బుధవారం, డిసెంబర్ 03, 2014

ఏలా ఇంత దూరం...

జమదగ్ని సినిమా కోసం ఇళయరాజా గారి స్వరకల్పనతో వచ్చిన ఓ చక్కని పాటను ఈరోజు తలచుకుందామా.. ఈ పాట తాలూకూ వీడియో నాకు దొరకలేదు. రాజ్ సీతారాం తన కెరీర్ అంతా కృష్ణ గారికి మాత్రమే పాడినట్లున్నారు అతని స్వరం వినగానే నాకు కృష్ణ గారి స్టెప్పులే గుర్తొస్తుంటాయి. మంచి సంగీత సాహిత్యాల మేళవింపైన ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.   


చిత్రం : జమదగ్ని (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : రాజ్ సీతారాం, జానకి

ఏలా ఇంత దూరం నీవే నాకు ప్రాణం 
ఏలా ఇంత దూరం నీవే నాకు ప్రాణం
వేర్ ఆర్ యూనౌ యు టెల్ మీ నౌ
వేర్ ఆర్ యూనౌ యు లవ్ మీ నౌ
వేర్ ఆర్ యూనౌ
ఏలా ఇంత దూరం నీవే నాకు ప్రాణం 

చేమంతి పూదోటలో సాగే హేమంత రాగానివై
లేమంచు కవ్వింతలే రేగే నా ప్రేమ గీతిలా
దోసిళ్లలోని ఆశలన్నీ కౌగిళ్ల పూసి రాలిపోయె
నీకళ్ళలోని ఊసులన్ని నా పెళ్ళినాటి బాసలాయె 
పారాణిలా పదాలే తాకీ.. రేరాణిలా సుఖాలే పూసీ..
నీ పైటతో పదాలే రాసి ఆ పాటలో స్వరాలే పోసీ
ముద్దాడుకున్నాయి లే ప్రేమ క్రీనీడలై.. 

వేర్ ఆర్ యూనౌ యు టెల్ మీ నౌ
వేర్ ఆర్ యూనౌ యు టెల్ మీ నౌ
వేర్ ఆర్ యూనౌ

వేసంగి నిట్టూర్పులో ఏదో సన్నాయి పాడిందిలే 
ఆషాఢ నీరెండలో పూసే సంపెంగ పూలతో
ఆకాశమంత పందిరేసి భూదేవిలాగ వాలిపోయి 
అక్షింతలంటి తారలన్ని ఆనాటిదాక రాకపోయి 
నీ కళ్ళలో నిషానే తీసి కౌగిళ్ళనే హుషారే చేసి 
సంకెళ్ళతో సరాగాలాడి కన్నీళ్లతో వసంతాలాడి 
చెల్లించుకుందాములే చేసినా బాసలే.. 

వేర్ ఆర్ యూనౌ యూ ఆర్ మై లవ్
వేర్ ఆర్ యూనౌ యూ ఆర్ మై లవ్ 
వేర్ ఆర్ యూనౌ
ఏలా ఇంత దూరం నీవే నాకు ప్రాణం 
ఏలా ఇంత దూరం నీవే నాకు ప్రాణం

2 comments:

యెంత వరకూ నిజమో తెలీక పోయినా బాలూ గారితో డిఫరెన్సెస్ వచ్చినపుడు కృష్ణ గారు రాజ్ సీతారాం ని తీసుకొచ్చారని వినికిడి..యేదెలా ఉన్నా చాలా లేతగా కృష్ణ గారికి మాత్రమే సూట్ అయ్యే తమషా ఐన వాయిస్ ఆయనది..ఇక పాటంటారా..విన్న వారెవరూ దూరం కాలేరు..

అవునండీ కృష్ణ గారికి మాత్రమే సూట్ అయ్యే వాయిస్. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.