శనివారం, నవంబర్ 22, 2014

ఇలా ఎంత సేపు...

సిరివెన్నెల గారి పాటలలో నాకు చాలా నచ్చే పాట ఇది. ముఖ్యంగా రెండో చరణం చాలా అద్భుతంగా రాశారనిపిస్తుంది. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శశిరేఖాపరిణయం (2008)
సంగీతం : మణిశర్మ, విద్యాసాగర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రాహుల్ నంబియార్

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా
ఎదో .. గుండెలోన కొంటె భావనా
అలా .. ఉండిపోక పైకి తేలునా

కనులను ముంచిన కాంతివో
కలలను పెంచిన భ్రాంతివో
కలవనిపించిన కాంతవో .. ఓ ఓ ఓ
మతి మరపించిన మాయవో
మది మురిపించిన హాయివో
నిదురను తుంచిన రేయివో .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా
ఎదో .. గుండెలోన కొంటె భావనా
అలా .. ఉండిపోక పైకి తేలునా


శుభలేఖలా .. నీ కళా .. స్వాగతిస్తుందో
శశిరేఖలా .. సొగసెటో .. లాగుతూ ఉందో
తీగలా .. అల్లగా .. చేరుకోనుందో
జింకలా .. అందకా .. జారిపోనుందో
మనసున తుంచిన కోరికా
పెదవుల అంచును దాటకా
అదుముతు ఉంచకె అంతగా .. ఓ ఓ ఓ
అనుమతినివ్వని ఆంక్షగా
నిలబడనివ్వని కాంక్షగా
తికమక పెట్టకె ఇంతగా .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా

మగపుట్టుకే .. చేరనీ .. మొగలి జడలోనా
మరుజన్మగా .. మారనీ .. మగువ మెడలోనా హో
దీపమై .. వెలగనీ .. తరుణి తిలకానా
పాపనై .. ఒదగనీ .. పడతి ఒడిలోనా
నా తలపులు తన పసుపుగా
నా వలపులు పారాణిగా
నడిపించిన పూదారిగా .. ఓ ఓ ఓ
ప్రణయము విలువే కొత్తగా
పెనిమిటి వరసే కట్టగా
బతకన నేనే తానుగా .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా

2 comments:

అమాయిల మనసుని కృష్ణవంశీ చాలా అందంగా ఆవిష్కరిస్తారు కదండీ..

అవును శాంతి గారు కరెక్ట్ గా చెప్పారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.