తోలేటి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తోలేటి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, జనవరి 07, 2019

నందగోపాల నీతో...

జీవితం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జీవితం (1950)
సంగీతం : ఆర్.సుదర్శనం 
సాహిత్యం : తోలేటి
గానం : యం.యస్ రాజేశ్వరి   

నందగోపాల నీతో నేనాడుతానోయ్
వేణుగోపాల నీతో నేనాడుతానోయ్

నందగోపాల నీతో నేనాడుతానోయ్
వేణుగోపాల నీతో నేనాడుతానోయ్


నందగోపాల హః
వేణుగోపాల ! ఆ నందగోపాల !!
అతి మోదమైన నెమిలల్లె ఆడుతానోయ్
చిరు తీవల్లె ఊగీ, ధూగీ, ఆడుతానోయ్

గోపాల నీతో నేనాడుతా

కాటుక కనులా చూపులు మీర
జిలుగుల గాజులు కూర్చి,
వాల్జడ పూవుల పేర్చి
కస్తూరి తిలకము పెట్టి, అందుచనెద
నే ముద్దు గొనెదా ! నా మనమార

నందగోపాల నీతో నేనాడుతానోయ్
నందగోపాల నీతో నేనాడుతా


కూసే కోకిలారవమంతా నీ మురళీసుధారసమే !
మువ్వలందెల్ ముద్దులీనన్ ! మేఘ వర్ణా !
కన్నా ! రావా !

కన్ గీటి మనసు దోచుకున్న కన్నా రావా
గోపాల కృష్ణుడు యిటు రాకపోతేనో...
చాటు మాటుగనే, చల్ల చల్లగనే
నే మెల్లగనే, చల్లగనే, మెల్లగనే, చల్లగనే పోయెదా 

వేణు నాదములో కలిసిపోయి పాడుతా, నేపాడుతా
ప్రియవదని కృష్ణుని, నే కౌగిలిన్ కొనగాబోవన్
ఎదురై ఒక సేవకుడే, ఏలో, మధ్యన్, నిలచాడే.
ఎదురై నిలచాడే మధ్యన్
ఆపలేనమ్మ హా సైపలేనమ్మ
ఆపలేనమ్మ నే సైపలేనమ్మ
నందగోపాల, గోపాల గోపాల

నందగోపాల నీతో నేనాడుతానోయ్
నందగోపాల నీతో నేనాడుతా


సోమవారం, అక్టోబర్ 08, 2018

శ్రీ పార్వతి దేవి...

శ్రీ కాళహస్తి మహత్యం చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ కాళహస్తి మహత్యం (1954)
సంగీతం : ఆర్,సుదర్శనం, ఆర్. గోవర్ధనం
సాహిత్యం : తోలేటి
గానం : పి.సుశీల

శ్రీ పార్వతి దేవి
చేకోవే శైల కుమారి
మా పూజలే తల్లీ గౌరీ శంకరీ..
గౌరీ.. శంకరీ..

శ్రీ పార్వతి దేవి
చేకోవే శైల కుమారి
మా పూజలే తల్లీ గౌరీ శంకరీ..
గౌరీ.. శంకరీ..

ప్రాపు నీవే పాపహారి
పద్మ పత్ర నేత్రీ
ప్రాపు నీవే పాపహారి
పద్మ పత్ర నేత్రీ
కాపాడ రావమ్మా..
కాత్యాయనీ..
కాపాడ రావమ్మా..
కాత్యాయనీ..

శ్రీ పార్వతి దేవి
చేకోవే శైల కుమారి
మా పూజలే తల్లీ గౌరీ శంకరీ..
గౌరీ.. శంకరీ..

నిన్ను నమ్మినాను తల్లీ
అన్నపూర్ణ దేవి
నిన్ను నమ్మినాను తల్లీ
అన్నపూర్ణ దేవి
పాలించ రావమ్మా
పరమేశ్వరి.. ఈ..ఈ..
పాలించ రావమ్మా
పరమేశ్వరి.. ఈ..ఈ..

శ్రీ పార్వతి దేవి
చేకోవే శైల కుమారి
మా పూజలే తల్లీ గౌరీ శంకరీ..
గౌరీ.. శంకరీ..
 

ఆదివారం, జూన్ 10, 2018

కరవాలమ నీ శూరత...

