సోమవారం, డిసెంబర్ 01, 2014

నీ నీలి నయనాల...

మానసవీణ చిత్రం కోసం ఎమ్మెస్ విశ్వనాధం గారు స్వరపరచిన ఒక చక్కని పాట ఈరోజు మీ కోసం. ఈ సినిమా కానీ పాట వీడియో కానీ నాకు లభించలేదు. మంచి క్లాసికల్ టచ్ తో సాగే ఈ పాట వినడానికి చాలాబాగుంటుంది. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మానస వీణ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల

నీ నీలి నయనాల.. రవళించు రాగాల.. 
జడిలోన నే పాడనా..
ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ...
నీ నీలి నయనాల రవళించు రాగాల 
జడిలోన నే పాడనా
నీ మధుర హృదయాన నినదించు నాదాల 
జతిలోన నేనాడనా
ఆ...ఆ.. ఆ.. ఆ
నీ నీలి నయనాల రవళించు రాగాల 
జడిలోన నే పాడనా
ఆ...ఆ.. ఆ.. ఆ.. ఆ..
నీ మధుర హృదయాన నినదించు నాదాల 
జతిలోన నేనాడనా
తక తధీంతోం తక తధీంతోం సస సగస్సానిని
తక తధీంతోం తక తధీంతోం సస సగస్సాసస

శిలల కరిగించు కళలు చిగురించు 
నీ రూపు నే తీర్చనా
తలపులూహించు వలపులూరించు 
అందాలు నే చూడనా
మనసు వికసించు మమత వరియించు 
నీ చెలిమి నే కోరనా
మనల మరిపించు ఒకటే అనిపించు 
అద్వైతమే నేను కానా
ఆనంద సౌధాన అందాల జాబిల్లిగా 
నిన్ను వెలిగించనా
అనురాగ శిల్పాన అతిలోక కల్పనగా 
నిను నేను ఊహించనా
 
నీ నీలి నయనాల రవళించు రాగాల 
జడిలోన నే పాడనా
నీ మధుర హృదయాన నినదించు నాదాల 
జతిలోన నేనాడనా
 
వెలుగులను నించు సిరుల కురిపించు 
నీ నవ్వులై నవ్వనా
వయసు మురిపించు బ్రతుకే ఫలియించు 
నీ ప్రేమలో పండనా
అడుగు జత చేర్చి నడక కలబోసి 
నీ నీడనై నడవనా
ఎడద పరిచేసి గుడిగా మలిచేసి 
నీరాజనాలివ్వనా
నా జన్మజన్మాల నా పూర్వ పుణ్యాల 
నా దేవిగా నిన్ను భావించనా
ఈ నొసటి కుంకుమ.. ఈ పసుపు సంపద.. 
నీ వరముగా పొంది వర్ధిల్లనా
 
నీ నీలి నయనాల రవళించు రాగాల 
జడిలోన నే పాడనా
ఆ...ఆ..ఆ..ఆ..
నీ మధుర హృదయాన నినదించు నాదాల 
జతిలోన నేనాడనా
తక తధీంతోం తక తధీంతోం సస సగస్సానిని
తక తధీంతోం తక తధీంతోం సస సగస్సాసస

4 comments:

కళ్ళు..యెప్పటికీ ఇంకిపోని ఉప్పునీటి పరవళ్ళు..చెక్కిళ్ళకి అందమిచ్చే సోయగాల పొదరిళ్ళు..యెన్నటికీ తడి ఆరని అలల కల వాకిళ్ళు..

చాలా బాగా చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.