ఆత్రేయ గారి చక్కని సాహిత్యం సత్యం గారి కమ్మనైన బాణిలో ఒదిగిపోతే ఇలా ఆహ్లాదకరమైన పాటగా మారుతుంది. ఆలూమగల అనురాగాన్ని ఎంత చక్కని మాటల్లో చెప్పారో మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : అమర దీపం (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల
ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?..
ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?
అనురాగాని కనువైన శృతి కలిపినాము
ఆఁహాఁ.. ఊఁహూఁ..
ఆఁహాఁ.. ఉఁహూఁ
ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?
ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?
మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?..
ఎదలో మెదిలే.. సంగతులన్నీ..
పలికెను సంగీతమై.. పలికెను సంగీతమై..
కలిసిన కన్నుల.. మెరిసేకలలే..
వెలిసెను గమకములై... వెలిసెను గమకములై..
హొయలైన నడకలే లయలైనవి..
చతురాడు నవ్వులే గతులైనవి..
సరిసరి అనగానే.. మరిమరి కొసరాడు
మురిపాలె మన జంట స్వరమైనది..
ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?
మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో?...ఇది ఏ తాళమో?..
విరికన్నె తనకు.. పరువమే కాదు..
పరువూ కలదన్నది... పరువూ కలదన్నది..
భ్రమరము తనకు అనుభవమే కాదు..
అనుబంధముందన్నది... అనుబంధముందన్నది..
కోకిలమ్మ గుండెకు గొంతున్నది..
కొమ్మలో దానికి గూడున్నది..
సరి మగవానికి సగమని తలపోయు
మన జంటకేజంట సరి ఉన్నది..
ఏ రాగమో.. ఇది ఏ తాళమో
అనురాగాని కనువైన శృతి కలిపినాము
ఏ రాగమో.. ఇది ఏ తాళమో..
2 comments:
శృగారాన్ని ఇంత సున్నితంగా వర్ణించడం వేటూరిగారికే చెల్లు..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.