ఎ.ఆర్. రెహ్మాన్ సినీ సంగీత దర్శకుడు కాకముందు యాడ్స్ కు జింగిల్స్ కంపోజ్ చేసేవారని మీకు తెలిసినదే కదా అలా కంపోజ్ చేసిన ఒక జింగిల్ నే ఈపాట కోసం ఉపయోగించారు. ఆ అడ్వర్టయిజ్మెంట్ లో ఎంతో హుషారుగా చక్కని రిథమ్ తో సాగే మ్యూజిక్ బిట్ కు ఒక చక్కని మెలొడీని కలిపి పూర్తిపాటగా డెవలప్ చేసి ఈ సినిమాలో ఉపయోగించారు. ఈ పాటలోని సంగీతం ఎన్ని హొయలు పోతుందో చిత్రీకరణ కూడా అన్నే హొయలుపోతుంది. దర్శకుడు మణిరత్నం, సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరాం కలిసి లైటింగ్ తో చక్కని ప్రయోగాలు చేస్తూ ఆకట్టుకునేలా చిత్రీకరించారు. నాకు చాలా ఇష్టమైన ఈపాటను మీరూచూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : దొంగ దొంగ (1993)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : సుజాత, నోయల్ జేమ్స్
తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం
నా.. నా.. నవ్వులో.. ఈల వేసె పరువం
తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం
సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని
ఉరికే నా కులుకే.. కొంటె తలపులు పలికెనులే
నా పాల వన్నెలే.. కన్నెవలపులు చిలికెనులే
సందిళ్ళ అందాల వంపులలో.. పరువము పంచేనా
నాజూకు నా చూపు చురకలలో.. చుక్కలను చూపేనా
సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని
తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం
నా.. నా.. నవ్వులో.. ఈల వేసె పరువం
తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం
జతగా.. కలిసి.. జంట గువ్వలల్లె ఎగిరిపోదాం
గాలిలో.. తేలి.. నీలి గగనము ఏలుకుందాం
వినువీధి జాబిలితో ఆడుకుందాం.. వెన్నెలను పంచుకుందాం
స్వర్గాల తీరాలు చేరుకుందాం.. తనువులు మరిచిపోదాం
సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని
తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం
నా.. నా.. నవ్వులో.. ఈల వేసె పరువం
తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : సుజాత, నోయల్ జేమ్స్
తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం
నా.. నా.. నవ్వులో.. ఈల వేసె పరువం
తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం
సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని
ఉరికే నా కులుకే.. కొంటె తలపులు పలికెనులే
నా పాల వన్నెలే.. కన్నెవలపులు చిలికెనులే
సందిళ్ళ అందాల వంపులలో.. పరువము పంచేనా
నాజూకు నా చూపు చురకలలో.. చుక్కలను చూపేనా
సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని
తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం
నా.. నా.. నవ్వులో.. ఈల వేసె పరువం
తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం
జతగా.. కలిసి.. జంట గువ్వలల్లె ఎగిరిపోదాం
గాలిలో.. తేలి.. నీలి గగనము ఏలుకుందాం
వినువీధి జాబిలితో ఆడుకుందాం.. వెన్నెలను పంచుకుందాం
స్వర్గాల తీరాలు చేరుకుందాం.. తనువులు మరిచిపోదాం
సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని
తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం
నా.. నా.. నవ్వులో.. ఈల వేసె పరువం
తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం
2 comments:
క్లాసికల్ టచ్ తో వుండే వెస్టర్నైస్డ్ మెలోడీస్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి..ముఖ్యంగా ఈ పాటలో రిథం కి అనుగుణంగా మణిరత్నం క్రియేటివ్ కన్ను, శ్రీరాం కెమెరా కన్ను క్లిక్ చేసిన విధానం అద్భుతం..
థాంక్స్ శాంతి గారు.. అవునండీ దిస్ వన్ వజ్ ఎ నైస్ బ్లెండ్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.