ఈ కార్తీక సోమవారం నాడు సువర్ణ సుందరి చిత్రం లోని ఒక చక్కని పాటను తలచుకుందామా. దేవకన్యలంతా ఆ జగదీశ్వరుని తమ నాట్యంతో అర్చించే ఈ పాట వినడానికీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సువర్ణసుందరి(1957)
సంగీతం : ఆదినారాయణరావ్
రచన : సముద్రాల
గానం : సుశీల, కోరస్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓం...నమశ్శివాయః సిద్ధం నమః ఓం...
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
దేవాపుర సంహార!..ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా..పాహి సురశేఖరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
శంభోహరా..వినుతలంబోధరా..
అంబావరకావరా..ఆ ఆ ఆ....
శంభోహరా..వినుతలంబోధరా..
అంబావరకావరా..
వరమీయరా..గౌరి..వరసుందరా
గౌరి..వరసుందరా..
నిన్నే కని మేము కొలిచేము..గంగాధరా
దేవ...గంగాధరా...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
ప్రధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ప్రధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..
నడిపెను సుందర నటనకు జతులిడ
నందియ మార్దళనాదమే..
మధురాతిమధుర శృతి గీతమే...
తధిమి..తధిమి ధిమితైతై తయ్యని
తాండవమాడేను..పాదమే..
మది సేవించిన సమ్మోదమే..
జగంబులా ఏలికా..శివకామ సుందర నాయకా
జగంబులా ఏలికా..శివకామ సుందర నాయకా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ప్రమధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..
4 comments:
ఈ మూవీలో అన్నీ అద్భుతమైన కంపోజిషన్సే..పిలవకురా, యేరా మనతోటి గెలిచే,బొమ్మాలమ్మాబొమ్మలూ, మరీ ముఖ్యంగా "హాయి హాయిగా"..
అవునండీ దదాపు అన్నిపాటలూ చాలా బాగుంటాయి ఈ సినిమాలో. థాంక్స్ శాంతి గారు.
ఇలాంటి ఒక బ్లాగ్ ఉందని ఇప్పుడే చూడటం! ఈపాట సుశీలగారు కూడా పాడారని ఇప్పుడే తెలుసుకున్నా. నేను విన్నది జిక్కి కృష్ణవేణి గారు పాడింది. అభినందనలు.
థాంక్స్ సుధామయి గారు. జిక్కి గారు పాడిన వర్షన్ కేవలం ఆడియోలో ఎల్పీ రికార్డ్స్ పై మాత్రమే ఉందటండీ. సినిమాలో సుశీల గారి వర్షన్ ఉపయోగించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.