ఈ రోజు నుండీ ధనుర్మాసం ప్రారంభమైంది కదండీ మరి ఈ నెలరోజులూ తనివితీరా రోజు కొక్కటిగా ఆ కన్నయ్య పాటలను తలచుకుందామా. ముందుగా చాలా రోజుల తర్వాత సిరివెన్నెల గారు సింగిల్ కార్డ్ లిరిసిస్ట్ గా పని చేసిన చిత్రం "ముకుంద" లోని ఈ పాటను తలచుకుందాం. గోపికమ్మని నిద్దురలేపే సంధర్బం కూడా సరిగ్గా సరిపోయింది కదా. చిత్ర గారి స్వరంలో సిరివెన్నెల గారి సాహిత్యం దానిని డామినేట్ చేయకుండా లిరిక్స్ ని విననించే మిక్కీ జె. మేయర్ సంగీతం వెరసి ఒక ఆహ్లాద కరమైన అనుభూతిని మనసొంతం చేస్తుంది. ఎంబెడ్ చేసిన వీడియో క్లిప్పింగ్ మాత్రమే. పూర్తి ఆడియో ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు.
చిత్రం : ముకుంద (2014)
సంగీతం : మిక్కీ జె. మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర, కోరస్
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా
విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా
తలపును లేపాలిగా బాలా..
పరదాలే తీయకా పరుపే దిగనీయకా
పవళింపా ఇంతగా మేలా..
కడవల్లో కవ్వాలు సడిచేస్తున్నా వినకా
గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలక
కలికీ ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా
నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవనీ
నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి
నీకోసమనీ గగనమే భువిపైకి దిగివచ్చెననీ
ఆ రూపాన్నీ చూపుతో అల్లుకుపో సౌదామినీ
జంకేలా జాగేలా సంకోచాలా జవ్వనీ
బింకాలూ బిడియాలూ ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ..
అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా
ఆఆ..ఆఆఅ..ఆఆఆ.ఆఆఆఆఅ...ఆఆ.ఆఆఆఆఆ....
ఏడే అల్లరి వనమాలీ నను వీడే మనసున దయమానీ
నందకుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే
లీలాకృష్ణా కొలనిలో కమలములా కన్నెమది
తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నదీ
అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇదీ
అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నదీ
విన్నావా చిన్నారీ ఏమందో ప్రతిగోపికా
చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక
త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమారకా
వదిలావో వయ్యారీ బృందావిహారి దొరకడమ్మ
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా
2 comments:
ఓ..కన్నయ్యకి సంగీతాభిషేకమా..బాగు..బాగు..మీ బ్లాగు..
థాంక్స్ శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.