మంగళవారం, నవంబర్ 25, 2014

తెల్లచీరకు తకధిమి...

లతామంగేష్కర్ గారు తెలుగులో పాడిన తొలిపాటట ఇది. తెలుగు నెలల పేర్లతో వేటురి గారు సరదాగా రాసిన లిరిక్స్ బాగుంటాయి. ఇళయరాజా గారి సంగీతం గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

సవరణ : ఈటీవీ వారి సౌందర్యలహరి ప్రోగ్రామ్ లో రాఘవేంద్రరావు గారు చెప్పిన మాట ఆధారంగా ఇదే లతగారి మొదటి పాట అని నేననుకున్నాను కానీ నిజానికి, 1955 లో వచ్చిన 'సంతానం' అనే సినిమాకోసం అనిసెట్టి-పినిశెట్టి రాసిన 'నిదురపోరా తమ్ముడా' అనే పాటని సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో పాడారుట లతా.. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగులో పాడిన పాట ఇది. అని బ్లాగ్ మిత్రులు నెమలికన్ను మురళి గారు మరియూ ఇతర మిత్రులు క్రింది కామెంట్స్ ద్వారా తెలియచేశారు. ఆ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆఖరి పోరాటం (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, లతా మంగేష్కర్

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో

సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో
అహ తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో


వైశాఖం తరుముతుంటే
నీ ఒళ్ళో ఒదుగుతున్నా

 ఆషాఢం ఉరుముతుంటే
నీ మెరుపే చిదుముకున్నా
కవ్వింతలో వాలి పువ్వంత కావాలి
పండించుకోవాలి ఈ బంధమే

నీతోడు కావాలి నే తోడుకోవాలి
నీ నీడలో ఉన్న శృంగారమే
జాబిల్లీ... సూరీడూ... ఆకాశంలో నిండిన సొగసుల

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో


కార్తీకం అహ్.. కలిసి వస్తే
నీ పరువం అడుగుతున్నా

హేమంతం కరుగుతుంటే
నీ అందం కడుగుతున్నా
ఆకాశ దేశాన ఆ మేఘరాగాలు
పలికాయి నా స్వప్నసంగీతమే

ఈ చైత్రమాసాల చిరునవ్వు దీపాలు
వెలిగాయి నీ కంట నాకోసమే
గిలిగింతే... గీతాలై... సింగారానికి సిగ్గులు కలిపిన

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో

అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో


5 comments:

http://www.youtube.com/watch?v=Lr2GnBjo6nM

​లతా మంగేష్కర్ గారు తెలుగులో పాడిన తొలిపాట 'నిదురపోరా తమ్ముడా...' "సంతానం"- అనే సినిమాలోనిది, అది 1955 లో వచ్చింది గమనించగలరు.​

http://www.youtube.com/watch?v=Lr2GnBjo6nM

వీడియో లింక్ తో సహా రిఫరెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అజ్ఞాత గారు. పోస్ట్ అప్డేట్ చేశాను.

తెల్లచీర + శ్రీదేవి + లతాజీ + ఇళైరాజాగారు + వేటూరి గారు + బాలు - నాగార్జున = ఓ అద్భుతం..

పాపం నాగార్జున ఏం అన్యాయం చేశాడు శాంతి గారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.