శనివారం, ఆగస్టు 31, 2019

లక్ష్మీ పద్మాలయ...

శ్రావణ మాసపు భక్తి పాటల సిరీస్ ను జగద్గురు ఆదిశంకర చిత్రంలోని ఈ లక్ష్మీ స్తుతి తో ముగిద్దాం. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : ఆదిశంకరాచార్య
గానం : శరత్ సంతోషి

లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా శ్రీ హరిప్రియా
ఇందిరా లోకమాతా మా రమా మంగళదేవతాః

నమోస్తు నాళీకనిభావనాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తుసోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

నమోస్తు దేవ్యై భృగు నందనాయై
నమోస్తు విష్ణో రురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యైకమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై 


శుక్రవారం, ఆగస్టు 30, 2019

ఆది లక్ష్మి వంటి...

జగదేక వీరుని కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జగదేకవీరుని కథ (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
గానం : సుశీల, లీల, సరోజిని, రాజరత్నం

ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా
సేవలంది మాకు వరములీయవమ్మా

కలుగునే మీ వంటి సాధ్వి అత్తగమాకు
తొలి మేము చేసిన పుణ్యమున గాక
మందారమాలతీ పారిజాతాలతో
అందముగ ముడివేసి అలరజేసేము

ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా
సేవలంది మాకు వరములీయవమ్మా

మనసు చల్లన కాగ మంచి గంధము పూసి
మా ముచ్చటలు తీర్ప మనవి చేసేము
పారాణి వెలయించి పాదపూజను చేసి
కోరికలు తీరునని పొంగి పోయేమూ

ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా
సేవలంది మాకు వరములీయవమ్మా 


గురువారం, ఆగస్టు 29, 2019

నేర్చేవు సరసాలు చాలా...

సతీ సక్కుబాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సతీసక్కుబాయి (1965)
సంగీతం : పి.ఆదినారాయణరావు 
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య
గానం : జానకి, జిక్కీ, బృందం

ఓ.. ఓఓ.. నేర్చేవు సరసాలు చాలా 
మేలా నీకీ లీల !
ఆ మూల గాచీ, చేలాలు దోచీ
చెలగాటమాడేవుగా..
చెలగాటమాడేవుగా..

నేరాలు మాని తీరాన చేరి
చేసాచి యాచించరే ..
చేసాచి యాచించరే ..

చిలిపి కృష్ణయ్యా ! వేధించకయ్యా !
చేయి జాప సిగ్గౌనయా
చేయి జాప సిగ్గౌనయా

దేహాభిమానాలు ఏలా
పరమాత్మనౌ నాదు మ్రోల

వెలిగించినావు విజ్ఞాన జ్యోతి
తరియించె మా జన్మలే
తరియించె మా జన్మలే

ఆఆఆఆఆ...ఆఆఆఆఅ....

యుక్తం కిం తవ శర్వరీశ ముఖ
మద్వేణీ సమాకర్షణం
వీధ్యాం త్వత్ కుచ మండలం
మమకథం గృహ్ణాతి చేతోజవాత్
వ్యత్యస్తం క్రియతే త్వయా జహి జహి
స్వామిన్ వచః సాధుతే
ఆగోయత్కురుతే తదేవ భవతాం
దండస్య యోగ్యం ఖలుః

ఓ వన్నెల చిన్నెల కృష్ణయ్యా
కన్నుల వెలుగూ నీవయ్యా
సరసకు చేరవయ్యా
సరసకు చేరవయ్యా

ఓ వన్నెల చిన్నెల చిన్నారీ
వలపులు చిలికే వయ్యారీ
సరసత నీదే సుమా
సరసత నీదే సుమా

నీ మురళీ ఆలాపన నేనే,
నీ మంజీర ఝుణం ఝుణ నేనే
నీ మురళీ ఆలాపన నేనే,
నీ మంజీర ఝుణం ఝుణ నేనే
నేనె సుమా నీ రాసలీల
నేనె సుమా నీ రాసలీల

ఓ వన్నెల చిన్నెల కృష్ణయ్యా
కన్నుల వెలుగూ నీవయ్యా
సరసకు చేరవయ్యా
సరసకు చేరవయ్యా

పతి సుతులా నేనేనని ఎంచి
సతతము నన్నే మనోగతినుంచి
రాధసఖే ఈ రాసలీలా
రాధసఖే ఈ రాసలీలా

ఓ వన్నెల చిన్నెల కృష్ణయ్యా
కన్నుల వెలుగూ నీవయ్యా
సరసకు చేరవయ్యా
సరసకు చేరవయ్యా 
 

బుధవారం, ఆగస్టు 28, 2019

ఘల్లు ఘల్లుమని...

