శుక్రవారం, ఆగస్టు 23, 2019

శ్రీమన్ మహాలక్ష్మి...

శుక్రవారం మహాలక్ష్మి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శుక్రవారం మహాలక్ష్మి (1992)
సంగీతం : కృష్ణ తేజ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బేబీ కల్పన

శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది

శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది


కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
మంగళారతులెత్తి ఎదురేగ రండి
జనులారా రండి ఎదురేగ రండి
శుక్రవారపు సిరిని సేవించరండి

శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది


సిద్ధి బుద్ధులనొసగు భారతీ మూర్తి
ఆఆ.. ఆఆ...
శక్తి యుక్తులనొసగు పార్వతీ మూర్తి
ఆఆ...ఆఆ....

అష్ట సంపదలొసఁగు శ్రీ సతి మూర్తి
ముమ్మూర్తులకు మూలం ఈ దివ్య దీప్తి
కల లేని కన్నులకు కనిపించదండి
కలత ఎరుగని సతుల కరుణిచునండి

శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది


ఆఆ...ఆఆఆఅ....ఆఆఆ...

ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షీ
ఆఆఆ...ఆఆఆ...
పారాణి పాదాల అందియల సాక్షీ
ఆఆఅ...ఆఆ.అ..
పచ్చతోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి
నిత్యమంగళమిచ్చు నట్టిల్లే సాక్షి
అటువంటి ఇల్లే కోవెలగ ఎంచి
కొలువుండు ఆ కలిమి ప్రాణచ్చి వచ్చి

శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది
శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది

కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
మంగళారతులెత్తి ఎదురేగ రండి
శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది 

 

2 comments:

ఈ సారి శ్రావణ శుక్రవారం, కృష్ణాష్టమి కలిసి రావడం విశేషం చాలా బావుంది...

అవును నిజమేనండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.