గురువారం, నవంబర్ 20, 2014

దేవీ మౌనమా...

ప్రేమాభిషేకం సినిమాలో అలిగిన ప్రేయసిని ప్రసన్నం చేసుకునేందుకు హీరోగారు పడే పాట్లేమిటో పాడే పాటలేమిటో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం :  ప్రేమాభిషేకం (1981)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాసరి
గానం : బాలు, సుశీల

దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా
దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా
నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పై..
హా...దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా
దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా

మౌన భంగము.. మౌన భంగము
భరియించదు ఈ దేవి హృదయము
ప్రేమ పాఠము.. ప్రేమ పాఠము
వినకూడదు ఇది పూజా సమయము
 
దేవి హృదయము విశాలము..
భక్తునికది కైలాసము
హే దేవి హృదయము విశాలము..
భక్తునికది కైలాసము
కోరిక కోరుట భక్తుని వంతు...
అడగక తీర్చుట దేవత వంతు
ధూపం వేయుట భక్తుని వంతు...
పాపం మోయుట దేవుని వంతు
పాపానికి మోక్షం ధూప దర్శనం...
ఈ ప్రాణికి మోక్షం నామ స్మరణం.. నీ నామ స్మరణం
దేవీ... దేవీ... దేవీ... దేవీ...

దేవీ కోపమా...  శ్రీదేవీ కోపమా
దేవీ కోపమా.... శ్రీదేవీ కోపమా
నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పై..
హా...దేవీ కోపమా ... శ్రీదేవీ కోపమా

స్వామి విరహము అహోరాత్రము
చూడలేదు నీ దేవి హృదయము
దేవీ స్తోత్రము... నిత్య కృత్యము
సాగనివ్వదు.. మౌన వ్రతము
స్వామి హృదయము ఆకాశము...
దేవికి మాత్రమే అవకాశము..హహహా..
స్వామి హృదయము ఆకాశము...
దేవికి మాత్రమే అవకాశము
అర్చన చేయుట దాసుని వంతు...
అనుగ్రహించుట దేవత వంతు
కోపం తాపం ఆజన్మ హక్కు...
పుష్పం పత్రం అర్పించి మొక్కు
నా హృదయం ఒక పూజా పుష్పం...
నా అనురాగం ఒక ప్రేమ పత్రం.. నా ప్రేమ పత్రం
దేవీ .... దేవీ....  దేవీ.... దేవీ

దేవి మౌనమా... శ్రీదేవి మౌనమా
దేవి మౌనమా...  శ్రీదేవి మౌనమా
నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పై..
హా..దేవి మౌనమా... శ్రీదేవి మౌనమా
దేవి మౌనమా... శ్రీదేవి మౌనమా


2 comments:

అప్పట్లో ఈ పాట యెంతమది శ్రీదేవిలకి క్రేజ్ తెచ్చి పెట్టిందో...

అవును నిజమే శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.