మంగళవారం, డిసెంబర్ 23, 2014

గోరువంక వాలగానే గోపురానికి...

గాండీవం సినిమా కోసం కీరవాణి గారి స్వరసారధ్యంలో వేటూరి గారు రచించిన ఈ చక్కని పాట నాకు చాలా ఇష్టం. టీవీ లో ఎప్పుడు వేసినా అక్కినేని, మోహన్ లాల్ ల కోసం ఈ పాట మిస్ అవకుండా చూసేవాడ్ని. వేటూరి గారి అందమైన తెలుగు పదాలను ఒక పక్క బాలు చక్కగా పాడుతుంటే శ్రీకుమార్ కాస్త వైవిధ్యంగా పలికారు. కానీ ఆ మళయాళీ యాస ఒక పరిమళాన్ని అద్దడంతో పాట అందంగా ఉండటమే కాక మోహన్ లాల్ గారికి సరిగ్గా సరిపోయింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గాండీవం(1994)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, శ్రీకుమార్, చిత్ర

గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
బాలకృష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా.. 
వారసుడ్ని చూసినప్పుడే
వరాల వాంఛలన్ని పల్లవించగా..
నందుడింట చిందులేసే
అందమైన బాలుడే తనవాడై..

గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..

 
ఏటి మనుగడ కోటి అలలుగ
పొంగు వరదల వేగానా..
పడిలేచు అలలకు తీపి కలలకు
లేని అలసట నీకేలా..
నల్ల నల్ల నీళ్ళల్లోనా ఎల్లకిలా పడ్డట్టున్న
అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో..
అమ్మాయంటి జాబిల్లమ్మ
అబ్బాయంటి సూరీడమ్మా
ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో..
ఎవరికివారే.ఏఏ...
యమునకు నీరే.ఏఏఏ...
రేవు నీరు నావదంట
నావ తోడు రేవుదంట పంచుకుంటే..

గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..

ప్రేమ ఋతువులు పూలు తొడిగిన
తేనె మనసుల నీడల్లో..
మురిపాల నురగలు పంటకెదిగిన
బాల సొగసుల బాటల్లో..
ముగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే..
బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో..
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే..
గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో..
పరవశమేదో...ఓఓ.. 
పరిమళమాయే.ఓఓ.
పువ్వు నవ్వే దివ్వె నవ్వే..
జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే..

గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
 
బాలకృష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా..
వారసుడ్ని చూసినప్పుడే
వరాల వాంఛలన్ని పల్లవించగా..
నందుడింట చిందులేసే
అందమైన బాలుడే తనవాడై..
1 comments:

చిలిపితనం హుషారు కలగలిసి ఉండే అక్కినేని అడుగులు ఓ తమాషా అందమీ పాటకి..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.