ఆదివారం, నవంబర్ 30, 2014

ఏనాడైనా అనుకున్నానా...

అందమైన మెలోడీస్ కి కేరాఫ్ అడ్రస్ ఎస్.ఎ.రాజ్కుమార్. తన స్వరసారధ్యంలో సిరివెన్నెల గారు రచించిన ఒక అందమైన పాటను ఈరోజు తలచుకుందాం. ముగ్ధ సౌందర్యానికి భాష్యం చెప్పే సౌందర్య, హ్యాండ్సమ్ హీరో నాగార్జునలపై చిత్రీకరించడం ఈపాట అందాన్ని మరింత పెంచింది. హరిహరన్ చిత్రల గాత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ఎదురు లేని మనిషి (2001) 
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : హరిహరన్, చిత్ర

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా..
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా..
మనసుని మరి మరి అడగనా 
నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా 
నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా..

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా..
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా..

నిసపా గమరి నిసపా

శిలలైనా చిగురించే చినుకంటి శ్రీమతీ
తొలిసారీ తెలిసిందే చెలిమి సంగతీ 
గగనాలే శిరసొంచే సుగుణాల పెన్నిధీ 
వరమల్లే దొరికావే మంచి పెనిమిటీ 
ఓ ప్రతి అణువు తెగబరువై నిన్ను వేడుకున్నదీ 
జతపడుతూ సగమైతే ఎంత వేడుకన్నదీ 
ఇన్నాళ్ళు ఇంతటి భారం అనిపించలేదుగా 
నన్నేలు బంగరు ద్వారం కనిపించలేదుగా 

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా..
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా..

హృదయాంతరంగ శృంగారగంగ ప్రవహించె 
ప్రణయ పరవశంగా 
మృధుశృంగ ధార మధురామృతాలే జతిమధన 
మధుర మిధునమంతా

వెలుగంటే పడదంటూ కసిరే కసిరేయిలో 
తొలిపొద్దై వెలిగావే ప్రేమబంధమా 
వలపంటే విషమంటూ ఉలికిపడే గుండెలో 
అమృతమై కురిశావే ప్రణయమధురిమా 
ఓఓ..మెలకువనే కల అంటూ మూసుకున్న కళ్ళకీ 
ఒంటరిగా పయనిస్తూ దారి తప్పు కాళ్ళకీ 
సూర్యోదయం చూపావే నూరేళ్ళ కుంకుమా 
నా తీరమై నిలిచావే నా ఇంటి దీపమా 

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా..
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా..
మనసుని మరి మరి అడగనా 
నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా 
నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా..శనివారం, నవంబర్ 29, 2014

మగరాయ పంతామేలరా...

మాయామశ్చీంద్ర చిత్రంలో సుశీల గారు గానం చేసిన ఒక చక్కని పాటను ఈరోజు తలచుకుందామా. ఇందులో వాణీశ్రీ గారు చాలా బాగుంటారు. సాహిత్యం ఎవరు రాశారో తెలియదు కానీ ఆకట్టుకుంటుంది. నాకు నచ్చిన ఈపాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు.చిత్రం : మాయామశ్చీంద్ర (1975) 
సంగీతం : సత్యం 
సాహిత్యం : ??
గానం : పి.సుశీల 

మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నా వన్నెలు చిన్నెలు నిన్నే కోరెరా..

చిగురాకు బాకూ ఆ వలరాజు దూసే 
సెగలాటి వెలుగు ఆ నెలరాజు కాసే 
ఎలదేటి మనసూ దులిచేను రారా
ఎదమదనాగ్ని రేగేను మారాములేలా.. 

మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..

నిను చూడగానే నా నెమ్మేను పొంగే.. 
నిను చేర అందాల కెమ్మోవి ఊరే.. 
చెమరించె కన్నూ నన్నేల రారా 
అనురాగాల భోగాల లాలన శాయా 

మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..

మనకోసమేగా ఈ పొదరిల్లు పూచే.. 
ఆఅ పొదరింటిలోనా విరిపాన్పు వేసే 
వలచింది వనితా అలుసేల రా
నీనగుమోము కనలేని నా బతుకేలా

మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నా వన్నెల చిన్నెలు నిన్నే కోరెరా..
ఓ మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా.ఆఆఆ..

శుక్రవారం, నవంబర్ 28, 2014

ఇది ఆమని సాగే...

జేగంటలు సినిమాలోని ఒక హుషారైన పాట ఈరోజు తలచుకుందాం... రచన వేటూరి సుందరరామ్మూర్తి గారు, సంగీతం కె.వి.మహదేవన్. ఇది కూడా ఒకప్పుడు నేను రేడియోలో రెగ్యులర్ గా విన్నపాట. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : జేగంటలు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం: బాలు, సుశీల

ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం
ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం
మనోవేగమున మరోలోకమున
పరుగులు తీసే మనోరథం 

ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం
ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం
మనోవేగమున మరోలోకమున
పరుగులు తీసే మనోరథం
ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం

పంచప్రాణాల వేణువూది కోయిల పాడాలి.. 
ప్రణయాన పంచమస్వరమాలపించాలి
పంచప్రాణాల వేణువూది కోయిల పాడాలి.. 
ప్రణయాన పంచమస్వరమాలపించాలి
కృష్ణ వేణమ్మ యమునల్లె దారి చూపాలి.. 
నా కృష్ణుడున్న తీరాలు చేరుకోవాలి
కృష్ణ వేణమ్మ యమునల్లె దారి చూపాలి.. 
నా కృష్ణుడున్న తీరాలు చేరుకోవాలి
నీరెండ పూలుపెట్టి 
నీలాల కోక చుట్టీ 
నువ్వొస్తే బృందావనాలు నవ్వాలి

ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం
ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం
మనోవేగమున మరోలోకమున 
పరుగులు తీసే మనోరథం
ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం

అల నెలవంక పల్లకీలో సాగిపోవాలి
మనవంక తారలింక తేరిచూడాలి 
అల నెలవంక పల్లకీలో సాగిపోవాలి
మనవంక తారలింక తేరిచూడాలి
కొసమెరుపుల్ల ముత్యాల హారమేయాలీ 
నా వలపల్లే నిను నేను అల్లుకోవాలి
కొసమెరుపుల్ల ముత్యాల హారమేయాలీ 
నా వలపల్లే నిను నేను అల్లుకోవాలి
నా గుండె ఝల్లుమంటే 
గుడిగంట ఘల్లు మంటే
కౌగిళ్ళలో ఇళ్ళు కట్టుకోవాలి.. 

ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం
ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం
మనోవేగమున మరోలోకమున 
పరుగులు తీసే మనోరథం
ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం


గురువారం, నవంబర్ 27, 2014

ఎవరీ అమ్మాయని అడిగా...

ఇళయరాజా గారి అబ్బాయ్ యువన్ శంకర్ రాజా కంపోజిషన్ లో వచ్చిన ఒక అద్భుతమైన పాట ఇది. వెన్నెలకంటి గారి లిరిక్స్ కూడా డబ్బింగ్ పాట అయినా చాలా చక్కగా ఉంటాయి. హరిచరణ్ గానం గురించి చెప్పనే అక్కర్లేదు. చిత్రీకరణ సైతం నాకు చాలా ఇష్టం. నాకు నచ్చిన ఈపాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నేనే అంబాని (2010)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : హరిచరణ్

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు
నన్నే చూసేనే ఏదో  అడిగెనే,
మాయే  చేసెనే.. ఒహోహో
చూపుతో  నవ్వెనే  చూపులు  రువ్వేనే,
గుండె  గిల్లెనే  ఒహోహో
చుక్కల్లో నడుమ జాబిల్లి  తానే
రెక్కలు తొడిగే సిరిమల్లి తానై
ఏదో  చేసే  నన్నే ....

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు

 
మా  ఇంటి ముంగిట్లో  తను వేసే ముగ్గులు
ఎప్పటికీ చెరిగి  పోరాదంటా
తన  పెదవుల  మందారం
తన  పాపిట  సింధూరం
నా గుండెకి  సూర్యోదయమంటా
అందాల  గాజుల  లాగా
తన చేయి స్పర్శ తగిలితే  చాలు
తన కాలి మువ్వ  సవ్వడి  నేనై , 
కల కాలముంటే  మేలు
కమ్మని చెవిలో కబురే చెప్పెనే
సిగ్గులె  బుగ్గ  మొగ్గైంది  నీవేనే
ఏదో చేసే నన్నే ..హే  హే ...

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు


నే  తనని చూస్తే ఎటో చూస్తుంది
నే చూడకుంటే నన్నే  చూసే
తన నవ్వు చూపి, నే చూస్తే ఆపి
పైపైకి  నటనేదో చేసే
స్త్రీ హృదయం అద్వైతం లాగా
ఏనాడూ  ఎవరి కర్థమే కాదు
మగవాడి మనసూ తపియించే  వయసు
ఆడవాళ్ళకి  అలుసు
మది  గాయపడ్డాక  నాకోసం  వస్తుంది
వానే  వెలిసాక  గొడుగిచ్చి నట్టుంది
ఏదో చేసే నన్నే  ఏ  హే  హే ....

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు
నన్నే చూసేనే ఏదో  అడిగెనే,  
మాయే  చేసెనే.. ఒహోహో
చూపుతో  నవ్వెనే  చూపులు  రువ్వేనే,  
గుండె  గిల్లెనే  ఒహో హో
చుక్కల్లో నడుమ జాబిల్లి  తానె
రెక్కలు తొడిగే సిరిమల్లి తానై
ఏదో  చేసే  నన్నే  హే....

బుధవారం, నవంబర్ 26, 2014

పాడలేను పల్లవైనా...

సింధుభైరవి చిత్రంలోని మరో చక్కని పాటను ఈరోజు తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం: సింధుభైరవి (1985)
రచన: రాజశ్రీ
సంగీతం: ఇళయరాజా
గానం: చిత్ర

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
 పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను

అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నదీ
పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నదీ
ఊయలే తాళం పైరగాలే మేళం
మమతే రాగం శ్రమజీవనమే భావం
రాగమే లోకమంతా ఆ ఆ
రాగమే లోకమంతా కష్ట సుఖములే స్వరములంటా
షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దుపొడుపే సంగతంటా

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను

రాగానిదేముంది రసికులు మన్నిస్తే
తెలిసిని భాషలోనే తీయగా వినిపిస్తే
ఏ పాటైనా ఎద పొంగిపోదా
ఏప్రాణమైనా తనివితీరిపోదా
చెప్పేది తప్పో ఒప్పో ఓ ఓ
చెప్పేది తప్పో ఒప్పో రహస్యమేముంది విప్పి చెపితే
అహూ ఉహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం
ఆహూ ఊహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
మ ప ద మ పాడలేను పల్లవైనా
స రి గమ ప ద మ పాడలేను పల్లవైనా
ప ద ని స ని ద మ గ స రి పాడలేను పల్లవైనా
స స రి గ స రి గ మ గ స ప ద మ
మ మ ప ద మ ప ద ని ద మ ప ద ని
పదనిసరిగ సనిదమ పదనిస
నిదపద నిదమప దమగమ పదమగ మగస

సాసస సా సస సా స సరిగమ గమగసనిద
మా మమ మా మమ మా మ పదనిస నిసనిదమగ
సస రిరి గగ మమ పప దద నిని సస
నిససస నినిదనిద
మపదని దని దదమా
గమగ సరిగమ గమపద మపదని
సరిగమ గమసనిదమగ
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదా
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదా
మరి మరి నిన్నే మరి మరి నిన్నే ఏ ఏ...