సతీ సక్కుబాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సతీసక్కుబాయి (1965)
సంగీతం : పి.ఆదినారాయణరావు
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య
గానం : సుశీల

ఘల్లు ఘల్లుమని గజ్జెలు మ్రోయగా
గంతులు వేయుచు రారా
వెన్న దొంగ నీ వన్నె చిన్నెలతో
కన్నుల పండుగ చేయరారా కృష్ణా
 
నందగోపాల దయచేయరా
నయగారాలు చూపించరా
నవ్య నాట్యాల మురిపించరా

వాలుచూపుల బంధాలు వేసి
గోపకాంతల హృదయాలు దోచే
నల్లనయ్యా నవ్వుచు రారా
చిన్ని బొజ్జతో శిఖిపించముతో
చిందులు వేయుచు రారా
ముద్దులొలుకు చిన్నారి మోవితో
మురళీ గానము చేయరారా కృష్ణా
 
నంద గోపాల దయచేయరా
నయగారాలు చూపించరా
నవ్య నాట్యాల మురిపించరా

గోపబాలుర గోడాలకించీ
పాపి కాళీయఫణిపైన నిలచి
తాండవమాడే గోపకిషోరా
 
ఘల్లు ఘల్లుమని గజ్జెలు మ్రోయగా
ఘల్లు ఘల్లుమని గజ్జెలు మ్రోయగా
గంతులు వేయుచు రారా
వెన్న దొంగ నీ వన్నె చిన్నెలతో
కన్నుల పండుగ సేయరారా కృష్ణా

నంద గోపాల దయచేయరా
నయగారాలు చూపించరా
నవ్య నాట్యాల మురిపించరా


మంగళవారం, ఆగస్టు 27, 2019

శ్రీకర శుభకర...

త్రినేత్రం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : త్రినేత్రం (2002)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు

నరసింహా... ఆఆ.. లక్ష్మీ నరసింహా..

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మొక్కే
జ్వాలా నరసింహా..

నీవే శరణమయా
ఓ యాదగిరీ నరసింహా

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..

పురాణ యుగమున ఈ గిరి పైనే
తపమొనరించెను యాద రిషి 
ధరాతలమ్మున అతని పేరుతొ
అయ్యింది ఈ గిరి యాదగిరి
ఈ గుహలో వెలెసెను
ప్రళయ మహోజ్వల
జ్వాలా నరసింహుడు
భక్త అభీష్టములు అన్నియు తీర్చే
లక్ష్మీ నరసింహుడు

సుఖ శాంతులను చేకూర్చు
శుభయోగ నరసింహుడు
ఆఆఆ...ఆఆఆ...ఆఆఆ.
సుఖ శాంతులను చేకూర్చు
శుభయోగ నరసింహుడు

నమో నమః నమో నమః

నమస్కరించెను నాలుగు
దిక్కులు నఖముల వెలుగుకు
మ్రొక్కెను చుక్కలు
గోకుల రూపము దాల్చినదీ
ఆ దివ్య సుదర్శన చక్రము
మంగళ హారతులిచ్చినది
మహా కాల చక్రము

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..

ఈ స్వామి పదములు బ్రహ్మ కడుగగ
విష్ణు గుండమే ప్రవహించే
ఇట స్నానము చేసిన జన్మ ధన్యమే
కర్మ విమోచనమే
ఇక విశ్వ వైద్యుడై స్వామియే
చేయును రోగ నివారణమే
చిత్తము దేహము
సత్వముగా నవు
బెత్తము తాకగనె

భోగ భాగ్యాలు దీర్గాయువు
వొసగెను గిరి ప్రదక్షిణం
ఆఆఆఆ...ఆఆఆఅ...ఆఆఅ...
భోగ భాగ్యాలు దీర్గాయువు
వొసగెను గిరి ప్రదక్షిణం

నమో నమః నమో నమః

క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే
సాక్షి ఔను ఈ మహిమలకు
కలియుగ దైవము యాదగిరి
శ్రీ నరసింహుని దర్శనము
కోరిన కోర్కెలు తీర్చేటి
మహా కల్ప వృక్షము

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..

