బుధవారం, జూన్ 06, 2018

ఉందిలే మంచి కాలం...

మనిషి ఆశాజీవి రానున్నవి మంచిరోజులు అనుకుంటూ ఉండకపోతే జీవించలేడు, మరి అలాంటి మంచి రోజులు ఎలా ఉంటాయో అవి రావాలంటే ప్రజలేం చేయాలో వివరించే ఈ చక్కని నృత్యరూపకం రాముడు భీముడు చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్ లో క్లియర్ ఆడియో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : రాముడు-భీముడు (1964)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : శ్రీశ్రీ
గానం :  ఘంటసాల, సుశీల

అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందనా..ఆ..ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందనా..ఆ..ఆ

ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందనా..ఉందిలే

ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ
ఎందుకో.. సందేహమెందుకో
రానున్న విందులో.. నీ వంతు అందుకో
ఎందుకో.. సందేహమెందుకో
రానున్న విందులో.. నీ వంతు అందుకో
ఆ రోజు అదిగో కలదూ నీ యెదుటా..ఆ...ఆ..
నీవే రాజువట..ఆ..ఆ

ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందనా..ఉందిలే

ఏమిటేమిటేమిటే.. మంచి కాలం అంటున్నావ్?
ఎలాగుంటుందో ఇశదంగా చెప్పూ

దేశ సంపద పెరిగే రోజు
మనిషి మనిషిగా బ్రతికే రోజు
దేశ సంపద పెరిగే రోజు
మనిషి మనిషిగా బ్రతికే రోజు
గాంధీ మహాత్ముడు కలగన్న రోజు
నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు
ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ..
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ..
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో

భలే భలే..బాగా చెప్పావ్..
కాని.. అందుకు మనమేం చెయ్యాలో
అది కూడా నువ్వే చెప్పు

అందరి కోసం ఒక్కడు నిలిచి
ఒక్కనికోసం అందరూ కలిసి
అందరి కోసం ఒక్కడు నిలిచి
ఒక్కనికోసం అందరూ కలిసి
సహకారమే మన వైఖరియైతే
ఉపకారమే మన ఊపిరి ఐతే
పేదాగొప్పా భేదం పోయి అందరూ..ఊ..ఊ..
నీదినాదని వాదం మాని ఉందురూ..ఊ
ఆ రోజెంతో దూరంలేదోరన్నయ్యో..ఓ..ఓ..
అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో
 
ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..
తీయగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరగా.. సుఖశాంతులూరగా
ఆకాశవీధుల ఎదురేలేకుండా ..ఆ..ఆ..
ఎగురును మన జెండా..ఆ..ఆ

ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందనా..ఆ..
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందనా..ఆ..
ఉందిలే

2 comments:

హాంటింగ్ సాంగ్..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.