చిత్రసీమకు అద్భుతమైన నటులను పరిచయం చేసినా, కథను నమ్మి సినిమా తీయాలన్నా, శక్తివంతమైన పాత్రలతో స్త్రీమూర్తి లోని విశ్వరూపాన్ని దర్శింప జేయాలన్నా, సముద్రాన్ని జీవితంలో ఎమోషన్స్ తో కలిపి అత్యంత అందంగా చూపించాలన్నా, మధ్య తరగతి భావోద్వేగాలను హృద్యంగా తెరకెక్కించాలన్నా అది కె.బాలచందర్ గారికే సాధ్యం. మరపు రాని చిత్రాల రూపంలో ఇలలో చిరస్థాయిగా నిలిచి ఉండే ఓ మహాత్మా.. ఓ మహార్షీ.. మీకిదే మా నివాళి...
చిత్రం : ఆకలి రాజ్యం (1981)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : బాలు
ఓ మహాత్మా.. ఓ మహర్షి..
ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవితమేది మృత్యువు
ఏది పుణ్యం ఏది పాపం
ఏది నరకం ఏది నాకం
ఏది సత్యం ఏదసత్యం
ఏదనిత్యం ఏది నిత్యం
ఏది ఏకం ఏదనేకం
ఏది కారణమేది కార్యం
ఓ మహాత్మా.... ఓ మహర్షి
ఏది తెలుపు ఏది నలుపు
ఏది గానం ఏది మౌనం
ఏది నాది ఏది నీది
ఏది నీతి ఏది నేతి
నిన్న స్వప్నం నేటి సత్యం
నేటి ఖేదం రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి
ఓ మహర్షీ.... ఓ మహాత్మా...
ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవితమేది మృత్యువు
ఏది పుణ్యం ఏది పాపం
ఏది నరకం ఏది నాకం
ఏది సత్యం ఏదసత్యం
ఏదనిత్యం ఏది నిత్యం
ఏది ఏకం ఏదనేకం
ఏది కారణమేది కార్యం
ఓ మహాత్మా.... ఓ మహర్షి
ఏది తెలుపు ఏది నలుపు
ఏది గానం ఏది మౌనం
ఏది నాది ఏది నీది
ఏది నీతి ఏది నేతి
నిన్న స్వప్నం నేటి సత్యం
నేటి ఖేదం రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి
ఓ మహర్షీ.... ఓ మహాత్మా...
9 July 1930 – 23 December 2014 |
5 comments:
స్త్రీ లో--కోపం, కోరిక, కష్టం, కన్నీరు, కలవరం, కుతూహలం, కాఠిన్యం, కరుణ, కినుక, క్షమ, కవ్వింత, కౌగిలింత..అన్నీ కలిపి కాప్చర్ చెసిన కదిలే బొమ్మల విధాత కే.బాలచందర్ గారు..నావంటి వారికి ఆయన చిత్రించిన ప్రతి దృశ్యం ఒక ఆశ-అదిప్పుడు వాడిపోయింది..ఓ శ్వాస-మరి ఆగి పొయింది..ఓ అశ్వాసన అంతర్ధానమై పోయింది..ఓ ఆసరా నన్ను వదిలి వెళ్ళి పోయింది..ఇంకా యేదో చెప్పాలని ఉంది..ఆయన నా జీవితం లో ప్రతి అణువునీ యెంత ప్రభావితం చేశారో చెప్పు కోవాలని ఉంది..కానీ కళ్ళు సహకరించట్లేదు..కను రెప్పలు మాట వినట్లేదు..ఈ మాత్రమైన పంచుకోగల అవకాశాన్ని కల్పించినందుకు మీకు ధన్య వాదాలు వేణూ గారూ..ఆ మేఘం కదిలి వెళ్లిపోయినా, మా గుండెల్లో యెప్పుడూ వర్షిస్తూనే వుంటుంది..
శాంతి గారు మీరు బాలచందర్ గురించి ఆయన సినేమాలంత గొప్పగా రాశారు.
< ఓ మహాత్మా.. ఓ మహర్షి.. ఏది జీవితమేది మృత్యువు > బాలచందర్ కు మీ నివాళి బాగుంది వేణు గారు.
థాంక్స్ శాంతి గారు... చాలా బాగా రాశారు. ముఖ్యంగా తను సృష్టించిన స్త్రీ పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే.
థాంక్స్ శ్రీరామ్ గారు.
థాంక్స్ కొండలరావు గారు.
థాంక్యూ శ్రీరామ్ గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.