సోమవారం, ఆగస్టు 12, 2019

మున్నీట పవళించు...

భూకైలాస్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఎం.ఎల్. వసంతకుమారి

మున్నీట పవళించు నాగశయన
మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలుసేయ
మున్నీట పవళించు నాగశయన..
నీ నాభి కమలాన కొలువు జేసే...ఆ...ఆ...
నీ నాభి కమలాన కొలువు జేసే..
వాణీశు భుజపీఠి బరువువేసి
వాణీశు భుజపీఠి బరువువేసి...పాల..

మున్నీట పవళించు నాగశయన

మీనాకృతి దాల్చినావు..
వేదాల రక్షింప మీనాకృతి దాల్చినావు
కూర్మాకృతి బూనినావు..
వారిధి మధియింప కూర్మాకృతి బూనినావు
కిటి రూపము దాల్చినావు
కనకాక్షు వధియింప కిటి రూపము దాల్చినావు
నరసింహమై వెలసినావు ప్రహ్లాదు రక్షింప
నరసింహమై వెలసినావు...
నరసింహమై వెలసినావు...
నటపాల మమునేల జాగేల...
నటపాల మమునేల జాగేల పాల

మున్నీట పవళించు నాగ శయన

మోహినీ విలాస కలిత నవమోహన
మోహదూర మౌనిరాజ మనోమోహనా
మోహినీ విలాస కలిత నవమోహన
మోహదూర మౌనిరాజ మనోమోహనా
మందహాస మధురవదన రమానాయక
మందహాస మధురవదన రమానాయక
కోటిచంద్ర కాంతి సదన శ్రీలోల.. పాల

మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలుసేయ
మున్నీట పవళించు నాగశయన



4 comments:

మంచి గీతం. షణ్ముఖ ప్రియ రాగంలో బాణీ ఉన్నది.

థాంక్స్ ఫర్ ద కామెంట్ బుచికి గారు..

కమలా లక్ష్మణ్ గారి నృత్యం అద్భుతం..

ఓహ్ వారి పేరు తెలియదండీ.. థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.