ఎమ్మెస్ విశ్వనాధం గారి స్వర సారధ్యంలో వాణీజయరాం గారు గానం చేసిన ఈ మధురమైన గీతాన్ని ఈరోజు తలచుకుందాం. తన జీవితాన్ని కృష్ణునికి అంకితం చేసి, శ్రీకృష్ణ తత్వాన్ని తన కథలో పొదువుకున్న ఈపాట వీనుల విందుగా ఉంటుంది. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : మొరటోడు (1977)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : సినారె
గానం : వాణీ జయరాం
హే కృష్ణా....ఆ....హే కృష్ణా...ఆ..
కృష్ణా...ఆ....హే కృష్ణా....ఆ...
మళ్ళీ నీవే జన్మిస్తే...
నీ భగవద్గీతే నిజమైతే...
హే కృష్ణా....ఆ...
మళ్ళీ నీవే జన్మిస్తే...
నీ భగవద్గీతే నిజమైతే...
ప్రతి సుమవనమూ బృందావనమూ...
ప్రతి సుమవనమూ బృందావనమూ...
ప్రతి మూగమోవీ... మోహనమురళి
కృష్ణా....ఆ...
మళ్ళీ నీవే జన్మిస్తే...
నీ భగవద్గీతే నిజమైతే...
నీవు నేను వేరు కాదు...
ఇద్దరు ఊరు వేరు కాదు
నీవు నేను వేరు కాదు...
మన ఇద్దరి ఊరు వేరు కాదూ...ఊ..ఊ..
ఆడేది పాడేది నేను కాదు...
నా ఆటలో పాటలో...
నీ లయ లేక పోలేదు...
ఆడేది పాడేది నేను కాదు...
నా ఆటలో పాటలో...
నీ లయ లేక పోలేదు...
అందరి చూపు నా పైనా...
మరి నా చూపేమో నీ పైనా...
కృష్ణా....మళ్ళీ నీవే జన్మిస్తే...
నీ భగవద్గీతే నిజమైతే....
గోవులు కాస్తు నీవుంటావు...
జీవిక సాగిస్తూ ఉంటావు
గోవులు కాస్తూ నీవుంటావు...
నీ జీవిక సాగిస్తు ఉంటావు...ఊ...ఊ...
పలికించు నీ వేణు గీతానికీ...
ఫలితము ఎన్నడూ కోరుకోవులే నీవు
పలికించు నీ వేణు గీతానికి...
ఫలితము ఎన్నడూ కోరుకోవులే నీవు
నీ కథలోనా నేనున్నాను...
నీ కథలోనా నేనున్నాను...
నా కథలోనా నీవున్నావు
కృష్ణా....మళ్ళీ నీవే జన్మిస్తే...
నీ భగవద్గీతే నిజమైతే...
1 comments:
గోపికా లోలుడే కాదు..గీతాచార్యుడూ అయిన కృష్ణయ్య మళ్లీ మళ్ళీ కనులముందుకు రావాలని కోరుకోని వారెవ్వరు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.