శుక్రవారం, డిసెంబర్ 26, 2014

జయ కృష్ణా ముకుందా మురారి...

ఈ పాట పొయిన సంవత్సరం ధనుర్మాసపు పాటలలో ఎలా మిస్ అయిందో గుర్తులేదు.. ఇది తెలియని తెలుగువారుండరేమో కదా.. ఇపుడు కొత్తగా పరిచయం చేసే దుస్సాహసం నేను చేయబోవట్లేదు. ఈ అందమైన పాటను మరో మారు వినీ చూసీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీ పాండురంగ మహత్యం (1957)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల

హే... కృష్ణా.... ముకుందా.... మురారీ....
జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి

 
దేవకి పంట... వసుదేవువెంట....
దేవకి పంట... వసుదేవువెంటా...
యమునను నడిరేయి దాటితివంటా.. ఆ..ఆ
వెలసితివంటా... నందుని ఇంటా
వెలసితివంటా... నందుని ఇంటా
వ్రేపల్లె ఇల్లాయేనంటా...ఆ..

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ..
కృష్ణా... ముకుందా... మురారి

 
నీ పలుగాకి పనులకు గోపెమ్మ...
నీ పలుగాకి పనులకు గోపెమ్మ...
కోపించి నిను రోట బంధించెనంటా..ఆ..ఆ..
ఊపునబోయీ మాకులకూలిచి....
ఊపునబోయీ మాకులకూలిచి...
శాపాలు బాపితివంటా....ఆ...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి

 
అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ...
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా.. అని చెవి నులిమి యశోద..
ఏదన్నా నీ నోరు చూపుమనగా...ఆ...
చూపితివట నీ నోటను...
బాపురే పదునాల్గు భువనభాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు...
తాపము నశియించి.. జన్మ ధన్యత గాంచెన్..

జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ...
కృష్ణా... ముకుందా... మురారి

 
కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ...
కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ...
కేళీ ఘటించిన గోపకిశోరా..ఆ..ఆ
కంసాదిదానవ గర్వాపహారా...
కంసాదిదానవ గర్వాపహారా...
హింసా విదూరా.. పాపవిదారా...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ..
కృష్ణా... ముకుందా... మురారి

 
కస్తూరి తిలకం... లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం... నాసాగ్రే నవమౌక్తికమ్
కరతలే వేణుమ్... కరే కంకణమ్
సర్వాంగే హరిచందనంచ కలయమ్
కంఠేచ ముక్తావళీమ్.. గోపస్త్రీ పరివేష్టితో...
విజయతే... గోపాల చూడామణీ...
విజయతే... గోపాల చూడామణీ...

లలిత లలిత మురళీ స్వరాళీ...
లలిత లలిత మురళీ స్వరాళీ...
పులకిత వనపాళి... గోపాళీ..
పులకిత వనపాళి...ఈ...
విరళీకృత నవ రాసకేళి...
విరళీకృత నవ రాసకేళి...
వనమాలీ శిఖిపింఛమౌళీ
వనమాలీ శిఖిపింఛమౌళీ....

కృష్ణా... ముకుందా... మురారి...
జయ గోవింద.. బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి...
జయ గోవింద.. బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి..
జయ కృష్ణా... ముకుందా... మురారి..
హే... కృష్ణా.... ముకుందా.... మురారీ.... ఈ.. ఈ..

1 comments:

ఇదీ, రారా కృష్ణయా..యెప్పుడు విన్నా..కనులు మాట వినవు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.