ఆధునిక యుగంలో అహింసకు ప్రాధాన్యత నిస్తూ కత్తి కన్నా కలం గొప్పదని తీర్మానించేశారు కానీ రెండిటిలో ఏది గొప్పదనే వాగ్వాదం ఇప్పటిది కాదు, ఐతే రెండిటిలో దేని గొప్పదానిదేనంటూ ఒకదానికొకటి సహకరించుకోవాలనీ, ఐకమత్యమే లోక సౌభాగ్యమని చాటే ఈ చక్కని నృత్యరూపకం సంఘం చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంఘం (1954)
సంగీతం : ఆర్.సుదర్శనం
సాహిత్యం : తోలేటి
గానం : పి.సుశీల, టి.ఎస్.భగవతి

కరవాలమ నీ శూరత ఇల చూపు బిరాన
కరవాలమ నీ శూరత ఇల చూపు బిరాన
అధికార మదోన్మాధులనే అణచు జగానా
వడి అణచు జగానా వడి అణచు జగానా

కరవాలమ నీ శూరత ఇల చూపు బిరాన
అధికార మదోన్మాధులనే అణచు జగానా
వడి అణచు జగానా వడి అణచు జగానా

పరిపాలనమే నీ వలనే సాగును కాదా
ధర సాగును కాదా
పరిపాలనమే నీ వలనే సాగును కాదా
ధర సాగును కదా
కైజారు ఎవరినైన సరే రాజు సేయునే
కైజారు ఎవరినైన సరే రాజు సేయునే
మహరాజు సేయునే
మహరాజు సేయునే
ఘన జీవితమే కావలెనా కత్తిని గొనుమా
ఘన జీవితమే కావలెనా కత్తిని గొనుమా
దశదిశలకు నేనొసగిన సందేశము నిడుమా
సందేశము నిడుమా సందేశము నిడుమా

కరవాలమ నీ శూరత ఇల చూపు బిరాన
అధికార మదోన్మాధులనే అణచు జగానా
వడి అణచు జగానా వడి అణచు జగానా

కలములోన శక్తి చూపీ జగమే ఏలెదమే
కలములోన శక్తి చూపీ జగమే ఏలెదమే
దేశం కళకళలాడే కళలను తేలే విద్యలు తెలిపెదమే
తేలే విద్యలు తెలిపెదమే

కలములోన శక్తి చూపీ జగమే ఏలెదమే
దేశం కళకళలాడే కళలను తేలే విద్యలు తెలిపెదమే
తేలే విద్యలు తెలిపెదమే

నాలుక పైన వాక్యమే నవకావ్యమై మెరయా
నాలుక పైన వాక్యమే నవకావ్యమై మెరయా
రతనాల నోట పలికే పలుకే గానమై వెలుగా
రతనాల నోట పలికే పలుకే గానమై వెలుగా
నవ జీవితాన సమతాసౌఖ్యం, నాట్యం చేయిస్తాం
నవ జీవితాన సమతాసౌఖ్యం, నాట్యం చేయిస్తాం
సౌఖ్యం నాట్యం చేయిస్తాం

కలములోన శక్తి చూపీ జగమే ఏలెదమే
దేశం కళకళలాడే కళలను తేలే విద్యలు తెలిపెదమే
తేలే విద్యలు తెలిపెదమే


కత్తిలో బలమును తెలియకనే డంబాలు పలికేవే పో పో పో

బుద్ధిలో బలమును తెలియకనే గొప్పలేల పల్కేవే పో పో పో
బాలచంద్ర పాపారాయుల
బాలచంద్ర పాపారాయుల
మేటి కీర్తి నిలిపినదీ కత్తీ
మేటి కీర్తి నిలిపినదీ కత్తీ
తరతరాలు గడిచినా తెలుగు వీర చరితము
తరతరాలు గడిచినా తెలుగు వీర చరితము
స్వర్ణ పుటల ప్రస్ఫుటించు శక్తీ
స్వర్ణ పుటల ప్రస్ఫుటించు శక్తీ


నేత్రాలు రెండూ ఎదురై పోర అంతా అంధకారమే
ఎట్టి శక్తియూ తానై ఒంటిగా నిలచీ గెల్వ శక్యమా
నేత్రాలు రెండూ ఎదురై పోర అంతా అంధకారమే
ఎట్టి శక్తియూ తానై ఒంటిగా నిలచీ గెల్వ శక్యమా
మీలోన ఐకమత్యమే ఈ లోక సౌభాగ్యమే
మీలోన ఐకమత్యమే ఈ లోక సౌభాగ్యమే
కత్తి శక్తి, కలము యుక్తి, మేలుకోరి జగములోన
కత్తి శక్తి, కలము యుక్తి, మేలుకోరి జగములోన
సహకరించి జయము పొందరే
సహకరించి జయము పొందరే 




 

శనివారం, జూన్ 02, 2018

చక్కనైన బోయారాజుని...

