శనివారం, డిసెంబర్ 27, 2014

వేణుగాన సమ్మోహనం...

విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వరాభిషేకం సినిమా కోసం విద్యాసాగర్ గారు స్వరపరచిన ఒక కమ్మని కన్నయ్య పాటను ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : స్వరాభిషేకం(2004)
సంగీతం : విద్యా సాగర్
రచన : వేటూరి
గాత్రం : రాధిక, శంకర్ మహదేవన్, కోరస్

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం

వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం ఓ.. వేనోళ్ళ నీ కీర్తనం
ఆషాడ మేఘాలొచ్చి ఆనందాల జల్లే కురిసె
ఆలారే......
వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం వేనోళ్ళ నీ కీర్తనం

పాల చెక్కి నెతినెత్తి అమ్మబోతె కిట్టయ్య
యేలు పెట్టి ఎంగిలి చేతడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో
మాటు చూసి మడుగులోన మునగబోతె కిట్టయ్య
సీరలు గుంజి చక్కా పోతడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో
యేరే కోక నీరే రైక అంటాడమ్మో
అట్టాగని అంటాముట్టనట్టు ఉందామంటే

మురిపాలు పొంగిస్తే పాలెందుకంటాడు ఓలమ్మో
పాలెందుకంటాడు ఓలమ్మో
హే..సిగ్గొచ్చి చుట్టేసి చీరెందుకంటాడు ఓలమ్మో
ఓలమ్మో..
బుటుకు బుటుకు బుగ్గ గిల్లిపోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు
బుటుకు బుటుకు బుగ్గ గిల్లిపోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు
వయసు పట్టి లాగినట్టు మనసు గిచ్చి పోయినట్టు

ఆలారె ఆలారె ఆనందబాల
అందాల కిట్టయ్యకు తందాన హేల
ఆలారె ఆలారె ఆనందబాల
అందాల కిట్టయ్యకు తందాన హేల
ఆలారే........

వేణుగాన సమ్మోహనం..వేణుగాన సమ్మోహనం
వేలి మీద గోవర్ధనం..వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం..రేపల్లె మానందనం
వేనోళ్ళ నీ కీర్తనం..వేనోళ్ళ నీ కీర్తనం

కృష్ణా!....ముకుందా!.....మురారీ!......

నంద యశోదా, నందనులకు 
నవ మదనదేవునకు గొబ్బిళ్ళు
చందన చర్చిత నీలదేహ గగనాల సొగసుకు గొబ్బిళ్ళు
ఉసురు గాలులను వెదురు పాటలుగ
ఆ...........
ఉసురు గాలులను వెదురు పాటలుగ
పలుకు వేణువుకు గొబ్బిళ్ళు..

ఏటి మీద ఎన్నెల్లో ఎన్నెలంటి కన్నెల్లో
కన్నెగంటి సన్నల్లో సన్నజాజి గిన్నెల్లో
వేదనంతా వెన్నలాగా కరిగే వేళళ్ళో
వేదనంతా వెన్నలాగా కరిగే వేళళ్ళో

ఏ గీత మాకిస్తావో ఎవ్వరి గీత మారుస్తావో ఆరారే...

వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం వేనోళ్ళ నీ కీర్తనం

ఆలారే మేఘాలొచ్చి ఆనందాలే జల్లై కురిసే
ఆలారే........


1 comments:

వర్షపు జల్లుల్లో అంత వేగం గా నర్తించడం చాలా కష్టం..ముఖ్యం గా శ్రీధర్ గారి మూమెంట్స్..వర్షం లో అభినవ బృదావనాన్ని చూపించారు మన విశ్వనాధ్ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.