శుక్రవారం, నవంబర్ 14, 2014

పిల్లలూ దేవుడూ చల్లనివారే...

పిల్లలకూ, పెద్దలకూ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్బంగా లేతమనసులు చిత్రంలోని పాటను తలచుకుందామా.. ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ఈ పాట నాకు చాలా ఇష్టం, పాటంతా క్లాస్ రూమ్ లో పాడుతున్న ఒక్క చిన్న పాపపైనే చిత్రీకరించినా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : లేత మనసులు (1966)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆరుద్ర
గానం :  సుశీల

పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...

తప్పులు మన్నించుటే దేవుని సుగుణం...
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం...
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం...
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం...

పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...

 
పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును...
పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును...
ఆ పురిటి కందు మనసులో దైవముండును...
ఆ పురిటి కందు మనసులో దైవముండును...
వయసు పెరిగి ఈసు కలిగి.. మదము హెచ్చితే...
వయసు పెరిగి ఈసు కలిగి.. మదము హెచ్చితే...
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే...
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే...

పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...

 
వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును...
వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును...
మనిషి తెలివి అనే సూర్యుణ్ణి..  కోపం మూయును...
మనిషి తెలివి అనే సూర్యుణ్ణి.. కోపం మూయును...
గాలి వీచ మబ్బు తెరలు కదలిపొవులే...
గాలి వీచ మబ్బు తెరలు కదలిపొవులే...
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే..
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే..

పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...

 
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు...
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు...
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు...
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు...
మాయమర్మమేమి లేని బాలలందరు...
మాయమర్మమేమి లేని బాలలందరు...
ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే...
ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే...

పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం...
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం...

పిల్లలూ దేవుడూ చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...


2 comments:

ఆ' అంటే అమలాపురం, కెవ్వ్వ్ కేక.. లాంటి పాటలకంటే పిల్లలకి ఇటువంటి పాటలు అర్ధం చెప్పి నేర్పిస్తే ఆడుతూ పాడుతూ జెనరల్ బిహేవియర్ నేర్చుకుంటారు..

హ్మ్.. ఈ ఫేస్బుక్ కాలంలో ఇలాంటి కోరిక కోరడం అత్యాశే అయిపోతుందండీ.. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.