లిరిక్స్ అపురూప గీతమాలిక నుండి సేకరించబడినవి, వారికి ధన్యవాదాలు.

మంగళవారం, నవంబర్ 25, 2014

తెల్లచీరకు తకధిమి...

లతామంగేష్కర్ గారు తెలుగులో పాడిన తొలిపాటట ఇది. తెలుగు నెలల పేర్లతో వేటురి గారు సరదాగా రాసిన లిరిక్స్ బాగుంటాయి. ఇళయరాజా గారి సంగీతం గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

సవరణ : ఈటీవీ వారి సౌందర్యలహరి ప్రోగ్రామ్ లో రాఘవేంద్రరావు గారు చెప్పిన మాట ఆధారంగా ఇదే లతగారి మొదటి పాట అని నేననుకున్నాను కానీ నిజానికి, 1955 లో వచ్చిన 'సంతానం' అనే సినిమాకోసం అనిసెట్టి-పినిశెట్టి రాసిన 'నిదురపోరా తమ్ముడా' అనే పాటని సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో పాడారుట లతా.. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగులో పాడిన పాట ఇది. అని బ్లాగ్ మిత్రులు నెమలికన్ను మురళి గారు మరియూ ఇతర మిత్రులు క్రింది కామెంట్స్ ద్వారా తెలియచేశారు. ఆ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆఖరి పోరాటం (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, లతా మంగేష్కర్

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో

సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో
అహ తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో


వైశాఖం తరుముతుంటే
నీ ఒళ్ళో ఒదుగుతున్నా

 ఆషాఢం ఉరుముతుంటే
నీ మెరుపే చిదుముకున్నా
కవ్వింతలో వాలి పువ్వంత కావాలి
పండించుకోవాలి ఈ బంధమే

నీతోడు కావాలి నే తోడుకోవాలి
నీ నీడలో ఉన్న శృంగారమే
జాబిల్లీ... సూరీడూ... ఆకాశంలో నిండిన సొగసుల

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో


కార్తీకం అహ్.. కలిసి వస్తే
నీ పరువం అడుగుతున్నా

హేమంతం కరుగుతుంటే
నీ అందం కడుగుతున్నా
ఆకాశ దేశాన ఆ మేఘరాగాలు
పలికాయి నా స్వప్నసంగీతమే

ఈ చైత్రమాసాల చిరునవ్వు దీపాలు
వెలిగాయి నీ కంట నాకోసమే
గిలిగింతే... గీతాలై... సింగారానికి సిగ్గులు కలిపిన

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో

అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో


సోమవారం, నవంబర్ 24, 2014

వెన్నెలా.. వెన్నెలా.. మెల్లగా రావే..

ప్రేమదేశం సినిమాలోని ఒక అందమైన పాటతో ఈ వారాన్ని ప్రారంభిద్దామా.. కమ్మనైన జోలపాట ఇంతకన్నా బాగా ఎవరూ చేయలేరేమో అనిపించేలా కంపోజ్ చేశారు రెహ్మాన్. భువనచంద్ర గారి లిరిక్స్ కూడా సన్నివేశానికి తగినట్లుంటాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమదేశం (1996)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం : భువనచంద్ర 
గానం : మనో, ఉన్నికృష్ణన్, డామ్నిక్

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
కడలి ఒడిలో నదులు ఒదిగి.. నిదురపోయే వేళా..
కనుల పైన కలలే వాలి.. సోలిపోయే వేళా..
 
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే.. 
పూవుల తేనెలే తేవే..

ఆశ ఎన్నడు విడువదా..
అడగరాదని తెలియదా..
నా ప్రాణం..చెలియా నీవేలే..
విరగబూసిన వెన్నెలా..
వదిలి వేయకే నన్నిలా..
రారాదా..ఎద నీదే కాదా..
నిదురనిచ్చే జాబిలీ..
నిదురలేక.. నీవే వాడినావా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే.. 
పూవుల తేనెలే తేవే..

మంచు తెరలో అలిసిపోయి..
మధన సంధ్య తూగెనే..
పుడమి ఒడిలో కలలుకంటూ..
పాపా నీవూ నిదురపో..
మల్లె అందం మగువకెరుక..
మనసు బాధ తెలియదా..
గుండె నిండా ఊసులే..
నీ ఎదుటనుంటే మౌనమే..
జోలపాటా పాడినా..
నే నిదురలేక వాడినా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే.. 
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే.. 
పూవుల తేనెలే తేవే..ఆదివారం, నవంబర్ 23, 2014

ఓ ఓహో చారుశీల...