భూత ప్రేత పిశాచ రాక్షసుల
ప్రారద్రోలు నీ నామమే
క్షుద్ర శక్తులను బాణామతులను
దగ్దమొనర్చు నీ స్మరణమే

ప్రపంచ బాల ప్రహ్లాదునియే
హిరణ్యకశిపుడు హింసింపగనె
సర్వ కాలముల సర్వ అవస్తల
సర్వ దిక్కులకు వ్యాపించి
సంరక్షింపుము నరసింహా
అనుగ్రహింపుము నరసింహా
యాదగిరీశా నరసింహ
ఓం..ఓం..ఓం..ఓం..

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మొక్కే
జ్వాలా నరసింహా.. 

 

సోమవారం, ఆగస్టు 26, 2019

శ్యామ సుందరా...

ఆదినారాయణరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన భక్తతుకారం సినిమాలోని పాటలు అన్నీ కూడా సూపర్ హిట్సే, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. ఇందులోని ఈ "శ్యామసుందరా ప్రేమమందిరా" పాటంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. తత్వాలతో కూడి పల్లెపదం/జానపదంలా అనిపించే ఈపాట ఎప్పుడు విన్నా నాకు తెలియకుండానే గొంతు కలిపేస్తాను.

దాశరధి గారి సాహిత్యంలో "అణువణువు నీ ఆలయమేరా నీవే లేని చోటులేదురా", "అహము విడిచితే ఆనందమురా", "సాధన చేయుమురా నరుడా సాధ్యముకానిది లేదురా", "అణిగిమణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు". "దొడ్డమానులను కూల్చు తుఫాను గడ్డిపరకను కదల్చగలదా", "బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు" వంటి మాటలు జీవితాంతం గుర్తుంచుకోవలసిన సత్యాలు. ఆదినారాయణరావు గారి బాణిలో ఆమాటలు అలా అలవోకగా నోటికి వచ్చేస్తాయి. రామకృష్ణ గారి స్వరం కూడా ప్రత్యేకంగా ఉండి ఆకట్టుకుంటుంది.
 
ఆడియోలో ఒకే పాటగా విడుదలైనా సినిమాలో ఈ పాట మొదటి రెండు చరణాలు ఒకటిగాను మిగిలిన రెండు చరణాలు వేరే పాటలా వస్తాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చివరి రెండు చరణాలు "పడవెళ్ళిపోతోందిరా" పాటగా ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరథి
గానం: రామకృష్ణ

శ్యామ సుందరా ప్రేమ మందిరా
నీ నామమే వీనుల విందురా
నీ నామమే వీనుల విందురా
శ్యామసుందరా...

అణువణువు నీ ఆలయమేరా
నీవే లేని చోటు లేదురా
అణువణువు నీ ఆలయమేరా
నీవే లేని చోటు లేదురా
నేనని నీవని లేనే లేదూ
నీకు నాకు బేధమే లేదు

శ్యామ సుందరా ప్రేమ మందిరా

సుఖ దుఃఖాలకు నిలయం దేహం
ఈ దేహము పై ఎందుకు మోహం
అహము విడిచితే ఆనందమురా
అన్నిట మిన్నా అనురాగమురా
భక్త తుకారాం బోధలు వింటే
తొలగిపోవును శోకమురా

శ్యామ సుందరా ప్రేమ మందిరా

సాధన చేయుమురా నరుడా
సాధ్యము కానిది లేదురా
సాధన చేయుమురా నరుడా
సాధ్యము కానిది లేదురా
అలవాటైతే విషమే అయినా
హాయిగా త్రాగుట సాధ్యమురా..
హాయిగ త్రాగుట సాధ్యమురా

సాధన చేయుమురా నరుడా
సాధ్యము కానిది లేదురా

కాలసర్పమును మెడలో దాల్చి
పూల మాలగా తలచ వచ్చురా
పూల మాలగా తలచ వచ్చురా
ఏకాగ్రతతో ధ్యానము చేసి

లోకేశ్వరునే చేరవచ్చురా
లోకేశ్వరునే చేరవచ్చురా
దాస తుకారాం తత్వ బోధతో
తరించి ముక్తిని పొందుమురా..
తరించి ముక్తిని పొందుమురా

సాధన చేయుమురా నరుడా
సాధ్యము కానిది లేదురా

ఓహోహో హొయ్యారె హొయ్యారే
హొయ్ హొయ్యా.. హొహోయ్..
ఓహోహో హొయ్యారె హొయ్యారే
హొయ్ హొయ్యా..

