సోమవారం, డిసెంబర్ 29, 2014

నను పాలింపగ...

తన భక్తుడి కోసం సాక్షాత్ గోపాలుడే దిగివస్తే ఆ భక్తుడి ఆనందం ఎలా ఉంటుందో ఊహించగలరా... ఇదిగో బుద్దిమంతుడు సినిమాలోని ఈ పాట చూస్తే అతని ఆనందాతిశయాలు మనకి చక్కగా అర్ధమవుతాయి. మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దాశరధి
గానం : ఘంటసాల

వేయి వేణువులు మ్రోగేవేళా... ఆ... ఆ...
హాయి వెల్లువై పొంగేవేళా...
రాస కేళిలో తేలే వేళా...
రాధమ్మను లాలించే వేళ....

నను పాలింపగ నడచి వచ్చితివా..
మొరలాలింపగ తరలి వచ్చితివా... గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా...
మొరలాలింపగ తరలి వచ్చితివా... గోపాలా

నను పాలింపగ నడచి వచ్చితివా.. ఆ హా హా...

అర చెదరిన తిలకముతో.. అల్లదిగో రాధమ్మా..
అర జారిన పైయ్యెదతో.. అదిగదిగో గోపెమ్మా..
ఎరుపెక్కిన కన్నులతో.. ఇదిగిదిగో సత్యభామా..
పొద పొదలో.. యెద యెదలో.. 
నీ కొరకై వెదకుచుండగా

నను పాలింపగ నడచి వచ్చితివా
మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా .. ఆ హా హా...

కంసుని చెరసాలలో.. ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్ళలో.. ఖైదీవై పెరిగావు
కరకురాతి గుళ్ళలో.. ఖైదీవై నిలిచావు
ఈ భక్తుని గుండెలో.. ఖైదీగా.. ఉండాలనీ

నను పాలింపగ నడచి వచ్చితివా
మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా .. ఆ హా హా...
 

1 comments:

ఈ పాటలో నాగేశ్వరరావు గారి కనులు పలికించే భావాలూ, అమాయకమైన సున్నితత్త్వం, పసిపాప నవ్వూ, అనంతమైన భక్తి పారవశ్యం. ఆయనకే సాధ్యం..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.