గుణసుందరి కథ చిత్రం లోని ఈ పాట భలే ఉంటుంది. శివరాం గారు పాడిన విధానం మధ్యలో ఓహోఓఓ అనో లల్లల్ల అనో తీసే రాగాలు వినడానికి సరదాగా భలే ఉంటాయి. మీరూ ఈ పాట చూసీ వినీ ఈ సినిమాని మరోసారి తలచుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గుణసుందరికథ(1949)
సంగీతం : ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం : పింగళి
గానం : వి.శివరాం

ఓ..ఓహో.. చారుశీలా.. 
లేజవరాలా.. సొగసుభళా.. 
ఓ రూపబాలా.. చిందెను 
వలపు పులక లొలక బిర బిర.. 
కన్నుల్లో విందె అయి 
వెన్నెల్లో వసంతమై
కన్నుల్లో విందె అయి 
వెన్నెల్లో వసంతమై
చిన్నీ నీ హొయల్ గుబుల్ 
గుభాళించె నాహా జోహారులే..
చెంగావి చీర భళిలో.. రంగారే నీ అంగ భంగి
రంగేళీ పంట ఇంపుల్ సొంపుల్ జంపాలాడే.. 
లల్లల్లలాలలా.. లల్లల్లలాలలా.. 
లల్లలాలా లల్లల్లలాలా
లల్లల్లలాలలా.. లల్లల్లలాలలా.. 
లల్లలాలా లల్లల్ల

కుశాల్ బోణీ రసిక రమణి 
కుశాల్ బోణీ రసిక రమణి  
వగల్ చిమ్మీ వరించీ ఓహో.. ఓఓఓ..
ఓహో.. ఓఓఓ.. ఓహో.. ఓఓఓ..
నా మెళ్ళో దండై తల్లో పువ్వై నెగడే 
ముల్లోకాలేలే కేళిది 
ముల్లోకాలేలే కేళిది 
రావేలా బాలా బేలా నన్నో... ఓఓఓ...


శనివారం, నవంబర్ 22, 2014

ఇలా ఎంత సేపు...

సిరివెన్నెల గారి పాటలలో నాకు చాలా నచ్చే పాట ఇది. ముఖ్యంగా రెండో చరణం చాలా అద్భుతంగా రాశారనిపిస్తుంది. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శశిరేఖాపరిణయం (2008)
సంగీతం : మణిశర్మ, విద్యాసాగర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రాహుల్ నంబియార్

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా
ఎదో .. గుండెలోన కొంటె భావనా
అలా .. ఉండిపోక పైకి తేలునా

కనులను ముంచిన కాంతివో
కలలను పెంచిన భ్రాంతివో
కలవనిపించిన కాంతవో .. ఓ ఓ ఓ
మతి మరపించిన మాయవో
మది మురిపించిన హాయివో
నిదురను తుంచిన రేయివో .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా
ఎదో .. గుండెలోన కొంటె భావనా
అలా .. ఉండిపోక పైకి తేలునా


శుభలేఖలా .. నీ కళా .. స్వాగతిస్తుందో
శశిరేఖలా .. సొగసెటో .. లాగుతూ ఉందో
తీగలా .. అల్లగా .. చేరుకోనుందో
జింకలా .. అందకా .. జారిపోనుందో
మనసున తుంచిన కోరికా
పెదవుల అంచును దాటకా
అదుముతు ఉంచకె అంతగా .. ఓ ఓ ఓ
అనుమతినివ్వని ఆంక్షగా
నిలబడనివ్వని కాంక్షగా
తికమక పెట్టకె ఇంతగా .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా

మగపుట్టుకే .. చేరనీ .. మొగలి జడలోనా
మరుజన్మగా .. మారనీ .. మగువ మెడలోనా హో
దీపమై .. వెలగనీ .. తరుణి తిలకానా
పాపనై .. ఒదగనీ .. పడతి ఒడిలోనా
నా తలపులు తన పసుపుగా
నా వలపులు పారాణిగా
నడిపించిన పూదారిగా .. ఓ ఓ ఓ
ప్రణయము విలువే కొత్తగా
పెనిమిటి వరసే కట్టగా
బతకన నేనే తానుగా .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా

శుక్రవారం, నవంబర్ 21, 2014

చెన్నై చంద్రమా...

చక్రి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి (2003)
సంగీతం : చక్రి
సాహిత్యం : కందికొండ
గానం : చక్రి

ఆ.. ఆ.. ఆ.. ఆ..

చెన్నై చంద్రమా మనసే చేజారే
చెన్నై చంద్రమా నీలోన చేరే
తెగించి తరలిపోతోంది హృదయం
కోరే నీ చెలిమి

చెన్నై చంద్రమా..మనసే చేజారే
చెన్నై చంద్రమా..మనసే చేజారే
చెన్నై చంద్రమా నీలోన చేరే
తెగించి తరలిపోతోంది హృదయం
కోరే నీ చెలిమి

చెన్నై చంద్రమా..మనసే చేజారే

ప్రియా ప్రేమతో.. ఆ..ఆ..
ప్రియా ప్రేమతో పలికే పూవనం
ప్రియా ప్రేమతో పలికే పూవనం
పరవశంగా ముద్దాడనీ ఈ క్షణం
చెలి చేయని పెదవి సంతకం
ఆ.. చెలి చేయని పెదవి సంతకం
అధరపు అంచున తీపి జ్ఞాపకం

చెన్నై చంద్రమా.. మరపబ పబబబ్బబ..

సఖీ చేరుమా.. ఆ..ఆ..
సఖీ చేరుమా చిలిపితనమా
సఖీ చేరుమా చిలిపితనమా
సోగ కనులు చంపేయకే ప్రేమా
ఎదే అమృతం నీకే అర్పితం
ఎదే అమృతం నీకే అర్పితం
గుండెల నిండుగ పొంగెను ప్రణయం

చెన్నై చంద్రమా మనసే చేజారే
చెన్నై చంద్రమా నీలోన చేరే
తెగించి తరలిపోతోంది హృదయం
కోరే నీ చెలిమి

చెన్నై చంద్రమా..మనసే చేజారే


గురువారం, నవంబర్ 20, 2014

దేవీ మౌనమా...