అణిగిమణిగి ఉండేవారే
అందరిలోకి ఘనులు హొహోయ్
అణిగిమణిగి ఉండేవారే
అందరిలోకి ఘనులు హొహోయ్

దొడ్డమానులను కూల్చు తుఫాను
గడ్డి పరకను కదల్చగలదా.. కదల్చగలదా
చిన్న చీమలకు చక్కెర దొరుకును
గొప్ప మనిషికి ఉప్పే కరువు.. ఉప్పే కరువు
అణకువ కోరే తుకారామునీ
మనసే దేవుని మందిరము..
మనసే దేవుని మందిరము

హోయ్ అణిగిమణిగి ఉండేవారే
అందరిలోకి ఘనులు హొహోయ్
అణిగిమణిగి ఉండేవారే
అందరిలోకి ఘనులు

హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా

పడవెళ్ళిపోతోందిరా...ఆ ఆ ఆ ఆ ఓ ఓ ...
పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా
దరి చేరే దారేదిరా
నీ జీవితము కెరటాల పాలాయెరా
పడవెళ్ళిపోతోందిరా

హైలెస్సా హైలెస్సా హైలెస్సా..
హైలెస్సా హైలెస్సా హైలెస్సా..

తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే
తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే
ఆ పాండురంగడున్నాడురా ఆ ఆ ...
నీ మనసు గోడు వింటాడురా
నీ భారమతడే మోసేనురా
ఓ యాత్రికుడా నిన్నతడే కాచేనురా..

పడవెళ్ళిపోతోందిరా....
 
బుడగవంటి బ్రతుకు
ఒక చిటికెలోన చితుకు
బుడగవంటి బ్రతుకు
ఒక చిటికెలోన చితుకు
ఇది శాశ్వతమని తలచేవురా ఆ ఆ...
నీవెందుకని మురిసేవురా..
నువు దరిజేరే దారి వెదకరా
ఓ మానవుడా హరినామం
మరవవద్దురా..

పడవెళ్ళిపోతుందిరా ఆ ఆ....

హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా

ఆదివారం, ఆగస్టు 25, 2019

పాల కడలిపై...

చెంచులక్ష్మి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చెంచులక్ష్మి (1958)
సంగీతం : ఎస్.రాజేశ్వర్రావు
సాహిత్యం : ఆరుద్ర 
గానం : సుశీల

పాల కడలిపై...
శేష తల్పమున
పవళించేవా దేవా…
పాల కడలిపై...
శేష తల్పమున
పవళించేవా దేవా…

బాలుని నను దయపాలించుటకై
కనుపించేవ మహానుభావా..

పాల కడలిపై...
శేష తల్పమున
పవళించేవా దేవా…


అలకలు అల్లలాడుతూ ముసరగ
అలకలు అల్లలాడుతూ ముసరగ
నెల నవ్వులు పులకించే మోము
నెల నవ్వులు పులకించే మోము
చెలి కన్నుల కరుణా రసవృష్టీ.....ఈ ....
చెలి కన్నుల కరుణా రసవృష్టి
తిలకించెన మై పులకించే స్వామి

పాల కడలి పై...
శేష తల్పమున
పవళించేవా దేవా


ఆది లక్ష్మి నీ పాదము లోత్తగా
వేద మంత్రములు విరించి చదువా
ఆది లక్ష్మి నీ పాదము లోత్తగా
వేద మంత్రములు విరించి చదువా
నారదాది ముని ముఖ్యులు చేరీ....ఈ ....
నారదాది ముని ముఖ్యులు చేరి
మొదమలర నిను గానము సేయగా

పాల కడలిపై...
శేష తల్పమున
పవళించేవా దేవా 

 

శనివారం, ఆగస్టు 24, 2019

జయ పాండురంగ...

