కమర్షియల్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రాఘవేంద్రరావు గారు తీసిన ఒక చక్కని చిత్రం జ్యోతి లోని ఈ పాట చాలా బాగుంటుంది. సగంపాట నవ్వుతోనే లాగించేసినా జానకి గారు ఈ పాటతో మన మనసుపై వేసే ముద్ర మామూలుది కాదు. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరు కూడా ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : జ్యోతి (1976)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, జానకి
సిరిమల్లె పువ్వల్లె నవ్వు
హ్హ...హ్హ..హ్హ
సిరిమల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లే నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు
చిగురిస్తు ఉండాలి నా నువ్వు.. నా నువ్వు..
హ్హ...హ్హ..హ్హ..హ్హ..హ్హ..
సిరిమల్లె పువ్వల్లె నవ్వు...
చిన్నారి పాపల్లె నవ్వూ..నవ్వూ
ప ని స ...హ్హ..హ్హ...హ్హ..
స గ మ ...హ్హ...హ్హ...హ్హ...
గ మ ప ...ఆ...హ్హ...హ్హ..
ని ని ప మ గ గ మ ప
హ్హ ..హ్హ..హ్హ..హ్హ...ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా...
సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా...
సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిననాటి కలలల్లె తియతియ్యగా...
ఎన్నెన్నో రాగాలు రవళించగా..రవళించగా
ఉహూ..హ్హ..హ్హ..హ్హ..
సిరిమల్లె పువ్వల్లె నవ్వు...
చిన్నారి పాపల్లె నవ్వూ... నవ్వూ
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా...
ఆ వెలుగులో నేను పయనించగా
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా...
ఆ వెలుగులో నేను పయనించగా
ఆ....ఆ...ఆ...ఆ...
వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
ఆ....వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా..తొలి నవ్వుగా
సిరి మల్లె పువ్వల్లె నవ్వు...
చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు...
చిగురిస్తు ఉండాలి నా నువ్వు... నా నువ్వు
హ్హ...హ్హ...హ్హ...హ్హ...హ్హ..
సిరిమల్లె పువ్వల్లె నవ్వు.. హ్హ..హ్హ..హ్హా..
చిన్నారి పాపల్లె నవ్వూ.. హ్హ..హ్హ...హ్హ..
2 comments:
మేము కాలేజీ లో చదువుకునే రోజుల్లో..మ్యూజిక్ కాంపిటీషన్స్ లో ఏక చిత్ర గానమని ఉండేది..ఒకే పాట అందరూ పాడలన్న మాట..ఓసారి ఈ పాట ఇచ్చారండీ..పాట కంటే అందులో వున్న నవ్వులను ఇమిటేట్ చెయ్యడానికి ఒక్కక్కరూ ట్రై చేస్తుంటే..ఇప్పటికీ ఆ దృశ్యం గుర్తొస్తే నవ్వుకుంటూనే ఉంటాము..నవ్వుల జ్ఞాపకాన్ని గుర్తు చేసినందుకు థాంక్యూ..
హహహ బాగుందండీ :) మీ జ్జాపకాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.