మిస్టర్ పెళ్ళాం సినిమాకోసం కీరవాణి గారు స్వరపరిచిన ఒక చక్కని పాటను ఈరోజు తలచుకుందాం. సాహిత్యం సినిమాలోని సన్నివేశానికి ఆపాదిస్తూ కాస్త తమాషాగా కోలాటం స్టైల్లో హమ్ చేసుకునేట్లుగా బాగుంటుంది ఈపాట. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : మిస్టర్ పెళ్ళాం(1993)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, కోరస్
ఆ.. మాయదారి కృష్ణయ్యా ఎంతటివాడో ఓరయ్యో..
ఆ.. నాటకాల బూటకాల నీటుకాడు వాడూ ఓరయ్యో..
ఆడదాన్ని చూసి ఆగలేడు వాడు
జంట కోరి వెంటపడతాడూ
ఆశ రేపుతాడు ఊసులాడుతాడు
రాసక్రీడలాడు మంత్ర గాడు తంత్రగాడు
ఆ.. మాయదారి కృష్ణయ్యా ఎంతటివాడో ఓరయ్యో..
ఆ.. నాటకాల బూటకాల నీటుకాడు వాడూ ఓరయ్యో..
పొరిగింటి పాలూ.. హరిలోరంగహరి
ఇరుగింటి పెరుగు.. హరిలోరంగహరి
పొరిగింటి పాలూ ఇరుగింటి పెరుగు
మరిగినాడు వెన్నదొంగ
ఆ పాల కడలి.. హరిలోరంగహరి
యజమానుడైనా.. హరిలోరంగహరి
ఆ పాల కడలి యజమానుడైనా
పరుల పాడి కోరనేలా
ఎంత వారికైనా ఎదుటి సొమ్ము తీపి
ఏవి దేవుడండి అన్యులాస్థి మోజు జాస్తి..
ఆ.. మాయదారి కృష్ణయ్యా ఎంతటివాడో ఓరయ్యో..
ఆ.. నాటకాల బూటకాల నీటుకాడు వాడూ ఓరయ్యో..
పదహారువేల.. హరిలోరంగహరి
సతులున్నవాడూ.. హరిలోరంగహరి
పదహారువేల సతులున్నవాడూ
రాధనేల వీడడంటా
ఆ మేనయత్త.. హరిలోరంగహరి
తొలివలపు ఖాతా.. హరిలోరంగహరి
ఆ మేనయత్త తొలివలపు ఖాతా
మొదటి ప్రేమ మరువడంట
వాడి దివ్య లీల కావ్య గీత మాల
చెప్పినాను చాల పాడుకోండి భక్తులాల
ఆ.. మాయదారి కృష్ణయ్యా ఎంతటివాడో ఓరయ్యో..
ఆ.. నాటకాల బూటకాల నీటుకాడు వాడూ ఓరయ్యో..
గోపాల కృష్ణుడు.. పాక్షి..
గోవిందా కృష్ణుడు.. పాక్షి..
గోపాల కృష్ణుడు.. పాక్షి..
గోవిందా కృష్ణుడు.. పాక్షి..
గోపాల కృష్ణుడు.. పాక్షి..
గోవిందా కృష్ణుడు.. పాక్షి..
గోపాల కృష్ణుడు.. పాక్షి..
గోవిందా కృష్ణుడు.. పాక్షి..
గోపాలకృష్ణుడు పాక్షి వాహనుడై వెడలే..
తాం తరికిటతక తద్దింతక తకధిమి తా..
1 comments:
తరాలుగా గానం చేస్తున్నా కన్నయ్య లీలలు యెప్పుడూ కొత్తగానే ఉంటాయి..మనసుని హత్తుకుంటూనే ఉంటాయి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.