శుక్రవారం, డిసెంబర్ 19, 2014

నగుమోము చూపించవా గోపాలా...

సాలూరి వారి స్వర సారధ్యంలో సుశీలమ్మ గానం చేసిన ఓ చక్కని పాటను నేడు తలచుకుందాం... ఈ గోపికమ్మకు గోపాలుడు తన నగుమోమును చూపించటం లేదట ఎందుకలా ఉడికిస్తున్నావంటూ ఎలా నిలదీస్తోందో చూడండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అమరశిల్పి జక్కన (1964)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : సుశీల

నగుమోము చూపించవా గోపాలా
నగుమోము చూపించవా గోపాలా
మగువల మనసుల ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ

ఎదుట… ఎదుట వెన్నెల పంట.. ఎదలో తీయని మంట...
ఎదుట వెన్నెల పంట.. ఎదలో తీయని మంట ...
ఎదుట వెన్నెల పంట... ఎదలో తీయని మంట...
ఇక సైపలేను నీవే నా... ముద్దుల జంట
 
నగుమోము చూపించవా గోపాలా…

వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ...
వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ...
మగనాలిపై ఇంత బిగువూ చూపెదవేల..

నగుమోము చూపించవా గోపాలా...
 
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య...
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య...
నెలవంకలిడి నన్ను అలరించవేమయ్య...

నగుమోము చూపించవా గోపాలా…
 
నగుమోము చూపించవా గోపాలా
మగువల మనసుల ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ


1 comments:

రాముడిలాంటి భర్త కావాలని కోరుకునే ప్రతి అమ్మాయీ ప్రియుని లో మాత్రం అల్లరి కృష్ణుడినే చూసుకుంటుందెందుకో..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.