ఈ రోజు వైజయంతీ మాల గారు నర్తించిన  జీవితం చిత్రంలోని చక్కనైన బోయారాజు అనే పాట తలుచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జీవితం (1950)
సంగీతం : ఆర్. సుదర్శనం
సాహిత్యం : తోలేటి 
గానం : టి.ఎస్.భగవతి, ఎం.ఎస్.రాజేశ్వరి

చక్కనైన బోయారాజుని
ఎక్కడైన చూశారా
మీరెక్కడైన చూశారా
అతను ఎవరో చెప్పమ్మా
ఆనవాళ్ళు చెప్పమ్మా నీవు
అతడేనయా నా జతగాడయా
ఆహా... నిజమేనయా..

చక్కనైన బోయారాజుని
ఎక్కడైన చూశారా
మీరెక్కడైన చూశారా
అతను ఎవరో చెప్పమ్మా
ఆనవాళ్ళు చెప్పమ్మా నీవు
అతడేనయా నా జతగాడయా
ఆహా... నిజమేనయా..

ఒక చేతిలో అమ్ము
ఒక చేత విల్లయ్యా
ఒక చేతిలో అమ్ము
ఒక చేత విల్లయ్యా
సిగ పక్కన చుట్టూతాడయ్యా
అది చూసే నా వాడయ్యా
ఎటు పోయెనో ఏమో
గుట్టూ నాకు తెలీదయ్యా
ఎటు పోయెనో ఏమో
గుట్టూ నాకు తెలీదయ్యా
అందచందమన్నీ చూసి
ఆశ పొందుతారయ్యా వాని
అందచందమన్నీ చూసి
ఆశ పొందుతారయ్యా
నన్ను చూసి పోయినాడయ్యా
నా దోసమేమి లేదయ్యా

ఎటువంటి వాడమ్మా
ఎటు పోయే చెప్పమ్మా
ఎటువంటి వాడమ్మా
ఎటు పోయే చెప్పమ్మా నీవు
అతడేనయా నా జతగాడయా
ఆహా... నిజమేనయా..

ఛంగున ఏ సింగమైన
లొంగదీసేవాడయ్యా
ఛంగున ఏ సింగమైన
లొంగదీసేవాడయ్యా
పలు హంగులున్న వాడయ్యా
నా బంగరు బావా వాడయ్యా
ఎంతెంతో తిరిగీ చూసీ
అంతు తెలియా లేదయ్యా
ఎంతెంతో తిరిగీ చూసీ
అంతు తెలియా లేదయ్యా 
 
పిక్క లాంటి అందగాడూ
ఈ పక్కకొచ్చినాడమ్మా
ఇక్కడే ఉన్నాడమ్మా
పిక్క లాంటి అందగాడూ
ఈ పక్కకొచ్చినాడమ్మా
ఇక్కడే ఉన్నాడమ్మా
ఇతడేన చూడమ్మా
ఇతడేన చూడమ్మా
 

ఆదివారం, జూన్ 26, 2016

సుందరాంగ మరువగలేనోయ్...

సంఘం చిత్రంలోని ఒక చక్కనైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సంఘం (1954)
సంగీతం : ఆర్. సుదర్శనం
సాహిత్యం : తోలేటి
గానం : సుశీల, టి. ఎస్. భాగవతి

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా
నా అందచందములు దాచితి నీకై.. రావేలా
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా
నా అందచందములు దాచితి నీకై.. రావేలా

ముద్దునవ్వులా మోహనకృష్ణా రావేలా
ముద్దునవ్వులా మోహనకృష్ణా రావేలా
ఆ నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ
నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా
నా అందచందములు దాచితి నీకై.. రావేలా 
 
నీలి కనులలో వాలుచూపుల ఆ వేళా
నను చూసి కనుసైగ చేసితివోయీ.. రావేలా
నీలి కనులలో వాలుచూపుల ఆ వేళా
నను చూసి కనుసైగ చేసితివోయీ.. రావేలా
కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా
కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా

 
ఆ మువ్వలలో పిలుపు అదే వలపు
మురిపెములె కలగలుపూ
మువ్వలలో పిలుపు అదే వలపు
మురిపెములె కలగలుపూ

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా
నా అందచందములు దాచితి నీకై రావేలా

హృదయవీణ తీగలు మీటీ ఆ వేళా
అనురాగ రసములే చిందితివోయీ రావేలా
హృదయవీణ తీగలు మీటీ ఆవేళా
అనురాగ రసములే చిందితివోయీ రావేలా

మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా
మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో ఫలవించే
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో ఫలవించే

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా
నా అందచందములు దాచితి నీకై రావేలా


మంగళవారం, మే 12, 2015

ఆనందమౌగా పల్లెసీమా...