సతీ సక్కుబాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సతీసక్కుబాయి (1965)
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య 
గానం : సుశీల 

రంగ.ఆ ఆ ఆ అ అ అ ......
జయ పాండురంగ. ...ప్రభోవిఠల ....
జగదా ధార జయ విఠల....
జయ పాండురంగ. ...ప్రభోవిఠల....
జగదాధార జయ విఠల
పాండురంగ విఠల... పండరి నాధవిఠల
పాండు రంగ విఠల... పండరి నాధ విఠల
పాండురంగవిఠల... పండరి నాధవిఠల….
పాండురంగ విఠల... పండరి నాధ విఠల
పాండురంగ విఠల...
పండరి నాధ విఠల

ఆఆ......నీ కనులా అలరారే వెలుగే...
నీ పెదవుల చెలువారే నగవే
నీ కనులా అలరారే వెలుగే...
నీ పెదవుల చెలువారే నగవే
పాప విమోచన సాధన రంగ ….
ప్రభో పాండు రంగ...
విభో పాండురంగ
పాప విమోచన సాధన రంగ

జయ పాండు రంగ.... ప్రభో విఠల
జగదాధార జయ విఠల....
పాండురంగవిఠల.. పండరి నాధ విఠల..
పాండురంగ విఠల.. పండరి నాధ విఠల..

ఆఆ......శ్రీరమణీ హృదయాంత రంగ..
మంగళకర కరుణాంత రంగ...
శ్రీరమణీ హృదయాంత రంగ..
మంగళకర కరుణాంత రంగ
ఆశ్రిత దీన జనావన రంగ …..
ప్రభోపాండు రంగ విభో పాండురంగ
ఆశ్రిత దీన జనావన రంగ

జయ పాండు రంగ ప్రభో విఠల....
జగదాధార జయ విఠల
పాండురంగ విఠల.. పండరి నాధ విఠల
పాండురంగ విఠల.. పండరినాధ విఠల
పాండురంగ విఠల.. పండరినాధ విఠల
పాండురంగ విఠల.. పండరినాధ విఠల
పాండురంగ విఠల.. పండరినాధ విఠల
పాండురంగ విఠల.. పండరినాధ విఠల
పాండురంగ విఠల.. పండరినాధ విఠల
పాండురంగ విఠల.. పండరినాధ విఠల
పాండురంగ విఠల.. పండరినాధ విఠల
పాండురంగ విఠల.. పండరినాధ విఠల
విఠల విఠల పాండురంగ
విఠల విఠల పాండురంగ
విఠల విఠల పాండురంగ
విఠల విఠల విఠల విఠల
విఠల విఠల విఠల విఠల 

 

శుక్రవారం, ఆగస్టు 23, 2019

శ్రీమన్ మహాలక్ష్మి...

శుక్రవారం మహాలక్ష్మి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శుక్రవారం మహాలక్ష్మి (1992)
సంగీతం : కృష్ణ తేజ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బేబీ కల్పన

శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది

శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది


కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
మంగళారతులెత్తి ఎదురేగ రండి
జనులారా రండి ఎదురేగ రండి
శుక్రవారపు సిరిని సేవించరండి

శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది


సిద్ధి బుద్ధులనొసగు భారతీ మూర్తి
ఆఆ.. ఆఆ...
శక్తి యుక్తులనొసగు పార్వతీ మూర్తి
ఆఆ...ఆఆ....

అష్ట సంపదలొసఁగు శ్రీ సతి మూర్తి
ముమ్మూర్తులకు మూలం ఈ దివ్య దీప్తి
కల లేని కన్నులకు కనిపించదండి
కలత ఎరుగని సతుల కరుణిచునండి

శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది


ఆఆ...ఆఆఆఅ....ఆఆఆ...

ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షీ
ఆఆఆ...ఆఆఆ...
పారాణి పాదాల అందియల సాక్షీ
ఆఆఅ...ఆఆ.అ..
పచ్చతోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి
నిత్యమంగళమిచ్చు నట్టిల్లే సాక్షి
అటువంటి ఇల్లే కోవెలగ ఎంచి
కొలువుండు ఆ కలిమి ప్రాణచ్చి వచ్చి

శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది
శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది

కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
మంగళారతులెత్తి ఎదురేగ రండి
శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది 

 

గురువారం, ఆగస్టు 22, 2019

రావమ్మా మహాలక్ష్మీ...

