ఆదివారం, డిసెంబర్ 28, 2014

లీలా కృష్ణా నీ లీలలు...

మహామంత్రి తిమ్మరసు చిత్రం కోసం పెండ్యాల గారి స్వర సారధ్యంలో ఎస్.వరలక్ష్మి గారు గానం చేసిన పింగళి గారి రచన ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం : ఎస్. వరలక్ష్మి

లీలా కృష్ణా నీ లీలలు 
నే లీలగనైనా తెలియనుగా...
తెలిసి తెలియని బేలల కడ 
నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ

లీలా కృష్ణా నీ లీలలు 
నే లీలగనైనా తెలియనుగా

వేణు గానమున తేరగ పిలిచి ..
మౌనము పూనగ ఏలనో
వేణు గానమున తేరగ పిలిచి ..
మౌనము పూనగ ఏలనో
అలకయేమో యని దరి రాకుండిన 
జాలిగ చూచే వేలనో...

లీలా కృష్ణా నీ లీలలు 
నే లీలగనైనా తెలియనుగా

నీ చిరునవ్వుల వెన్నెలలో 
మైమరువగ చేయగ ఏలనో
నీ చిరునవ్వుల వెన్నెలలో 
మైమరువగ చేయగ ఏలనో
మైమరచిన చెలి మాటే లేదని..
ఆ ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..
మైమరచిన చెలి మాటే లేదని.. 
ఓరగ చూచే వేలనో...

లీలా కృష్ణా నీ లీలలు 
నే లీలగనైనా తెలియనుగా
తెలిసీ తెలియని బేలల కడ 
నీ జాలములేవి చెల్లవుగా..
లీలా కృష్ణా నీ లీలలు 
నే లీలగనైనా తెలియను గా...

1 comments:

వరలక్షిగారి గొంతులో శృంగారం కన్నా భక్తి రసం, పెంకెతనం (బాలరాజు), పాలే యెక్కువనిపిస్తుంది నాకు..అందుకే ఈ పాట నవరసాలూ కలబోసి నట్టు ఉంటుంది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.