ఈ రోజు వైజయంతీ మాల గారు నర్తించిన జీవితం చిత్రంలోని చక్కనైన బోయారాజు అనే పాట తలుచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : జీవితం (1950)
సంగీతం : ఆర్. సుదర్శనం
సాహిత్యం : తోలేటి
గానం : టి.ఎస్.భగవతి, ఎం.ఎస్.రాజేశ్వరి
చక్కనైన బోయారాజుని
ఎక్కడైన చూశారా
మీరెక్కడైన చూశారా
అతను ఎవరో చెప్పమ్మా
ఆనవాళ్ళు చెప్పమ్మా నీవు
అతడేనయా నా జతగాడయా
ఆహా... నిజమేనయా..
చక్కనైన బోయారాజుని
ఎక్కడైన చూశారా
మీరెక్కడైన చూశారా
అతను ఎవరో చెప్పమ్మా
ఆనవాళ్ళు చెప్పమ్మా నీవు
అతడేనయా నా జతగాడయా
ఆహా... నిజమేనయా..
ఒక చేతిలో అమ్ము
ఒక చేత విల్లయ్యా
ఒక చేతిలో అమ్ము
ఒక చేత విల్లయ్యా
సిగ పక్కన చుట్టూతాడయ్యా
అది చూసే నా వాడయ్యా
ఎటు పోయెనో ఏమో
గుట్టూ నాకు తెలీదయ్యా
ఎటు పోయెనో ఏమో
గుట్టూ నాకు తెలీదయ్యా
అందచందమన్నీ చూసి
ఆశ పొందుతారయ్యా వాని
అందచందమన్నీ చూసి
ఆశ పొందుతారయ్యా
నన్ను చూసి పోయినాడయ్యా
నా దోసమేమి లేదయ్యా
ఎటువంటి వాడమ్మా
ఎటు పోయే చెప్పమ్మా
ఎటువంటి వాడమ్మా
ఎటు పోయే చెప్పమ్మా నీవు
అతడేనయా నా జతగాడయా
ఆహా... నిజమేనయా..
ఛంగున ఏ సింగమైన
లొంగదీసేవాడయ్యా
ఛంగున ఏ సింగమైన
లొంగదీసేవాడయ్యా
పలు హంగులున్న వాడయ్యా
నా బంగరు బావా వాడయ్యా
ఎంతెంతో తిరిగీ చూసీ
అంతు తెలియా లేదయ్యా
ఎంతెంతో తిరిగీ చూసీ
అంతు తెలియా లేదయ్యా
పిక్క లాంటి అందగాడూ
ఈ పక్కకొచ్చినాడమ్మా
ఇక్కడే ఉన్నాడమ్మా
పిక్క లాంటి అందగాడూ
ఈ పక్కకొచ్చినాడమ్మా
ఇక్కడే ఉన్నాడమ్మా
ఇతడేన చూడమ్మా
ఇతడేన చూడమ్మా
2 comments:
ఎవ్వర్ గ్రీన్ వైజయంతిమాలగారు..80ప్లస్ లో వన్ ఆఫ్ రీసెంట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ వైజయంతిమాలా బాలి..
https://www.youtube.com/watch?v=zKvILzX5mX4
వావ్ అన్ బిలీవబుల్ శాంతి గారు.. థాంక్స్ ఫర్ షేరింగ్ దట్ వీడియో..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.