సోమవారం, డిసెంబర్ 15, 2014

నీ రూపమే...

అన్నదమ్ముల సవాల్ చిత్రం కోసం సత్యం గారి సంగీత సారధ్యంలో సినారె గారు రచించిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అన్నదమ్ముల సవాల్ (1978)
సంగీతం : సత్యం 
సాహిత్యం : సినారె
గానం: బాలు, సుశీల

నీ రూపమే..ఏ..ఏ..
నా మదిలోన తొలి దీపమే..
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో.. 
ఇది అపురూపమే..

నీ రూపమే...ఏ..ఏ...
నా మదిలోన తొలి దీపమే..
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో..
ఇది అపురూపమేనీ రూపమే..ఏ..ఏ.. 

ఆశలు లేని నా గుండెలోన...
అమృతము కురిసిందిలే..ఏ..
వెన్నెల లేని నా జీవితాన...
పున్నమి విరిసిందిలే...ఏ..నీవూ నేనూ తోడూ నీడై...
వీడక వుందాములే.. ఏ ఏ ..
వీడక వుందాములే ...ఏ..

నీ రూపమే...ఏ..ఏ...
నా మదిలోన తొలి దీపమే..
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో...
ఇది అపురూపమే ...
నీ రూపమే..ఏ...ఏ..

లేతలేత హృదయంలో...
వలపు దాచి వుంటాను
నా వలపు నీకే సొంతమూ...
నిన్ను చూచి మురిశాను...
నన్ను నేను మరిచాను ...
నీ పొందు ఎంతో అందమూ ..
ఏ పూర్వ పుణ్యమో..ఏ దేవి దీవెనో ..
వేసెను విడరాని బంధమూ...ఊఊ
వేసెను విడరాని బంధమూ...

నీ రూపమే..ఏ..ఏ..
నా మదిలోన తొలి దీపమే..మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో..
ఇది అపురూపమే ..ఏ...ఏ..
నీ రూపమే...ఏ...ఏ..
 

2 comments:

పిల్లతెమ్మెరలా స్పృశించే పాట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.