ఉండమ్మా బొట్టు పెడతా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి
గానం : బాలు, సుశీల

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా

నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
కొలువై ఉందువుగాని...కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా... రావమ్మా

గురివింద పొదకింద గొరవంక పలికె... 
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె ...
గురివింద పొదకింద గొరవంక పలికె... 
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె

తెల్లారి పోయింది పల్లె లేచింది...
తెల్లారి పోయింది పల్లె లేచింది... 
పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది

రావమ్మా మహాలక్ష్మీ... రావమ్మా... రావమ్మా... కృష్ణార్పణం

కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి...గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు

కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు


ముత్యాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు 

రావమ్మా మహాలక్ష్మీ... రావమ్మా... రావమ్మా... కృష్ణార్పణం

పాడిచ్చే గోవులకు పసుపుకుంకం...
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం... 
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం ...
గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం ...
కష్ఠించే కాపులకు కలకాలం సౌఖ్యం ...కలకాలం సౌఖ్యం ..

రావమ్మా మహాలక్ష్మీ ...రావమ్మా

నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
కొలువై ఉందువుగాని...కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా ...రావమ్మా...కృష్ణార్పణం


బుధవారం, ఆగస్టు 21, 2019

అమ్మా మహాలక్ష్మి...

గుణసుందరి కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గుణసుందరి కథ (1949)
సంగీతం : ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
గానం : ఘంటసాల

అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
మమ్ము మా పల్లె పాలింపవమ్మా
మమ్ము మా పల్లె పాలింపవమ్మా

అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా

ఎన్ని నోముల పంటవొ అమ్మా
ఎన్ని నోముల పంటవొ అమ్మా
ఏమి పుణ్యాల ఫలమౌ అమ్మా

అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా

నీవు పట్టింది బంగారమమ్మా
నీవు మెట్టింది స్వర్గమె అమ్మా
నీవు మెట్టింది స్వర్గమె అమ్మా
నీవు పలికింది నిజ ధర్మమమ్మా
నీవు పలికింది నిజ ధర్మమమ్మా
నీవు మా భాగ్య దేవతవే అమ్మా

అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా

ఎరుకలు జీవజనులను మరువ వలదమ్మా
పరువున రాచవారిని తీసిపోమమ్మా
పరువున రాచవారిని తీసిపోమమ్మా

నిను కన్నబిడ్డగ చూచునే అమ్మా
నిను కన్నబిడ్డగ చూచునే అమ్మా
నిను కంటిపాపగ కాచునే అమ్మా

అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా

మంగళవారం, ఆగస్టు 20, 2019

విన్నపాలు వినవలే...

అన్నమయ్య చిత్రంలో కీర్తనలతో కూర్చిన ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అన్నమయ్య
గానం : బాలు, రేణుక, శ్రీలేఖ, పార్ధసారధి

విన్నపాలు వినవలె వింతవింతలూ
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ...

కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ...

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గువడియె పెండ్లి కూతురూ... ఊ ఊ...

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల

సోమవారం, ఆగస్టు 19, 2019

గోవింద గోవింద...

దేవుళ్ళు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవుళ్ళు (2001)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు

గోవింద గోవింద ఘోషతో తన గుడికి
కొనివచ్చె భక్తులను గోవిందుడే

ముడుపులను గైకొని మొక్కులను చెల్లించ
పక్కనే నిలిచె ఆ పరమాత్ముడే

అలమేలు మంగమ్మ అమ్మ ఐ వచ్చి
తలనీలాలనిప్పించె తన స్వామికీ

వైకుంఠ వాసుడే వరద హస్తముతో
దీవించి పూసెనే చలువ చందనమే

ఋషులకే కలుగదూ ఈ భాగ్యమూ
ఈ పసివారి బ్రతుకులే ధన్యమూ

అమ్మనీ నాన్ననీ కలపాలనీ
మదినమ్మి పూనినా వ్రత దీక్షకీ

నిలువెల్ల కరిగాడు ఏడుకొండలవాడూ
చిన్నారి భక్తులకె ఐనాడు భక్తుడు 

 

ఆదివారం, ఆగస్టు 18, 2019

వసుదేవ సుతం దేవం...

