ఆదివారం, నవంబర్ 16, 2014

సహానా శ్వాసే వీచెనో...

శివాజి సినిమాకోసం ఏ.ఆర్.రహ్మాన్ స్వరపరచిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం... ఈ పాట సంగీతం మంచి మెలోడియస్ గా ఉండి ఆకట్టుకుంటుంది. గ్లాస్ హౌస్ లో ఈ పాటను శంకర్ చిత్రీకరించిన విధానం ఒక అద్భుతాన్ని చూస్తున్న అనుభూతినిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శివాజీ(2007)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : సుద్దాల అశోక్‌తేజ
గానం : ఉదిత్ నారాయణ్, చిన్మయి

సహానా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో
సహానా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో

సహారా పూవై పూచెనో
సహానా శ్వాసే వీచెనో
 

ఆ నింగిలో తళుక్కువై
వసుంధర దిగి రా
వెండి వెన్నెలై ఇంటికె వేంచేసెనో
అవి గుండెలో తేనె కుండలో
కలయో నిజమో ప్రేమమందిరమో

ఏ అంబరం కాంచని
ప్రేమయె నాది చెలీ
ఏ ఆయుధం తెంచని
కౌగిలి చేరు మరీ 

సహారా పూవై పూచెనో
సహానా శ్వాసే వీచెనో
 
ధింతననన ధింతననన ధిరనననననననా 
ధింతననన ధింతననన ధిరనననననననా 
ధింతననన ధింతననన ధిరనననననననా 
ధింతననన ధింతననన ధిరనననననననా 
 
అదేమిటో నా ఎద వరించింది
తీయగా పెదాలతో మదించి విడు
నీ మీసమే మురిసింది ముద్దుల
బాకుల మరింతగా సుఖించి విడు
 
మోముకు కాళ్లకు నును లేత వేళ్లకు
పూలతో దిష్టి తీయనా
కన్నుల తోటలో పూచిన జాబిలి
నీవని హత్తుకుందునా
ఏ అంబరం కాంచని
ప్రేమయా నాది చెలీ
ఏ ఆయుధం తెంచని
కౌగిలి చేరు మరీ 

ఏ అంబరం కాంచని
ఏ అంబరం కాంచని
ప్రేమయే నాది సఖా
ప్రేమయే నాది సఖా

ఏ ఆయుధం తెంచని 
కౌగిలి చేరు ఇకా..ఆఆ... 
సహానా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో

సహారా పూవై పూచెనో
సహానా శ్వాసే వీచెనో
 

ఆ నింగిలో తళుక్కువై
వసుంధర దిగి రా
వెండి వెన్నెలై ఇంటికె వేంచేసెనో
అవి గుండెలో తేనె కుండలో
కలయో నిజమో ప్రేమమందిరమో 

ఏ అంబరం కాంచని
ప్రేమయా నాది చెలీ
ఏ ఆయుధం తెంచని
కౌగిలి చేరు మరీ 

సహారా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో
ఓఓ..ఓఓ..ఓఓఓఓఓఓ

 

2 comments:

వేణువులో పలికే యే రాగమైనా శ్వాసనే వరిస్తుంది కదండీ...

అవునండీ :-) థాంక్స్ ఫర్ ద నైస్ కామెంట్ శాంతిగారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.