శ్రీరామ రాజ్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీరామ రాజ్యం (2012)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : చిత్ర, శ్రేయ ఘోషల్
దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ వినుడీ
ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
మీ కోసం రాసింది మీ మంచి కోరింది
మీ ముందుకొచ్చింది సీతారామకథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింట సుఖశాంతి ఒసగే నిధి
మనసంత వెలిగించి నిలిపే నిధి
సరిదారిని జనులందరి నడిపే కథ ఇదియే
దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ వినుడీ
ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
అయోధ్యనేలే దశరథరాజు
అతని కులసతులు గుణవతులు మువ్వురు
పుత్రకామ యాగం చేసెను రాజే
రాణులు కౌసల్య సుమిత్రా కైకలతో
కలిగిరి వారికి శ్రీవరపుత్రులు
రామ లక్ష్మణ భరత
శత్రుఘ్నులు నలుగురు
రఘువంశమే వెలిగే ఇల
ముదమందిరి జనులే
దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ వినుడీ
ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
దశరథ భూపతి పసిరాముని ప్రేమలో
కాలమే మరిచెను కౌశికుడేతెంచెను
తన యాగము కాపాడగ రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకినే చంపే
యాగమే సఫలమై కౌశికముని పొంగే
జయరాముని గొని ఆముని మిథిలాపురికేగే
శివధనువదిగో నవవధువిదిగో
రఘురాముని తేజం అభయం అదిగదిగో
సుందర వదనం చూసిన మధురం
నగుమోమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం
ఫెళఫెళ ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే
నీ నీడగ సాగునింక జానకీయనీ
సీతనొసగే జనకుడు శ్రీరామమూర్తికే
ఆ స్పర్శకి ఆలపించే అమృతరాగమే
రామాంకితమై హృదయం కరిగె సీతకే
శ్రీకరం మనోహరం
ఇది వీడని ప్రియబంధమని
ఆజానుబాహుని జతకూడే అవనిజాత
ఆనందరాగమే తానాయే గృహిణి సీత
దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ వినుడీ
ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
2 comments:
సీతమ్మా శ్రీమహాలక్ష్మి రూపమే...
అంతేకదండీ మరి.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.