గురువారం, జూన్ 14, 2018

ముందటి వలె నాపై...

ఈ అందమైన క్షేత్రయ్య పదాన్ని ఆత్మగౌరవం చిత్రంలో ఎంత అందంగా అభినయించారో చూద్దామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆత్మగౌరవం (1966)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : క్షేత్రయ్య పదం  
గానం : సుశీల

ముందటి వలె నాపై నెనరున్నదా సామి
ముచ్చటలిక నేలరా నా సామి
ముచ్చటలికనేలరా
ఎందుకు మొగమిచ్చకపు మాటలాడేవు
ఎందుకు మొగమిచ్చకపు మాటలాడేవు
ఏరా మువ్వగోపాల మేరగాదుర నా సామి

ముందటి వలె నాపై నెనరున్నదా సామి
ముచ్చటలికనేలరా

చిన్ననాట నుండి చేరినదెంచక
నను చౌక చేసేది న్యాయమా
నను చౌక చేసేది న్యాయమా
వన్నెకాడ నీదు వంచనలెరుగానా
నిన్నన పని లేదు నే చేయు పూజకు

ముందటి వలె నాపై నెనరున్నదా సామి
ముచ్చటలికనేలరా

పిలువనంపిన రావు పిలచిన గైకోవు
పలుమారు వేడిన పలుకవు
వలపు నిలుపలేక చెలువుడవని నిన్నే
అఆఆఆ....ఆఆఆఆఆఅ.....
వలపు నిలుపలేక చెలువుడవని నిన్నే
తలచి తలచి చాలా తల్లడిల్లుటేకాని

ముందటి వలె నాపై నెనరున్నదా సామి
ముచ్చటలిక నేలరా నా సామి
ముచ్చటలికనేలరా 

2 comments:

పదాలు, జావళీలు, కీర్తనలు యేవైనా పాత సినిమాల్లో వాటిని మళ్ళీ స్వరపరచాలనిచూడలేదు..అందుకేన్ అవెప్పుడూ బావుంటాయి..

అవును శాంతి గారు కరెక్ట్ గా చెప్పారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.