బుధవారం, డిసెంబర్ 31, 2014

ఎందుకీ సందెగాలి...

ఈ 2014 సంవత్సరాన్ని దేవులపల్లి వారి "నీలమోహనా రారా" పాటతో స్వాగతించాం... మరి వీడ్కోలు కూడా దేవులపల్లి వారి పాటతోనే చెబుదామా. అనుకోకుండా ఈపాట సెలక్ట్ చేస్తే దేవులపల్లి వారే కాక సుశీలమ్మా, మహదేవన్ గారు కూడా తోడు రావడం యాదృచ్ఛికంగా భలే కుదిరింది. "ఉండమ్మా బొట్టుపెడతా" చిత్రంలోని ఈ పాట వినడానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో చిత్రీకరణ కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి
గానం : సుశీల

ఎందుకీ సందెగాలి..
సందెగాలి తేలి మురళి
ఎందుకీ సందెగాలి..
సందెగాలి తేలి మురళి
తొందర తొందరలాయె..
విందులు విందులు చేసే

ఎందుకీ సందెగాలి..
సందెగాలి తేలి మురళి


ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము
ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము
పరుగు పరుగునా త్వర త్వరగా
ప్రభుని పాదముల వాలగా 
తొందర తొందరలాయె
విందులు విందులు చేసే..

ఎందుకీ సందెగాలి
సందెగాలి తేలి మురళి 

 
ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ
ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని
ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ
ఏమాయెనో గాని..
ఆ పిల్లన గ్రోవిని విని.. విని.. విని..
ఏదీ ఆ... యమునా
యమున హృదయమున గీతిక
ఏదీ బృందావన మిక.. ఏదీ విరహ గోపిక

ఎందుకీ సందెగాలి..
సందెగాలి తేలి మురళి
తొందర తొందరలాయె..
విందులు విందులు చేసే
ఎందుకీ సందెగాలి..
సందెగాలి తేలి మురళి


Friends, Have a Safe and Happy Time on New Year's Eve... 

 

1 comments:

ఇంత అందమైన కన్నయ్య పాటలతో కొత్త సంవత్సరం లోకి అడుగు పెట్టినందుకు అభినందనలు వేణూజీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.