శుక్రవారం, నవంబర్ 28, 2014

ఇది ఆమని సాగే...

జేగంటలు సినిమాలోని ఒక హుషారైన పాట ఈరోజు తలచుకుందాం... రచన వేటూరి సుందరరామ్మూర్తి గారు, సంగీతం కె.వి.మహదేవన్. ఇది కూడా ఒకప్పుడు నేను రేడియోలో రెగ్యులర్ గా విన్నపాట. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : జేగంటలు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం: బాలు, సుశీల

ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం
ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం
మనోవేగమున మరోలోకమున
పరుగులు తీసే మనోరథం 

ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం
ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం
మనోవేగమున మరోలోకమున
పరుగులు తీసే మనోరథం
ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం

పంచప్రాణాల వేణువూది కోయిల పాడాలి.. 
ప్రణయాన పంచమస్వరమాలపించాలి
పంచప్రాణాల వేణువూది కోయిల పాడాలి.. 
ప్రణయాన పంచమస్వరమాలపించాలి
కృష్ణ వేణమ్మ యమునల్లె దారి చూపాలి.. 
నా కృష్ణుడున్న తీరాలు చేరుకోవాలి
కృష్ణ వేణమ్మ యమునల్లె దారి చూపాలి.. 
నా కృష్ణుడున్న తీరాలు చేరుకోవాలి
నీరెండ పూలుపెట్టి 
నీలాల కోక చుట్టీ 
నువ్వొస్తే బృందావనాలు నవ్వాలి

ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం
ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం
మనోవేగమున మరోలోకమున 
పరుగులు తీసే మనోరథం
ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం

అల నెలవంక పల్లకీలో సాగిపోవాలి
మనవంక తారలింక తేరిచూడాలి 
అల నెలవంక పల్లకీలో సాగిపోవాలి
మనవంక తారలింక తేరిచూడాలి
కొసమెరుపుల్ల ముత్యాల హారమేయాలీ 
నా వలపల్లే నిను నేను అల్లుకోవాలి
కొసమెరుపుల్ల ముత్యాల హారమేయాలీ 
నా వలపల్లే నిను నేను అల్లుకోవాలి
నా గుండె ఝల్లుమంటే 
గుడిగంట ఘల్లు మంటే
కౌగిళ్ళలో ఇళ్ళు కట్టుకోవాలి.. 

ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం
ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం
మనోవేగమున మరోలోకమున 
పరుగులు తీసే మనోరథం
ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం


2 comments:

మనసైన అబ్బాయితో ధైర్యం గా జీవితం గడపాలనుకునే అమ్మాయిలకి ఈ పాటో గొప్ప ఇన్స్ పిరేషనండీ..

హహహ బాగా చెప్పారండీ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.