మంగళవారం, డిసెంబర్ 02, 2014

కన్నుల్లో నీ బొమ్మ చూడు...

ఆలూమగలంటే ఒకరి గుండెల్లో ఒకరే కాదు కళ్ళలో సైతం గూడుకట్టుకుని కొలువై ఉండాలట అలా ఉన్న ఈ అందమైన జంటను చూడండి ఒకరిమీద ఒకరికున్న ప్రేమను ఎంత చక్కగా వ్యక్తపరచుకుంటున్నారో... ఈ చక్కని పాటను ఒక ఫ్రెండ్ ఈరోజు తన శ్రీవారి పుట్టినరోజు సందర్బంగా వారికి అంకితమిస్తూ పోస్ట్ చేయమని అడిగారు... మరి ఈ సంధర్బంగా వారికి విషెస్ అందిస్తూ ఈ పాటను మనమూ ఆస్వాదించేద్దామా. ఈ పాట ఆడియో మత్రమే వినాలంటే ఇక్కడ వినండి లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి.


చిత్రం : విమల (1960)
సంగీతం : సుబ్బయ్య నాయుడు
గీతరచయిత : ముద్దుకృష్ణ
నేపధ్య గానం : ఘంటసాల, రాధా జయలక్ష్మి

కన్నుల్లో నీ బొమ్మ చూడు...
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు...
అది కమ్మని పాటలు పాడు
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు...
అది కమ్మని పాటలు పాడు
కన్నుల్లో నీ బొమ్మ చూడు...

పున్నమ వెన్నెల వన్నెలలో...
.ఓ...ఓ.. ఆ...ఆ...
పున్నమ వెన్నెల వన్నెలలో...
కన్నుల కట్టిన రూపముతో...
నీవే మనసున తోచగా... ఆ...ఆ...
నీవే మనసున తోచగా...
నను నేనే మరిచిపోదురా...

కన్నుల్లో నీ బొమ్మ చూడు...
అది కమ్మని పాటలు పాడు
కన్నుల్లో నీ బొమ్మ చూడు...

కోయిల పాటల తీరులతో... ఓ...ఓ...
కోయిల పాటల తీరులతో...
సరిపోయిన రాగాలల్లుదమా...
సరిపోయిన రాగాలల్లుదమా...
నచ్చిన పూవు గద నేను...
నచ్చిన పూవు గద నేను..
కోరి వచ్చిన తుమ్మెద నీవేరా..

కన్నుల్లో నీ బొమ్మ చూడు...
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు

రాగమాలికల వీణ నీవే.... ఏ..ఏ...ఏ..
రాగమాలికల వీణ నీవే...
అనురాగములేలే జాణ నేనే..
అనురాగములేలే జాణ నేనే...
నీవే వలపుల జాబిలిరా... ఆ...ఆ..ఆ..
నీవే వలపుల జాబిలిరా...
మరి నేనే కులుకుల వెన్నెలరా...

కన్నుల్లో నీ బొమ్మ చూడు...
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు...
అది కమ్మని పాటలు పాడు
కన్నుల్లో నీ బొమ్మ చూడు...
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు...


6 comments:


వేణు శ్రీ కాంత్ గారు,

ఈ మధ్య బ్లాగు పనిలేక రమణ గారు హమ్మయ్యో వంటి నొప్పులు అంటూ టపా కి కామా పెట్టి మంచం ఎక్కేరు ! (అలక మంచం కాదు!)

వారు ఈ పాట చూసేరంటే(అదీ వారి ఫేవరైట్ సావిత్రి గారిది!) మళ్ళీ టపాల్మని మంచం మీది నించి దూకి పనిలేక పనిలో పడిపోవడం ఖాయం !!

మీ ఈ టపా వారికి కూడా అంకితం చెయ్యండి !!

బహు కాలం తరువాయ్
చీర్స్
జిలేబి

తప్పకుండా జిలేబి గారు మీ కోరిక పై అలాగే ఇచ్చేస్తాను :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

వేణు శ్రీకాంత్‌గారు,
పయనించే మన వలపుల బంగరు నావ- అనేపాట పరిచయం చేయకూడదూ వీలైతే?

ఈ రోజు మొదలు ఈ ధనుర్మాసం అయ్యే వరకూ ఒక నెల పాటు కేవలం కృష్ణుడి పాటలు మాత్రమే ప్రచురిస్తాను సుధామయి గారు. ఆ తర్వాత మీరడిగిన పాట తప్పక ప్రచురిస్తాను. థాంక్స్.

ఇష్టమైన వారిని కళ్లతో క్లిక్ చేస్తే..మనసులో ప్రింటై పోతారు..

అంతేనంటారా శాంతిగారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.