ఆదివారం, నవంబర్ 30, 2014

ఏనాడైనా అనుకున్నానా...

అందమైన మెలోడీస్ కి కేరాఫ్ అడ్రస్ ఎస్.ఎ.రాజ్కుమార్. తన స్వరసారధ్యంలో సిరివెన్నెల గారు రచించిన ఒక అందమైన పాటను ఈరోజు తలచుకుందాం. ముగ్ధ సౌందర్యానికి భాష్యం చెప్పే సౌందర్య, హ్యాండ్సమ్ హీరో నాగార్జునలపై చిత్రీకరించడం ఈపాట అందాన్ని మరింత పెంచింది. హరిహరన్ చిత్రల గాత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఎదురు లేని మనిషి (2001) 
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : హరిహరన్, చిత్ర

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా..
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా..
మనసుని మరి మరి అడగనా 
నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా 
నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా..

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా..
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా..

నిసపా గమరి నిసపా

శిలలైనా చిగురించే చినుకంటి శ్రీమతీ
తొలిసారీ తెలిసిందే చెలిమి సంగతీ 
గగనాలే శిరసొంచే సుగుణాల పెన్నిధీ 
వరమల్లే దొరికావే మంచి పెనిమిటీ 
ఓ ప్రతి అణువు తెగబరువై నిన్ను వేడుకున్నదీ 
జతపడుతూ సగమైతే ఎంత వేడుకన్నదీ 
ఇన్నాళ్ళు ఇంతటి భారం అనిపించలేదుగా 
నన్నేలు బంగరు ద్వారం కనిపించలేదుగా 

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా..
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా..

హృదయాంతరంగ శృంగారగంగ ప్రవహించె 
ప్రణయ పరవశంగా 
మృధుశృంగ ధార మధురామృతాలే జతిమధన 
మధుర మిధునమంతా

వెలుగంటే పడదంటూ కసిరే కసిరేయిలో 
తొలిపొద్దై వెలిగావే ప్రేమబంధమా 
వలపంటే విషమంటూ ఉలికిపడే గుండెలో 
అమృతమై కురిశావే ప్రణయమధురిమా 
ఓఓ..మెలకువనే కల అంటూ మూసుకున్న కళ్ళకీ 
ఒంటరిగా పయనిస్తూ దారి తప్పు కాళ్ళకీ 
సూర్యోదయం చూపావే నూరేళ్ళ కుంకుమా 
నా తీరమై నిలిచావే నా ఇంటి దీపమా 

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా..
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా..
మనసుని మరి మరి అడగనా 
నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా 
నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా..



2 comments:

యేదో ఒక రాగం..ఐ మీన్ ఒకే పాటని తీసుకుని సినిమా ఐపోయే లోపు ఓ ఇరవై సార్లు వాడి బుర్రలోకి ఎక్కించెయ్యడం రాజ్ కుమార్ గారి స్పెషాలిటీ అనిపిస్తుంది..

అవునండీ తన సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఉంటుంది. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.