గురువారం, జూన్ 07, 2018

విన్నావ యశోదమ్మా...

చిన్ని కృష్ణుని లీలలు ఎన్ని సార్లు విన్నా తనివితీరునా. ఆ నల్లనయ్య అల్లరులను అద్భుతంగా వర్ణించిన ఈ చక్కని నృత్యరూపకం మాయా బజార్ చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. కలర్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాయాబజార్ (1957) 
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి నాగేంద్ర రావు
గానం : పి.లీల, సుశీల, స్వర్ణలత(సీనియర్)
 
గోపికలు : విన్నావ యశోదమ్మా..విన్నావ యశోదమ్మా
మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి
అల్లరి చిల్లరి పనులు విన్నావ యశోదమ్మ

యశోద : అన్నెం పున్నెం ఎరుగని పాపడు
మన్నుతినే నా చిన్నితనయుడు
ఏమి చేసెనమ్మా ఎందుకు రవ్వ చేతురమ్మా


గోపికలు : ఆ..మన్ను తినేవాడా? వెన్న తినేవాడా?
కాలిగజ్జెల సందడి చేయక
పిల్లివలె మా ఇంట్లో దూరి
కాలిగజ్జెల సందడి చేయక
పిల్లివలె మా ఇంట్లో దూరి
ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని
దుత్తలన్నీ క్రింద దించుకుని
ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని
దుత్తలన్నీ క్రింద దించుకుని
పాలన్నీ తాగేశనమ్మా
పెరుగంతా జుర్రేశనమ్మా
వెన్నంతా మెక్కేశనమ్మా

కృష్ణుడు : ఒక్కడే ఎట్లా తినేశనమ్మా?
కలదమ్మా..ఇది ఎక్కడనైనా కలదమ్మా?
విన్నావటమ్మా..విన్నావటమ్మ
ఓ యశోదా! గోపిక రమణుల కల్లలూ
ఈ గోపిక రమణుల కల్లలూ..

 
గోపికలు : ఆ..ఎలా బూకరిస్తున్నాడో
పోనీ పట్టిద్దామంటే చిక్కుతాడా
భామలందరొక యుక్తిని పన్ని 
గుమ్మము నొకరుగ కాచియుండగా
ఒకరింట్లో విని గజ్జెల గలగల
ఒకరింట్లో విని వేణుగానమూ
ఒకరింట్లో విని గజ్జెల గలగల
ఒకరింట్లో విని వేణుగానమూ

ఆహా...ఇంకేం
దొంగ దొరికెనని పోయిచూడగా
ఛెంగున నెటకో దాటిపోయే
ఎలా వచ్చెనో ఎలా పోయెనో
చిలిపి కృష్ణునే అడుగవమ్మా
ఎలా వచ్చెనో ఎలా పోయెనో
చిలిపి కృష్ణునే అడుగవమ్మా

కృష్ణుడు : నాకేం తెలుసు నేనిక్కడ లేందే 

యశోద : మరి ఎక్కడున్నావు?
 

కృష్ణుడు : కాళింది మడుగున విషమును కలిపె
కాళియు తలపై తాండవమాడి
కాళింది మడుగున విషమును కలిపె
కాళియు తలపై తాండవమాడి
ఆ విషసర్పము నంతము జేసి
గోవుల చల్లగ కాచానే..గోవుల చల్లగ కాచానే..
గోవుల చల్లగ కాచానే
 
ద్రౌపది : హే కృష్ణా..హే కృష్ణా
ముకుందా మొరవినవా
నీవు వినా దిక్కెవరు దీనురాలి గనవా కృష్ణా
నా హీన గతిని గనవా..కృష్ణా కృష్ణా కృష్ణా


2 comments:

చాలా ఇష్టమైన పాట..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.