అష్టలక్ష్మీ వైభవం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అష్టలక్ష్మీ వైభవం (1986)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : కృష్ణాష్టకం
గానం : సుశీల 

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్


ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్


రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్


శ్రీవత్సాఙ్కం మహోరస్కం వనమాలా విరాజితమ్
శ్రీవత్సాఙ్కం మహోరస్కం వనమాలా విరాజితమ్
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్

మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్
బర్హి పింఛావ చూడాఙ్గం కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్

గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసమ్
గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసమ్
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్  


శనివారం, ఆగస్టు 17, 2019

జయ జయ జయ శ్రీ వెంకటేశా...

ఘంటసాల గారు గానం చేసిన ప్రైవేట్ డివోషనల్ సాంగ్స్ లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : ఘంటసాల ప్రైవేట్ సాంగ్స్
సంగీతం : ఘంటసాల/సాలూరి ??
సాహిత్యం : ఏ.వేణుగోపాల్
గానం : ఘంటసాల

జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...


సనకాది ఋషులు సన్నుతి చేయ..
లక్ష్మీదేవి నీ పాదములొత్త..
భృగు కోపమున వైకుంఠమిడి..
భూలొకమునే చేరితివయ్యా..

జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...


వల్మీకమున దాగి యుండగా..
రుద్రుడె గోవై పాలివ్వ..
గొల్లడొకడు నీ శిరమున బాదగ..
ఘోరశాపమునె ఇచ్చితివయ్య..

జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...


కానలలోన ఒంటివాడివై తిరుగుతు
వకుళను జేరితివయ్య
వకుళమాతకు ముద్దు బిడ్డవై
మురిపెముతోనే పెరిగితివయ్య

జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...


అంత ఒకదినంబున పూదొటలోన
ఆకాశ రాజు తనయ
శ్రీ పద్మావతీ దేవిని గాంచి...
వలచి వలపించితివో..
మహానుభావా...ఆ..ఆ.ఆ

లోకనాధ నీ కళ్యాణమునకు
కుబేరపతిని ఆశించి
లోకనాధ నీ కళ్యాణమునకు
కుబేరపతిని ఆశించి
ఆ కుబేర ధనముతొ మీకళ్యాణం
మహోత్సవమ్ముగ జరిగిందయ్య

ఆనందమానందమాయెనె.
పరమానందమానందమాయెనే.
ఆనందమానందమాయెనె.
పరమానందమానందమాయెనే.

ధర్మపత్నితో దారిలో ఉన్న
అగస్త్యముని ఆశ్రమంబున
ఆరు మాసములు
అతిధిగా ఉన్నవో..
దేవా..ఆ..ఆ.ఆ.అ

కొండలపైనే తొండమానుడు
అలయమొకటి కట్టించెనయా
కొండలపైనే తొండమానుడు
అలయమొకటి కట్టించెనయా
స్వర్ణ శిఖరపు శేషశైలమున
స్థిరనివాసివై నిలచితివయ్య...

జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...


రమాదేవి నిను వెదకుచు చేరగ
శిలా రూపమున వెలసితివయ్య
రమాదేవి నిను వెదకుచు చేరగ
శిలా రూపమున వెలసితివయ్య
భక్తకోటికిదె నిత్య దర్శనం..
పాపవిమోచన పుణ్య స్థలమయా...

జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...


నీమహత్యపఠనమే మాహా స్తోత్రమయా
నీ దివ్యనామమే కైవల్యమయా
దీనులమము కరుణించవయ...
ఓ వెంకటేశా... ఆఆ..ఆఆ...

నమో వెంకటేశా... నమః శ్రీనివాసా
నమో చిద్విలాసా...నమః పరమపురుషా
నమో తిరుమలేశా.. నమో కలియుగేశా
నమో వేదవేద్య.. నమో విశ్వరూపా

నమో లక్ష్మీనాధ.. నమో జగన్నాధ
నమస్తే....నమస్తే....నమః...ఆ..ఆ..ఆ..అ

ఏడుకొండలవాడ..
వేంకటరమణా...
గోవిందా గోవిందా...

 

శుక్రవారం, ఆగస్టు 16, 2019

ధాన్య లక్ష్మి వచ్చిందీ...

