గురువారం, ఆగస్టు 22, 2019

రావమ్మా మహాలక్ష్మీ...

ఉండమ్మా బొట్టు పెడతా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి
గానం : బాలు, సుశీల

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా

నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
కొలువై ఉందువుగాని...కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా... రావమ్మా

గురివింద పొదకింద గొరవంక పలికె... 
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె ...
గురివింద పొదకింద గొరవంక పలికె... 
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె

తెల్లారి పోయింది పల్లె లేచింది...
తెల్లారి పోయింది పల్లె లేచింది... 
పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది

రావమ్మా మహాలక్ష్మీ... రావమ్మా... రావమ్మా... కృష్ణార్పణం

కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి...గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు

కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు


ముత్యాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు 

రావమ్మా మహాలక్ష్మీ... రావమ్మా... రావమ్మా... కృష్ణార్పణం

పాడిచ్చే గోవులకు పసుపుకుంకం...
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం... 
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం ...
గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం ...
కష్ఠించే కాపులకు కలకాలం సౌఖ్యం ...కలకాలం సౌఖ్యం ..

రావమ్మా మహాలక్ష్మీ ...రావమ్మా

నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
కొలువై ఉందువుగాని...కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా ...రావమ్మా...కృష్ణార్పణం


2 comments:

శ్రావణమాసం లో మేము వినే అమ్మవారి పాటల్లో ఇదీ ఒకటి..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.