సోమవారం, నవంబర్ 24, 2014

వెన్నెలా.. వెన్నెలా.. మెల్లగా రావే..

ప్రేమదేశం సినిమాలోని ఒక అందమైన పాటతో ఈ వారాన్ని ప్రారంభిద్దామా.. కమ్మనైన జోలపాట ఇంతకన్నా బాగా ఎవరూ చేయలేరేమో అనిపించేలా కంపోజ్ చేశారు రెహ్మాన్. భువనచంద్ర గారి లిరిక్స్ కూడా సన్నివేశానికి తగినట్లుంటాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమదేశం (1996)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం : భువనచంద్ర 
గానం : మనో, ఉన్నికృష్ణన్, డామ్నిక్

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
కడలి ఒడిలో నదులు ఒదిగి.. నిదురపోయే వేళా..
కనుల పైన కలలే వాలి.. సోలిపోయే వేళా..
 
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే.. 
పూవుల తేనెలే తేవే..

ఆశ ఎన్నడు విడువదా..
అడగరాదని తెలియదా..
నా ప్రాణం..చెలియా నీవేలే..
విరగబూసిన వెన్నెలా..
వదిలి వేయకే నన్నిలా..
రారాదా..ఎద నీదే కాదా..
నిదురనిచ్చే జాబిలీ..
నిదురలేక.. నీవే వాడినావా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే.. 
పూవుల తేనెలే తేవే..

మంచు తెరలో అలిసిపోయి..
మధన సంధ్య తూగెనే..
పుడమి ఒడిలో కలలుకంటూ..
పాపా నీవూ నిదురపో..
మల్లె అందం మగువకెరుక..
మనసు బాధ తెలియదా..
గుండె నిండా ఊసులే..
నీ ఎదుటనుంటే మౌనమే..
జోలపాటా పాడినా..
నే నిదురలేక వాడినా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే.. 
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే.. 
పూవుల తేనెలే తేవే..



2 comments:

ఇలా జోల పాటలు పాడే ప్రియుడుంటే యే అమ్మాయైనా ఇట్టే ప్రేమలో పడిపోతుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.