ఆదివారం, డిసెంబర్ 21, 2014

మధురానగరిలో చల్లనమ్మబోదు...

నల్లనయ్య ఎంతటి అల్లరివాడో మనకి తెలియనిదేముంది... పాపం ఈ గోపికమ్మ అవస్థ చూడండి. ఈమె కోసం దారి కాచిన కన్నయ్య తను మాపటి వేళకు వస్తానన్నా మాట వినకుండా కొంగు పట్టుకుని కొసరి కొసరి సరసమాడుతున్నాడు. మిగిలిన గోపకాంతలు వస్తారు దారి విడువమని ఎలా వేడుకుంటోందో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడా వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : త్యాగయ్య (1981)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై
గానం : వాణిజయరాం

ఆఆఅ.....ఆఆఆ...ఆఅ..ఆ
మధురానగరిలో చల్లనమ్మ బోదు
దారివిడుము కృష్ణా! కృష్ణా!

మధురానగరిలో చల్లనమ్మ బోదు
దారివిడుము కృష్ణా!

మాపటివేళకు తప్పక వచ్చెద
మాపటివేళకు తప్పక వచ్చెద
పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా! కృష్ణా!
మాపటివేళకు తప్పక వచ్చెద
పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా!

మధురానగరిలో చల్లనమ్మబోదు
దారివిడుము కృష్ణా! 

కొసరి కొసరి నాతో సరసములాడకు,
రాజమార్గమిది కృష్ణా! కృష్ణా!
కొసరి కొసరి నాతో సరసములాడకు,
రాజమార్గమిది కృష్ణా! కృష్ణా!
వ్రజ వనితలు నను చేరవత్తురిక
వ్రజ వనితలు నను చేర
వత్తురిక
విడువిడు నా చేయి కృష్ణా! కృష్ణా!

మధురానగరిలో చల్లనమ్మపోదు
దారివిడుము కృష్ణా! కృష్ణా!


1 comments:

అల్లరివాడంటూనే ఆ అల్లరి నల్లనయ్యని వీడి ఉండలేని గోపికాంతలు యెంతో అదృష్టవంతులు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.