఘన కీర్తి సాంద్ర
విజితాఖిలాంద్ర
జనతా సుధీంద్ర
మణిదీపకా
త్రిశతకాధిక
చిత్రమాలిక
జైత్రయాత్రికా
కథానాయకా
4 comments:
"కీర్తి కన్యకా మనోనాయకా"..
ఈ వాక్య ప్రయోగం చాలా చాలా బావుంది..కనులు మూసుకుంటే యన్.టి.ఆర్ ఒక విశ్వరూపమై కనిపిస్తున్నారు..ఈ రమ్యమైన స్వరవిన్యాసం లో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరూ వేసుకోండి ఓ వీరతాడు..
అవునండీ చాలా బాగా వచ్చింది పాట.. అందరినీ మెచ్చుకోవాల్సిందే.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
"దశకంఠరావణాసురాధి" కి బదులుగా "దశకంఠరావణాసురాది" అని ఉండాలి
థాంక్స్ విద్యాసాగర్ గారు.. పోస్ట్ లో సరిచేశానండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.