జీవితం చిత్రం కోసం ఆర్.సుదర్శనం గారి స్వరసారధ్యంలో ఎస్.వరలక్ష్మి గానం చేసిన ఒక చక్కని గీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జీవితం (1950)
సంగీతం : ఆర్.సుదర్శనం
సాహిత్యం : తోలేటి
గానం : ఎస్.వరలక్ష్మి

ఓఓఓఓఓ...ఒహొహొఓఓఓఒహొ..లాలాలాల...
ఆనందమౌగా ఆనందమౌగా 
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లె సీమా 
మా పల్లెసీమా పల్లెసీమా

ఆనందమౌగా పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లెసీమ 
మా పల్లెసీమాఆఆ.. పల్లెసీమా

రంగు బంగారు పైరులు పొంగారు పంటలూ 
నాట్యాలు చేయు మా పల్లెసీమలో...ఓఓ...
రంగు బంగారు పైరులు పొంగారు పంటలూ 
నాట్యాలు చేయు మా పల్లెసీమలో పల్లెసీమలో
మామంచి తీరు మా ఊరు
మామంచి తీరు మా ఊరు 
తీయని నీరు కోనేరు 
తీయని నీరు కోనేరు 

ఆనందమౌగా ఆనందమౌగా 
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లె సీమా 
మా పల్లెసీమా పల్లెసీమా

దేశా దేశాలు పూజించు పల్లెసీమా..ఆఆ...
దేశా దేశాలు పూజించు పల్లెసీమ
ఆశలే లేని సర్కారి పల్లెసీమా ఆఆ...
దేశా దేశాలు పూజించు పల్లెసీమా..ఆఆ...
దేశా దేశాలు పూజించు పల్లెసీమ
ఆశలే లేని సర్కారి పల్లెసీమా ఆఆ...
మాతోడ కూడి మా తోవ చేరి
మాతోడ కూడి మా తోవ చేరి
మన దేశానికి సేవ చేయాలి 
మన దేశానికి సేవ చేయాలి

ఆనందమౌగా ఆనందమౌగా 
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లెసీమ 
మా పల్లెసీమా..ఆ.. పల్లెసీమా



శనివారం, మార్చి 08, 2014

భారత వీర కుమారిని నేనే

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా ఒకనాటి మేటి గీతాన్ని తలచుకుందామా. అంటే మహిళాభ్యుదయాన్ని ప్రోత్సహిస్తూ వచ్చే గీతం కాకపోయినా ఆ పాత్ర తీరుతెన్నులు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసంతో కూడిన నాయికని పరిచయం చేస్తూ సాగే ఈ పాట వింటున్నపుడు అసలే రక్షణ అంతంత మాత్రమవుతున్న ఈరోజుల్లో మహిళలంతా ఇదే ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తే బాగుంటుందని అనిపిస్తుంటుంది. సంఘం సినిమాలోని పాటలలో "సుందరాంగ మరువగలేనోయ్", "పెళ్ళీ" పాటలు కూడా నాకు ఇష్టమైనప్పటికీ ఈ పాట కొంచెం ఎక్కువ ఇష్టం. ఆడియో ఎంత బాగుంటుందో వైజయంతిమాల గారిపై చిత్రీకరించిన విధానం వలన కూడా మరింత బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. 

ఈ సినిమాలో వైజయంతిమాల గారిలా మహిళలంతా ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.



చిత్రం : సంఘం (1954)
సంగీతం : ఆర్.సుదర్శనం
సాహిత్యం : తోలేటి వెంకటరెడ్డి
గానం : పి.సుశీల

ఆఆఆఆఆఆ... 
లల్లా లాల్లలా... లల్లా లాల్లలా...
లల్లా లాల్లలా... లల్లా లాల్లలా...
లాలల లాలల లా లల్లల్లా...

భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే..
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..

భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే..
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..

స్వార్థముతో కులమత భేదముతో..
సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..
సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..
కర్షక సౌఖ్యం...
కర్షక సౌఖ్యం కార్మిక శ్రేయం.. 
కర్షక సౌఖ్యం కార్మిక శ్రేయం
కలిగే మార్గం చూపిస్తా..ఆఆఅ..
కలిగే మార్గం చూపిస్తా...

రాణీ రుద్రమ మల్లమదేవీ రెడ్డినాగమ్మ నేనే
రాణీ రుద్రమ మల్లమదేవీ రెడ్డినాగమ్మ నేనే
రణ తిక్కన భార్యా సతి మాంచాల
తిక్కన భార్యా సతి మాంచాల
శౌర్య ధైర్యములు నావే..
శౌర్య ధైర్యములు నావే.. 

భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే..
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..
ఆహో..ఓఓఓ...ఆఅహో..ఆఆఅ...
ఆహో..ఆఆఆఆఆ...
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.