ప్రేమాభిషేకం సినిమాలో అలిగిన ప్రేయసిని ప్రసన్నం చేసుకునేందుకు హీరోగారు పడే పాట్లేమిటో పాడే పాటలేమిటో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం :  ప్రేమాభిషేకం (1981)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాసరి
గానం : బాలు, సుశీల

దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా
దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా
నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పై..
హా...దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా
దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా

మౌన భంగము.. మౌన భంగము
భరియించదు ఈ దేవి హృదయము
ప్రేమ పాఠము.. ప్రేమ పాఠము
వినకూడదు ఇది పూజా సమయము
 
దేవి హృదయము విశాలము..
భక్తునికది కైలాసము
హే దేవి హృదయము విశాలము..
భక్తునికది కైలాసము
కోరిక కోరుట భక్తుని వంతు...
అడగక తీర్చుట దేవత వంతు
ధూపం వేయుట భక్తుని వంతు...
పాపం మోయుట దేవుని వంతు
పాపానికి మోక్షం ధూప దర్శనం...
ఈ ప్రాణికి మోక్షం నామ స్మరణం.. నీ నామ స్మరణం
దేవీ... దేవీ... దేవీ... దేవీ...

దేవీ కోపమా...  శ్రీదేవీ కోపమా
దేవీ కోపమా.... శ్రీదేవీ కోపమా
నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పై..
హా...దేవీ కోపమా ... శ్రీదేవీ కోపమా

స్వామి విరహము అహోరాత్రము
చూడలేదు నీ దేవి హృదయము
దేవీ స్తోత్రము... నిత్య కృత్యము
సాగనివ్వదు.. మౌన వ్రతము
స్వామి హృదయము ఆకాశము...
దేవికి మాత్రమే అవకాశము..హహహా..
స్వామి హృదయము ఆకాశము...
దేవికి మాత్రమే అవకాశము
అర్చన చేయుట దాసుని వంతు...
అనుగ్రహించుట దేవత వంతు
కోపం తాపం ఆజన్మ హక్కు...
పుష్పం పత్రం అర్పించి మొక్కు
నా హృదయం ఒక పూజా పుష్పం...
నా అనురాగం ఒక ప్రేమ పత్రం.. నా ప్రేమ పత్రం
దేవీ .... దేవీ....  దేవీ.... దేవీ

దేవి మౌనమా... శ్రీదేవి మౌనమా
దేవి మౌనమా...  శ్రీదేవి మౌనమా
నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పై..
హా..దేవి మౌనమా... శ్రీదేవి మౌనమా
దేవి మౌనమా... శ్రీదేవి మౌనమా


బుధవారం, నవంబర్ 19, 2014

కుందనపు బొమ్మ...

రహ్మాన్ సంగీత సారధ్యంలో వచ్చిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఏ మాయ చేశావే (2010)
సంగీతం : రెహమాన్
సాహిత్యం : కళ్యాణి మీనన్, అనంత్ శ్రీరామ్
గానం : బెన్నీ దయాళ్, కళ్యాణి మీనన్

ఆహా...అహ హ....బొమ్మ నిను చూస్తూ
నే రెప్ప వేయడం మరిచా...హే
అయినా హే...ఏవో....హే..
కలలు ఆగవే తెలుసా..హే తెలుసా
నా చూపు నీ బానిస..
నీలో..నాలో..లోలో
నును వెచ్చనైనది మొదలయిందమ్మా
ఓ...ఓ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ

కుందనపు బొమ్మ....కుందనపు బొమ్మ...
కుందనపు బొమ్మ...కుందనపు బొమ్మ...కుందన..
కుందనపు బొమ్మ...నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ...నిన్నే మరువదు ఈ జన్మ

హో...నీ పాదం నడిచే ఈ చోట..
హో.....కాలం...కలువై నవ్విందే....అలలై పొంగిందే..
నీకన్నా నాకున్న....ఆ...
వరమింకేదే...ఏదే...
హో....
వెన్నెల్లో వర్షంలా
కన్నుల్లో చేరావే నువ్వే
నన్నింక....నన్నింక నువ్వే నా ఆణువణువూ గెలిచావే
కుందనపు బొమ్మ...కుందనపు బొమ్మ...కుందనపు బొమ్మా

హే.. కుందనపు బొమ్మ...కుందనపు బొమ్మ...కుందన..
కుందనపు బొమ్మ...నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ...నిన్నే మరువదు ఈ జన్మ

Maragada tottilil
Malayalikal taraattum
Pennazhage
Maadhanga thooppukalil
Poonkuyilukal inna chernnu,
Pullankuzhal oothukayanu...
Ninna azhagaae...ninn-azhagee....

 

చల్లనైన మంటలో స్నానాలే చేయించావే..
ఆనందం అందించావే..
నీ మాట ఏటిలో ముంచావే తేల్చావే..
తీరం మాత్రం దాచావేంటే..బొమ్మా..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..
కుందనపు బొమ్మ..ఆ....హో.హో..
కుందన బొమ్మ... కుందనపు బొమ్మ..కుందన..
కుందనపు బొమ్మ..నువ్వే మనసుకి వెలుగమ్మ..
కుందనపు బొమ్మ..నిన్నే మరువదు ఈ జన్మ..

కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ.ఆ...హో..ఓ..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందన..
కుందనపు బొమ్మ..నువ్వే మనసుకి వెలుగమ్మ..
కుందనపు బొమ్మ..నువ్వే మనసుకి వెలుగమ్మ..హే..హే..
కుందనపు బొమ్మ..నిన్నే మరువను...హే..ఈ జన్మ..

