గురువారం, ఆగస్టు 29, 2019

నేర్చేవు సరసాలు చాలా...

సతీ సక్కుబాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సతీసక్కుబాయి (1965)
సంగీతం : పి.ఆదినారాయణరావు 
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య
గానం : జానకి, జిక్కీ, బృందం

ఓ.. ఓఓ.. నేర్చేవు సరసాలు చాలా 
మేలా నీకీ లీల !
ఆ మూల గాచీ, చేలాలు దోచీ
చెలగాటమాడేవుగా..
చెలగాటమాడేవుగా..

నేరాలు మాని తీరాన చేరి
చేసాచి యాచించరే ..
చేసాచి యాచించరే ..

చిలిపి కృష్ణయ్యా ! వేధించకయ్యా !
చేయి జాప సిగ్గౌనయా
చేయి జాప సిగ్గౌనయా

దేహాభిమానాలు ఏలా
పరమాత్మనౌ నాదు మ్రోల

వెలిగించినావు విజ్ఞాన జ్యోతి
తరియించె మా జన్మలే
తరియించె మా జన్మలే

ఆఆఆఆఆ...ఆఆఆఆఅ....

యుక్తం కిం తవ శర్వరీశ ముఖ
మద్వేణీ సమాకర్షణం
వీధ్యాం త్వత్ కుచ మండలం
మమకథం గృహ్ణాతి చేతోజవాత్
వ్యత్యస్తం క్రియతే త్వయా జహి జహి
స్వామిన్ వచః సాధుతే
ఆగోయత్కురుతే తదేవ భవతాం
దండస్య యోగ్యం ఖలుః

ఓ వన్నెల చిన్నెల కృష్ణయ్యా
కన్నుల వెలుగూ నీవయ్యా
సరసకు చేరవయ్యా
సరసకు చేరవయ్యా

ఓ వన్నెల చిన్నెల చిన్నారీ
వలపులు చిలికే వయ్యారీ
సరసత నీదే సుమా
సరసత నీదే సుమా

నీ మురళీ ఆలాపన నేనే,
నీ మంజీర ఝుణం ఝుణ నేనే
నీ మురళీ ఆలాపన నేనే,
నీ మంజీర ఝుణం ఝుణ నేనే
నేనె సుమా నీ రాసలీల
నేనె సుమా నీ రాసలీల

ఓ వన్నెల చిన్నెల కృష్ణయ్యా
కన్నుల వెలుగూ నీవయ్యా
సరసకు చేరవయ్యా
సరసకు చేరవయ్యా

పతి సుతులా నేనేనని ఎంచి
సతతము నన్నే మనోగతినుంచి
రాధసఖే ఈ రాసలీలా
రాధసఖే ఈ రాసలీలా

ఓ వన్నెల చిన్నెల కృష్ణయ్యా
కన్నుల వెలుగూ నీవయ్యా
సరసకు చేరవయ్యా
సరసకు చేరవయ్యా 
 

2 comments:

మంచిపాట..అందమైన పిక్..

థాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.