భక్తతుకారం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భక్తతుకారం (1973)
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : వీటూరి
గానం : సుశీల

ధాన్య లక్ష్మి వచ్చిందీ మా ఇంటికి
మా కరువు తీరింది ఈ నాటికి
మా లక్ష్మి వచ్చింది మా ఇంటికి
మా కరువు తీరింది ఈ నాటికి

పాల సంద్రంలోన పుట్టిన నా తల్లి
పాల సంద్రంలోన పుట్టిన నా తల్లి
భాగ్యాలు కరుణించు ఓ !కల్పవల్లి

ధాన్య లక్ష్మి వచ్చిందీ మా ఇంటికి
మా కరువు తీరింది ఈ నాటికి

సువ్వి సువ్వన్నాలే సువ్వన్న లాలే ఓ యమ్మా!
సూరమ్మ మా వారు ఎప్పుడొస్తారే
ఆ హు ...ఆహు ..అహుం..

ఏన్నిభోగాలున్న ఎంత భాగ్యమున్న ఓ యమ్మా !
మగనికన్నా ధనముకాదమ్మా !
ఆహుం...ఆహుం ...అహుం ...

పిల్లల ఆకలి తల్లి ఎరుగును కానీ ఓ యమ్మా !
అడవుల్లో తిరిగే ఆయ్యే ఏమిఎరుగు
ఆ అయ్య ఏమి ఎరుగు
ఆహుం ...ఆహుం ...ఆహుం ....

బ్రమ్మకే పాయసం
జాజిరి జాజిరి జాజిరి
నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి
జాజిరి జాజిరి జాజిరి
నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి

చూడబోతే తాను సుందరీ
ఆడమంటే చాలు అల్లరీ
చూడబోతే తాను సుందరీ
ఆడమంటే చాలు అల్లరీ
కట్టుకున్న వాడు నంగిరీ
సంతానమే బీర పందిరీ
కట్టుకున్న వాడు నంగిరీ
సంతానమే బీర పందిరీ
వండుకున్నమ్మకు ఆయాసం 
దండుకున్నమ్మకే పాయసం
వండుకున్నమ్మకు ఆయాసం 
దండుకున్నమ్మకే పాయసం

జాజిరి జాజిరి జాజిరి
నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి


గురువారం, ఆగస్టు 15, 2019

మా తెలుగు తల్లికి...

మిత్రులందరకూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందచేస్తూ అల్లుడొచ్చాడు చిత్రంనుండి ఈ చక్కని గీతాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అల్లుడొచ్చాడు (1976)
సంగీతం : శంకరంబాడి సుందరాచారి
సాహిత్యం : శంకరంబాడి సుందరాచారి
గానం : సుశీల

మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ
మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ

కడుపులో బంగారు కను చూపులో కరుణా
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

మా తెలుగు తల్లికి మల్లె పూదండా

గల గలా గోదారి కదలి పోతుంటేను ॥గల గలా॥
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

మా తెలుగు తల్లికి మల్లె పూదండా

అమరావతీ గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ పాటలే పాడుతాం
నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!! 

బుధవారం, ఆగస్టు 14, 2019

ఎవరో.. అతడెవరో..

శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల

ఆ... ఆ... ఆ..
ఆ... ఆ... ఆ.. ఆ..
ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో...
నా మానసచోరుడెవరో.. ఎవరో.. అతడెవరో..

తొలిచూపులలో వలపులు చిలికి.. దోచిన మగసిరి దొర ఎవరో..
తొలిచూపులలో వలపులు చిలికి.. దోచిన మగసిరి దొర ఎవరో..
అరయగ హృదయము అర్పించితినే.. ఆదరించునో.. ఆదమరచునో

ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో...

వలరాజా? కలువలరాజా? కాడే.. కనులకు కనులకడుపడినాడే..
అకళంకుడే.. హరినాంగుడు కాడే..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
అకళంకుడే.. హరినాంగుడు కాడే.. మరి ఎవరో.. ఏమయినాడో...

ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో...

ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..
నా మానసహారిణి.. ఎవరో..
ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..

నందనవనమానందములో.. తొలిసారిగ పూచిన పువ్వో..
నందనవనమానందములో.. తొలిసారిగ పూచిన పువ్వో..

తొలకరి యవ్వనం ఒలికిన నవ్వో...
తొలకరి యవ్వనం ఒలికిన నవ్వో...
మనసిచ్చినదో.. నను మెచ్చినదో..
ఆ... జవ్వని..

ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..
నా మానసహారిణి.. ఎవరో.. ఎవరో.. తానెవరో... 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.