హే...కుందనపు బొమ్మ..నువ్వే మనసుకి వెలుగమ్మ..


మంగళవారం, నవంబర్ 18, 2014

జిలిబిలి పలుకుల...

ఇళయరాజా, వేటూరి, వంశీ గార్ల కలయికలో పాటల గురించి వర్ణించడానికి మాటలు సరిపోవేమో కదా... అలాంటి కలయికలో వచ్చిన ఒక అద్భుతమైన పాట ఈ "జిలిబిలి పలుకుల" పాట. నాకు చాలా ఇష్టమైన ఈపాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం :  సితార (1983)
సంగీతం :  ఇళయరాజా
సాహిత్యం :  వేటూరి
గానం :  బాలు, జానకి 

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన.. ఓ మైనా మైనా
మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన.. ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా.. ఓ మైనా

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన.. ఓ మైనా మైనా

అడగనులే చిరునామా.. ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వా...  తారాడే సిరిమువ్వా
తారలకే సిగపువ్వా... తారాడే సిరిమువ్వా
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు.. ఓ మైనా ఏమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన... ఓ మైనా మైనా

ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా
మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా
ఎండలకే అల్లాడే...  వెన్నెలలో క్రీనీడ
ఎండలకే అల్లాడే...  వెన్నెలలో క్రీనీడ
వినువీధి వీణల్లో రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు.. నిలిపేన ఏమైనా

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా
మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన... ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా 


సోమవారం, నవంబర్ 17, 2014

మహా ప్రాణదీపం...

నేడు ఈఏడాదికి చివరి కార్తీక సోమవారం కదా మరి ఈ సందర్బంగా పరమశివుని తలచుకుంటూ శ్రీ మంజునాథ సినిమా కోసం శంకరమహదేవన్ గారు గానం చేసిన ఈ అద్భుతమైన పాటను గుర్తు చేసుకుందామా. శంకర్ మహదేవన్, అర్జున్ ఇద్దరూ కలిసి ఈ పాటను శిఖరాగ్రానికి చేర్చారు, విన్న ఎవరికైనా భక్తి భావంతో ఒళ్ళు పులకిస్తుందనడంలో ఏ సందేహం లేదు. మీరూ చూసీ వినీ తరించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీ మంజునాథ
సంగీతం : హంసలేఖ
సాహిత్యం : శ్రీ వేదవ్యాస
గానం : శంకర్ మహదేవన్

ఓం
మహా ప్రాణ దీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాద్రి నేత్రం పవిత్రం
మహా ఘాడ తిమిరాంతకం సౌర గాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం భజే మంజునాథం

ఓం..ఓం..ఓం...
నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివాయచ శివతరాయచ భవహరాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం అర్థ నారీశ్వరం
త్రిదశ హృదయంగమం చతురదధి సంగమం
పంచ భూతాత్మకం షట్ శత్రు నాశకం
సప్తస్వరేశ్వరం అష్ట సిద్ధీశ్వరమ్
నవరసమనోహారం దశ దిశా సువిమలం

ఏకాదశోజ్వలం ఏకనాధేశ్వరం
ప్రస్తుతివశంకరం ప్రణత జన కింకరం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
ప్రాణిభవతారకం ప్రకృతిహిత కారకం
భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈశం సురేశం ఋషేశం పరేశం 
నటేశం గౌరీశం గణేశం భూతేశం

మహామాధుర పంచాక్షరీ మంత్ర మార్చ్యం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం

ఓం
నమో హరాయచ సర్వ హరాయచ
పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ
ఇంద్రాయచ నిత్యాయచ నిర్ నిద్రాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

ఢం ఢం ఢ
ఢం ఢం ఢ
ఢం ఢం ఢ
ఢం ఢం ఢ
ఢంకా నినాధ నవ తాండవాడంబరం
తధిమ్మి తకధిమ్మి దిధిమ్మి ధిమి ధిమ్మి 
సంగీత సాహిత్య సుమకమలమంబరం
ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార 
మంత్రబీజాక్షరం మంజునాధేశ్వరం
ఋగ్వేదమాజ్యం ఎదుర్వేదవేద్యం
సామప్రతీతం మధర్మప్రభాతం
పురాణేతిహాసం ప్రసిద్యం విశుద్ధం
ప్రపంచైకసూత్రమ్ విరుద్ధం సుసిద్ధం

నకారం
మకారం
శికారం
వకారం
యకారం
నిరాకార సాకార సారం

మహాకాలకాలం మహానీల కంఠం
మహానందనందం మహాట్టాట్టహాసం
జటాజూట రంగైక గంగా సుచిత్రం
జ్వలత్ఉగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశభాసుం మహాభానులింగం
మహావర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరాష్ట్రసుందరం సౌమనాధేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం
ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం
వైద్యనాదేశ్వరం మహా భీమేశ్వరం
అమరలింగేశ్వరం భామలింగేశ్వరం
కాశివిశ్వేశ్వరం పరంక్రిష్మేశ్వరం
త్ర్యంబాకాధీశ్వరం నాగలింగేశ్వరం
శ్రీ... కేదారలింగేశ్వరం

అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం
వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం

అనాదిం.. అమేయం.. అజేయం.. అచింత్యం..
అమోఘం.. అపూర్వం.. అనంతం.. అఖండం..

అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థల క్షేత్ర పరపరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర పరపరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర పరపరంజ్యోతిం

ఓం

నమః సోమయచ సౌమ్యాయచ
భావ్యాయచ భాగ్యాయచ శాంతాయచ
శౌర్యాయచ యోగాయచ భోగాయచ
కాలాయచ కాంతాయచ రమ్యాయచ
గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వాయచ


ఆదివారం, నవంబర్ 16, 2014

సహానా శ్వాసే వీచెనో...

శివాజి సినిమాకోసం ఏ.ఆర్.రహ్మాన్ స్వరపరచిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం... ఈ పాట సంగీతం మంచి మెలోడియస్ గా ఉండి ఆకట్టుకుంటుంది. గ్లాస్ హౌస్ లో ఈ పాటను శంకర్ చిత్రీకరించిన విధానం ఒక అద్భుతాన్ని చూస్తున్న అనుభూతినిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శివాజీ(2007)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : సుద్దాల అశోక్‌తేజ
గానం : ఉదిత్ నారాయణ్, చిన్మయి

సహానా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో
సహానా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో

సహారా పూవై పూచెనో
సహానా శ్వాసే వీచెనో
 

ఆ నింగిలో తళుక్కువై
వసుంధర దిగి రా
వెండి వెన్నెలై ఇంటికె వేంచేసెనో
అవి గుండెలో తేనె కుండలో
కలయో నిజమో ప్రేమమందిరమో

ఏ అంబరం కాంచని
ప్రేమయె నాది చెలీ
ఏ ఆయుధం తెంచని
కౌగిలి చేరు మరీ 

సహారా పూవై పూచెనో
సహానా శ్వాసే వీచెనో
 
ధింతననన ధింతననన ధిరనననననననా 
ధింతననన ధింతననన ధిరనననననననా 
ధింతననన ధింతననన ధిరనననననననా 
ధింతననన ధింతననన ధిరనననననననా 
 
అదేమిటో నా ఎద వరించింది
తీయగా పెదాలతో మదించి విడు
నీ మీసమే మురిసింది ముద్దుల
బాకుల మరింతగా సుఖించి విడు
 
మోముకు కాళ్లకు నును లేత వేళ్లకు
పూలతో దిష్టి తీయనా
కన్నుల తోటలో పూచిన జాబిలి
నీవని హత్తుకుందునా
ఏ అంబరం కాంచని
ప్రేమయా నాది చెలీ
ఏ ఆయుధం తెంచని
కౌగిలి చేరు మరీ 

ఏ అంబరం కాంచని
ఏ అంబరం కాంచని
ప్రేమయే నాది సఖా
ప్రేమయే నాది సఖా

ఏ ఆయుధం తెంచని 
కౌగిలి చేరు ఇకా..ఆఆ... 
సహానా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో

సహారా పూవై పూచెనో
సహానా శ్వాసే వీచెనో
 

ఆ నింగిలో తళుక్కువై
వసుంధర దిగి రా
వెండి వెన్నెలై ఇంటికె వేంచేసెనో
అవి గుండెలో తేనె కుండలో
కలయో నిజమో ప్రేమమందిరమో 

ఏ అంబరం కాంచని
ప్రేమయా నాది చెలీ
ఏ ఆయుధం తెంచని
కౌగిలి చేరు మరీ 

సహారా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో
ఓఓ..ఓఓ..ఓఓఓఓఓఓ

 

శనివారం, నవంబర్ 15, 2014

రసమంజరీ...

సింధుభైరవి సినిమాకోసం ఇళయరాజా గారి స్వరకల్పనలో ఏసుదాస్ గారు పాడిన ఈ చక్కని పాట ఈరోజు మీకోసం. ఏసుదాస్ గారూ ఇళయరాజా గారి కలయికలో వచ్చిన పాట గురించి నేను వ్యాఖ్యానించగలిగినంతటి వాడనా మీరే విని ఎంత బాగుందో తెలుసుకోండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సింధుభైరవి (1985)
సంగీతం : ఇళయరాజా
రచన : రాజశ్రీ
గానం : కె.జె.ఏసుదాస్

రసమంజరీ.. సొగసైన కలికి సుఖకేళి పడతి
స్వరమధువు ప్రియ వధువు
కులుకుల కొలికి వలపుల చిలికి
అడుగిడె అభినవ రసమంజరి

రసమంజరీ.. సొగసైన కలికి సుఖకేళి పడతి
స్వరమధువు ప్రియ వధువు
కులుకుల కొలికి వలపుల చిలికి
అడుగిడె అభినవ రసమంజరీ

స్వరమంగళ లలనా ఎద వీడగలనా
పరువాల స్మరణ
మరుజన్మం కరుణ
అను మెరుగుల దయచూడక
మనగలనా జ్వలనా
చెలి తపఃఫలం స్వయం సిద్ధం
చేకొన విడివడెనా
ముఖం దాచవలెనా... ఆ....
ముఖం దాచవలెనా
మృదుమధుర వదనా
నీ మోమందు పూర్ణేందు
ప్రభల్ కనగ
నా ఎడద సుఖానపడు

రసమంజరీ.. సొగసైన కలికి సుఖకేళి పడతీ
స్వరమధువు ప్రియ వధువు
కులుకుల కొలికి వలపుల చిలికి
అడుగిడె అభినవ రసమంజరీ

రూపం కనుటకు తొందర తొలగెను
తొలుత తోచ పరిపాటి
గంగను తలనిడి పార్వతి సతియను
శివుని వీడు ఒక జాతి
రామయదొక విధి కృష్ణయదొక విధి
భువిని చూడ సమనీతి
అచ్చట కలిమికి ఇచ్చట చెలిమికి
ఎవరు ఎవరు సరిజోడి
కన్నీర్పెరిగినచో... ఆ... ఆ...
కన్నీర్పెరిగిన కన్నుల సుముఖం
చక్కగ కనబడు ద్విరూపం
చినుకా తొలకరి చినుకా
చిలకా చిక్కని చిలకా
జలజల వలవల వలచిన చెలుడిటు
నిలువున విలపిలె
బ్రతుకున అడుగిడు చెలువా


శుక్రవారం, నవంబర్ 14, 2014

పిల్లలూ దేవుడూ చల్లనివారే...

పిల్లలకూ, పెద్దలకూ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్బంగా లేతమనసులు చిత్రంలోని పాటను తలచుకుందామా.. ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ఈ పాట నాకు చాలా ఇష్టం, పాటంతా క్లాస్ రూమ్ లో పాడుతున్న ఒక్క చిన్న పాపపైనే చిత్రీకరించినా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : లేత మనసులు (1966)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆరుద్ర
గానం :  సుశీల

పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...

తప్పులు మన్నించుటే దేవుని సుగుణం...
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం...
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం...
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం...

పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...

 
పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును...
పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును...
ఆ పురిటి కందు మనసులో దైవముండును...
ఆ పురిటి కందు మనసులో దైవముండును...
వయసు పెరిగి ఈసు కలిగి.. మదము హెచ్చితే...
వయసు పెరిగి ఈసు కలిగి.. మదము హెచ్చితే...
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే...
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే...

పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...

 
వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును...
వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును...
మనిషి తెలివి అనే సూర్యుణ్ణి..  కోపం మూయును...
మనిషి తెలివి అనే సూర్యుణ్ణి.. కోపం మూయును...
గాలి వీచ మబ్బు తెరలు కదలిపొవులే...
గాలి వీచ మబ్బు తెరలు కదలిపొవులే...
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే..
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే..

పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...

 
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు...
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు...
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు...
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు...
మాయమర్మమేమి లేని బాలలందరు...
మాయమర్మమేమి లేని బాలలందరు...
ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే...
ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే...

పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం...
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం...

పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...


గురువారం, నవంబర్ 13, 2014

చిన్ని చిన్ని కోయిలల్లే...

మౌనరాగం సినిమాలోని ఒక చక్కని పాటను ఈరోజు తలచుకుందామా. ఇందులో జానకి గారి స్వరం నాకు చాలా ఇష్టం ముఖ్యంగా చరణాలలో... ఇళయరాజా గారి సంగీతం గురించి చెప్పేదేముంది అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


సినిమా : మౌనరాగం(1986)
సంగీతం : ఇళయరాజా
రచన : రాజశ్రీ
గానం : జానకి 

లాలలాల లాలలాల లాలలాల లాలలాల
లలలాల లలలాల లలలాల లలలాల
లలలాల లలలాల లాలా లాలాలాలా..
 
చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
ఊరించే ఆనందం లోలోన ఆరంభం
ఊరించే ఆనందం లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ నేనే నేనే
 
చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
 
మల్లెల బాటలోన పాటలే  కోరుకుందీ
మన్మథుని పాటలోన గాధలే పాడుకుంది
ఊహలే జీవితం చిందెనే మాటలే
సాగెనే ఆశలే రేగెనే ఊసులే
మనసు ఊగి..
మ్.మ్.మ్.మ్
మరులు రేగి.. మ్.మ్.మ్.మ్ 
మనసు ఊగి.. మ్.మ్.మ్.మ్
మరులు రేగి.. మ్.మ్.మ్.మ్ 
అందరాని సన్నిధి నేనే.. నేనే.. నేనే..

చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసేనమ్మా
ఊరించే ఆనందం లోలోన ఆరంభం
ఊరించే ఆనందం లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ నేనే నేనే
చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా

 
వెచ్చని సందె వేళ బాసలే ఆడెనులే
పచ్చని కన్నెవయసు గంగలా పొంగెనులే
కమ్మని తేనెలే గుండెలో తేలెనే
చీకటే వచ్చినా ఊహలే ఊరేనే
జీవితాంతం.. మ్.మ్.మ్.మ్ 
స్నేహరాగం.. మ్.మ్.మ్.మ్ 
జీవితాంతం.. మ్.మ్.మ్.మ్ 
స్నేహరాగం.. మ్.మ్.మ్.మ్
పరువ రాగ కీర్తనం పాడె.. పాడె.. పాడె

చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
ఊరించే ఆనందం లోలోన ఆరంభం
ఊరించే ఆనందం లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ నేనే నేనే
 
చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా


బుధవారం, నవంబర్ 12, 2014

అందాల ఓ చిలకా...

లేత మనసులు సినిమా కోసం పిబిశ్రీనివాస్ గారు పాడిన ఈ పాట చాలా బాగుంటుంది. ఒక చరణం హీరో అడిగే ప్రశ్నలా మరో చరణం దానికి హీరోయిన్ ఇచ్చే సమాధానంలా సాగే లిరిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : లేత మనసులు (1966)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : దాశరథి
గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను

 
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
కురుల మోముపై వాలెనేలనో
విరులు కురులలో నవ్వెనెందుకో
అడుగుతడబడే చిలకకేలనో
పెదవి వణికెను చెలియకెందుకో

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
కురులు మోముపై మరులు గొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగుతడబడే సిగ్గు బరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో

అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను

 
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి 
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధుర మార్గము మనసు చూపులే
నీవు పాడగా నేను ఆడగా
యుగము క్షణముగా గడచిపోవుగా

 
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.